AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Instagram: ఇక రీల్స్ ఎడిటింగ్ చాలా సులభం ..ఇన్‌స్టా యూజర్లకు పండగే..!

ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా ఎంతో ప్రజాదరణ పొందింది. దీనిలోని అనేక ప్లాట్ ఫాంలలో ఇన్ స్టాగ్రామ్ ఒకటి. ఫేస్ బుక్ తరహాలో కోట్ల మంది యూజర్లు దీన్ని ఫాలో అవుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో వినియోగదారులు తమ ఫొటోలు, వీడియోలను ఇతరులతో పంచుకోవచ్చు. ఇటీవల కాలంలో చాలామంది రీల్స్ ను అప్ లోడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు యాజమాన్య సంస్థ మెటా శుభవార్త చెప్పింది. ఫోన్ లోనే రీల్స్ ను రూపొందించడానికి కొత్త యాప్ ను ప్రారంభించింది. దాని ప్రత్యేకతలు, ఉపయోగించే విధానాలను తెలుసుకుందాం.

Instagram: ఇక రీల్స్ ఎడిటింగ్ చాలా సులభం ..ఇన్‌స్టా యూజర్లకు పండగే..!
Instagram
Nikhil
|

Updated on: Apr 27, 2025 | 4:45 PM

Share

మెటా ఎడిట్స్ యాప్ ద్వారా చిన్న వీడియోలను ఎడిటింగ్ చేసుకోవచ్చు. రీల్స్ తో పాటు షాట్స్ తదితర వాటిని సవరించుకునే వీలుంటుంది. అలాగే గ్రీన్ స్క్రీన్, ట్రాన్సిషన్లు, టైమ్ లైన్ ఎడిటింగ్ తదితర మంచి ఫీచర్లు ఉన్నాయి. ఈ కొత్త మొబైల్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉంది. దీన్ని ఉపయోగించి స్మార్ట్ ఫోన్ నుంచి నేరుగా ఇన్ స్టాగ్రామ్ రీల్స్, వీడియోలను రికార్డు చేయడానికి, ఎడిటింగ్ చేయడానికి, ట్రాన్స్ ఫర్ చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. గతంలో వీడియోల రికార్డింగ్, ఎడిటింగ్, అప్ లోడ్ కోసం ఎక్కువ యాప్ లను వినియోగించాల్సి వచ్చేది. మోటా ఎడిట్స్ యాప్ ద్వారా ఆ ఇబ్బందులు తప్పాయి. ఆ పనులన్నింటినీ ఈ ఒక్క యాప్ ద్వారా చేసుకునే అవకాశం కలిగింది. ఇన్ స్టాగ్రామ్ లోని అంతర్నిర్మిత సాధనాల మాదిరిగా కాకుండా ఒక ప్రత్యేక అప్లికేషన్ మాదిరిగా మెటా ఎడిట్స్ పనిచేస్తుంది. దీని వల్ల కలిగే ఉపయోగాలను ఇలా ఉన్నాయి.

రికార్డింగ్

ఎడిట్ యాప్ ద్వారా యూజర్లను వీడియో క్లిప్ లను చిత్రీకరించవచ్చు. వీటి వ్యవధి గరిష్టంగా పది నిమిషాలు ఉంటుంది. వివిధ యాప్ లకు మారకుండానే పొడవైన వీడియోలను రూపొందించవచ్చు.

ఎడిటింగ్

యాప్ లోనే వీడియో క్లిప్ లను ఎడిటింగ్ చేసుకోవచ్చు. వాటికి విజువల్ ఎఫెక్టులను జోడించవచ్చు. అలాగే గ్రీన్ స్క్రీన్ సదుపాయం కూడా ఉంది. తద్వారా యూజర్లకు చాలా ఉపయోగం కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

అప్ లోడ్

ఎడిటింగ్ చేసిన వీడియోలను ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, ఇతర ప్లాట్ ఫాంలలో చాలా సులభంగా అప్ లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా పని జరుగుతుంది.

పనితీరు

అప్ లోడ్ చేసిన వీడియోను వీక్షకులు ఎలా స్వీకరించారో తెలుసుకునేందుకు డేటా కనిపిస్తుంది. దీని ద్వారా కంటెంట్ ను వీక్షకులు ఎలా స్వీకరిస్తున్నారో తెలుసుకోవచ్చు.

డౌన్ లోడ్ చేసుకునే విధానం

ఎడిట్స్ యాప్ ను యాప్ స్టోర్, గూగుల్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. యూజర్లు తమ ఇన్ స్టాగ్రామ్ ఆధారాలను ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత వినియోగదారులు యాప్ లో వీడియోలను రికార్డు చేసుకోవచ్చు. తమ ఫోన్ గ్యాలరీ నుంచి పుటేజ్ ను డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత యాప్ లోని ఫీచర్లను ఉపయోగించి క్లిప్ లను సవరించడం, కత్తిరించడం, వివిధ ఎఫెక్టులను జోడించడం చేయవచ్చు. అనంతరం వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో అప్ లోడ్ చేసుకోవచ్చు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి