AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anant Ambani: అనంత్ అంబానీ ఈ విషయాలకు అత్యంత ప్రసిద్ధి చెందారు.. అవేంటో తెలుసా..?

Anant Ambani: ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన విలాసవంతమైన జీవనశైలి, వ్యాపారం, సామాజిక కార్యక్రమాలకు చాలా ప్రసిద్ధి చెందారు. అనంత్ అంబానీ నికర విలువ దాదాపు రూ.3.3 లక్షల కోట్లు. ఈ సంపద ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో..

Anant Ambani: అనంత్ అంబానీ ఈ విషయాలకు అత్యంత ప్రసిద్ధి చెందారు.. అవేంటో తెలుసా..?
Subhash Goud
|

Updated on: Apr 27, 2025 | 3:44 PM

Share

రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ జంతువుల పట్ల తనకున్న లోతైన ప్రేమకు, తన “వంతరా” వన్యప్రాణుల సంరక్షణ ప్రాజెక్టుకు ప్రసిద్ధి చెందారు. గత సంవత్సరం ఆయన రాధిక మర్చంట్ ను వివాహం చేసుకున్నారు. అనంత్ వివాహ వేడుకలు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగాయి. ఇది వైభవం, సంప్రదాయాల సమ్మేళనం. ఈ వివాహ వేడుకకు అంతర్జాతీయ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖ అతిథులు హాజరయ్యారు. బంగారం, వెండితో అలంకరించబడిన కార్డును ప్రదర్శించే వారి వివాహ ఆహ్వాన కార్డు చిన్న క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన విలాసవంతమైన జీవనశైలి, వ్యాపారం, సామాజిక కార్యక్రమాలకు చాలా ప్రసిద్ధి చెందారు. అనంత్ అంబానీ నికర విలువ దాదాపు రూ.3.3 లక్షల కోట్లు (సుమారు $40 బిలియన్లు) ఉంటుందని అంచనా. ఈ సంపద ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో అతని 0.12% వాటా నుండి వచ్చింది. ఇది దాదాపు 80.5 లక్షల షేర్లకు సమానం.

ఆయన వివాహం, వివాహానికి ముందు జరిగిన వేడుకలు దేశంలోనే కాదు, విదేశాలలో కూడా చర్చనీయాంశమయ్యాయి. భారతదేశం, విదేశాల నుండి ప్రత్యేక అతిథులు, ప్రపంచంలోని అగ్రశ్రేణి బిలియనీర్ వ్యాపారవేత్తలను వారి వివాహానికి ఆహ్వానించారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతురాలైన గాయని రిహన్న కూడా వారి వివాహానికి ముందు ప్రదర్శన ఇచ్చింది. దీని కోసం ముఖేష్ అంబానీ రూ.74 కోట్ల భారీ పారితోషకం కూడా ఇచ్చారని నివేదికలు చెబుతున్నాయి. వారి మొదటి ప్రీ-వెడ్డింగ్ కోసం రూ.1200 కోట్లు ఖర్చు చేశారు. కాగా, అనంత్ – రాధిక వివాహానికి మొత్తం ఖర్చు రూ. 5 వేల కోట్లు.

రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో అనంత్ అంబానీ ఇంధన వ్యాపారాన్ని, ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీని నడిపిస్తున్నారు. 2035 నాటికి కంపెనీని ‘నికర కార్బన్ జీరో’గా మార్చడమే అతని లక్ష్యం. దీనితో పాటు, అతను జియో ప్లాట్‌ఫారమ్‌లు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ల బోర్డులో కూడా చురుకైన పాత్ర పోషిస్తాడు. దీని కారణంగా కంపెనీ అభివృద్ధికి అతని సహకారం నిరంతరం పెరుగుతోంది.

జీతం, ఆదాయ వనరు

రిలయన్స్ ఇండస్ట్రీస్ నుండి అనంత్ అంబానీకి వార్షిక జీతం దాదాపు రూ.4.2 కోట్లు. అయితే, అతని ఆదాయంలో ఎక్కువ భాగం డివిడెండ్లు, పెట్టుబడుల నుండి వస్తుంది. ఇవి అతని సంపదను నిరంతరం పెంచుతున్నాయి.

అత్యంత ఖరీదైన బహుమతి:

అనంత్ అంబానీ తన వివాహ బహుమతులకు కూడా అత్యంత ప్రసిద్ధి చెందారు. వివాహ సందర్భంగా షారుఖ్ ఖాన్ వారికి ఫ్రాన్స్‌లో అత్యంత ఖరీదైన 40 కోట్ల రూపాయల అపార్ట్‌మెంట్‌ను బహుమతిగా ఇచ్చాడు. అదే సమయంలో అతని తండ్రి ముఖేష్ అంబానీ కూడా అనంత్ అంబానీకి దుబాయ్‌లోని పామ్ జుమైరాలో రూ.640 కోట్ల విలువైన విలాసవంతమైన విల్లాను బహుమతిగా ఇచ్చారు. ఇందులో 10 బెడ్‌రూమ్‌లు, ప్రైవేట్ స్పా, ఇండోర్, అవుట్‌డోర్ పూల్స్, 70 మీటర్ల పొడవైన ప్రైవేట్ బీచ్ ఉన్నాయి.

వన్యప్రాణుల రక్షణ కేంద్రం

మార్చి 2025లో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వంతరా వన్యప్రాణుల పునరావాసం, రక్షణ కేంద్రాన్ని అనంత్ అంబానీ ప్రారంభించారు. 3,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కేంద్రంలో 43 జాతులకు చెందిన 2,000 కి పైగా జంతువులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.

కోట్ల విలువైన గడియారాలు

అనంత్ అంబానీకి ఖరీదైన గడియారాలు అంటే చాలా ఇష్టం. భారతదేశంలోని అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ ఇటీవల తన గడియారాలలో ఒకదాని కారణంగా వెలుగులోకి వచ్చారు. అతని దగ్గర కోట్ల విలువైన గడియారాలు ఉన్నాయి. రిచర్డ్ మిల్లె నుండి పాటెక్ ఫిలిప్ వరకు, అతను అనేక లగ్జరీ, డిజైనర్ లిమిటెడ్ ఎడిషన్ గడియారాలను కలిగి ఉన్నాడు. అనంత్ అంబానీ అరుదైన గడియారాలను సేకరించేవారు. అతని దగ్గర పటేక్ ఫిలిప్ గ్రాండ్‌మాస్టర్ చైమ్ వాచ్ ఉంది. దీని ధర రూ.18 కోట్లకు పైగా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ మోడల్‌ హోండా బైక్‌ల రీకాల్‌.. వైరింగ్‌లో లోపం..
ఈ మోడల్‌ హోండా బైక్‌ల రీకాల్‌.. వైరింగ్‌లో లోపం..
పేర్లు నచ్చలేదని ఇంత దారుణమా..?
పేర్లు నచ్చలేదని ఇంత దారుణమా..?
మీకో సవాల్.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3ముఖాలను గుర్తిస్తే మీరే తోపు
మీకో సవాల్.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3ముఖాలను గుర్తిస్తే మీరే తోపు
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి