Find a Lost Mobile Phone: మీ ఫోన్ పోయిందా? ఐఫోన్ అయినా ఆండ్రాయిడ్ అయినా.. ఏదైనా క్షణాల్లో ఇట్టే ట్రాక్ చేసి కనిపెట్టవచ్చు!

మీ మొబైల్ ఫోన్ పోయిందా? కంగారపడకండి.. మీ స్మార్ట్ ఫోన్ ఎక్కడికి పోలేదు.. ఈజీగా దొరికేస్తుందిలే.. ఎలా గుర్తించాలో తెలుసా?

Find a Lost Mobile Phone: మీ ఫోన్ పోయిందా? ఐఫోన్ అయినా ఆండ్రాయిడ్ అయినా.. ఏదైనా క్షణాల్లో ఇట్టే ట్రాక్ చేసి కనిపెట్టవచ్చు!
Track Your Lost Mobile Phone
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 02, 2021 | 2:01 PM

Track Your Lost Mobile Phone: మీ మొబైల్ ఫోన్ పోయిందా? కంగారపడకండి.. మీ స్మార్ట్ ఫోన్ ఎక్కడికి పోలేదు.. ఈజీగా దొరికేస్తుందిలే.. ఎలా గుర్తించాలో తెలుసా? సాధారణంగా అందరికి తెలిసిందే.. ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్ల కోసం ప్రత్యేకించి టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఫోన్ జాడ కనిపెట్టే ఈ టూల్స్ మీ ఫోన్ ఎక్కడ పొగట్టుకున్నారో వెతికి పెడతాయి. మీ ఫోన్ లొకేషన్ కూడా ట్రాక్ చేస్తాయి. ఇంతకీ మీ ఫోన్ ఏంటి? ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్.. ఏ ఫోన్ అయినా ఇట్టే కనిపెట్టేయొచ్చు. ఒకవేళ మీ ఫోన్ టర్న్ ఆఫ్ లేదా స్విచ్ఛాఫ్ అయితే ఎలా? అంటారా? కొంచెం కష్టమే.. ఇలాంటి సందర్భాల్లో ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం ప్రత్యేకించి టూల్స్ ఉన్నాయి. ఇందులో ఐఫోన్ వెర్సస్ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏయే ఎక్కడ పొగట్టుకున్నారో తెలుసుకోవచ్చు. అదేలానో చూద్దాం..

ఫోన్‌ పోయిందంటే సర్వమూ పోయినట్టే! ఒక మర మనిషిని దూరం చేసుకున్నంత ఫీలింగ్ అంటే అతిశయోక్తిగా అనిపించినా ప్రస్తుత పరిస్థితి ఇదే. ఎన్నో కాంట్రాక్టులు, ఎన్నో మెసేజ్‌లు, మరెన్నో ఫొటోలు, వీడియోలు! బ్యాంకు ఖాతాలైనా, చెల్లింపు యాప్‌లైనా, సామాజిక మాధ్యమాలైనా అన్నీ ఫోన్‌తో ముడిపడినవే. కాబట్టే ఒక్క క్షణం ఫోన్‌ కనిపించకపోయినా గుండె గుభేలుమంటుంది. ఇక, ఎవరైనా దొంగిలిస్తే చెప్పేదేముంది? చేతులు కట్టేసినట్టే అవుతుంది. మన వ్యక్తిగత సమాచారమంతా రట్టయిపోతుంది. అయితే, అంత గాబరా పడాల్సిన పనిలేదు. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో నిక్షిప్తమై ఉండే టూల్స్‌తో ఫోన్‌ని గుర్తించే మార్గాలు లేకపోలేదు.

వీటిల్లోని ఫైండ్‌ మై ఐఫోన్‌తో ఎక్కడున్నా ఇట్టే పట్టుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ ఫోన్లలోని ‘ఫైండ్‌ మై డివైస్‌’ గురించే చాలామందికి తెలియకపోవచ్చు. ఫోన్‌ లొకేషన్‌ను గుర్తించటానికి, ఎవరైనా ఫోన్‌ను దొంగిలిస్తే దానిలోని సమాచారాన్ని కాపాడుకోవటానికిది సాయం చేస్తుంది. కనిపించకుండా పోయిన ఫోన్‌ను గుర్తించటమనగానే ముందుగా ఐఓఎస్‌ పరికరాలే గుర్తుకొస్తాయి. ఐఫోన్ల కోసం స్పెషల్ టూల్ ఒకటి అందుబాటులో ఉంది. అదే.. Find My iPhone టూల్. మీ ఐఫోన్ లొకేషన్ కనిపెట్టడంలో ఈ టూల్ ఎంతో బెస్ట్ అని చెప్పాలి. మీ ఫోన్‌తో ఎక్కడున్నా ఇట్టే పట్టుకోవచ్చు.

  • ముందుగా మీరు iCloud.comలోకి వెళ్లండి.
  • అక్కడ Find My iPhone టూల్ యాక్సస్ చేయండి.
  • ఇందులో మీరు సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది.
  • అక్కడే All Devices అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  • ఆ జాబితాలో మీరు పొగట్టుకున్న ఫోన్ సెలక్ట్ చేయండి.
  • మీకు స్ర్కీన్ పై.. ఫోన్ లొకేషన్‌తో కూడిన ఒక మ్యాప్ కనిపిస్తుంది.

ఇక సాధారణ ఐఓఎస్ ఫోన్లలో అయితే…

  • ముందుగా సెటింగ్స్‌లోకి వెళ్లి, సెక్యూరిటీ ఆప్షన్‌ ద్వారా ప్రైవసీలోకి వెళ్లాలి.
  • ఫైండ్‌ మై డివైస్‌ను ఆన్‌ చేయాలి. చాలా ఫోన్లలో ఇది ఆఫ్‌ చేసి ఉంటుంది.
  • దీని కింద ఫైండ్‌ మై డివైస్‌, వెబ్‌, గూగుల్‌ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
  • ఫైండ్‌ మై ఫోన్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోనట్టయితే ప్లే స్టోర్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  • దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక ఓపెన్‌ చేస్తే గూగుల్‌ మ్యాప్‌ మాదిరిగా కనిపిస్తుంది.
  • ఇది పనిచేయాలంటే ఫోన్‌లో లొకేషన్‌ ఆన్‌ చేసి ఉంచాలి.
  • అప్పుడే మ్యాప్‌లో ఫోన్‌ ఉన్నచోటు కనిపిస్తుంది.
  • ఇందులో ప్లే సౌండ్‌, సెక్యూర్‌ డివైస్‌, ఎరేజ్‌ డివైస్‌ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి.
  • వీటిల్లో ఎరేజ్‌ డివైస్‌ బూడిద రంగులో ఉంటుంది.
  • ఎందుకంటే దీన్ని అదే పరికరం నుంచి ఉపయోగించుకోలేం. వెబ్‌ లేదా ఇతర పరికరం ద్వారానే ఎరేజ్‌ చేయటానికి వీలుంటుంది.

* ఎప్పుడైనా ఫోన్‌ కనిపించనప్పుడు, ఎవరైనా దొంగిలించినప్పుడు వెబ్‌ ఇంటర్‌ఫేస్‌తో గుర్తించొచ్చు. ముందుగా https://www.google.com/android/find లోకి వెళ్లాలి.

*గూగుల్‌ ఖాతాలోకి సైన్‌ ఇన్‌ అయ్యాక ఎడమ వైపున మన ఫోన్‌ కనిపిస్తుంది.

*ప్లే సౌండ్‌ను ఎంచుకుంటే ఐదు నిమిషాల సేపు ఫోన్‌ రింగ్‌ అవుతుంది.

*సైలెంట్‌ మోడ్‌లో ఉన్నా, స్విచాఫ్‌ అయినా ఫోన్‌ రింగ్‌ అవుతుంది.

*ఫోన్‌ దొరికిన వారిని హెచ్చరించేందుకు మెసేజ్‌ కూడా పంపించొచ్చు.

*స్క్రీన్‌ లాక్‌ అయినా వారికి మెసేజ్‌ కనిపిస్తుంది.

*ఫోన్‌ను లాక్‌ చేయాలనుకుంటే ‘సెక్యూర్‌ డివైస్‌’ మీద క్లిక్‌ చేసి, గూగుల్‌ ఖాతా నుంచి సైన్‌ అవుట్‌ కావాలి.

*ఇక ‘ఎరేజ్‌ డివైస్‌’ ఆప్షన్‌తో ఫోన్‌లోని సమాచారాన్నంతా డిలీట్‌ చేయొచ్చు. ఇందుకోసం మళ్లీ సైన్‌ ఇన్‌ కావాలి.

*ఒకసారి సమాచారం ఎరేజ్‌ అయితే ఇక ఎప్పటికీ ఫోన్‌ ఎక్కడున్నదీ గుర్తించలేం.

*ఒకవేళ కంప్యూటర్‌ అందుబాటులోకి లేకపోతే ఇతర ఆండ్రాయిడ్‌ పరికరంతోనూ ఫైండ్‌ మై డివైస్‌ యాప్‌లోకి సైన్‌ఇన్‌ అయ్యి లొకేషన్‌ను గుర్తించొచ్చు.

* సామ్‌సంగ్‌ గెలాక్సీ ఫోన్లలో ఫైండ్‌ మై డివైస్‌తో పాటు అదనంగా ఫైండ్‌ మై మొబైల్‌ ఆప్షన్‌ కూడా ఉంటుంది.

పోగట్టుకున్న ఫోన్ లాక్ చేయడం ఎలానంటే? :

ఫోన్లో మీ సమాచారాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే లాక్ స్ర్కీన్ ఎంతో బెటర్.. ఐఫోన్లలో అయితే Lost Mode iPhone, అదే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ నుంచి Lock My Phone ఆప్షన్ ఎంచుకోవాలి. అప్పుడు మీ ఫోన్ ఎక్కడ ఉన్నా ఆటో లాక్ అయిపోతుంది. మీ ఫోన్ దొంగిలించినవారు మీ ప్రైవేటు ఫొటోలు, బ్యాంకు యాప్స్ లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని యాక్సస్ చేయలేరు.

మీ ఐఫోన్ కోల్పోతే.. మీ ఫోన్ స్ర్కీన్ రిమోట్ గా లాక్ వేయొచ్చు. ఒకవేళ మీరు ఫోన్ పాస్ వర్డ్ సెటప్ చేయకపోయినా ఈ ప్రాసెస్ చేయొచ్చు.

– Find My iPhone ఆప్షన్‌లోకి వెళ్లండి. – Log in అవ్వండి. – స్ర్కీన్ టాప్‌లో డివైజ్ మెనూపై క్లిక్ చేయండి. – ఇక్కడే మీరు lost iPhone ఆప్షన్ ఎంచుకోండి. – Lost Mode ఆప్షన్ పై క్లిక్ చేయండి. – కాంటాక్ట్ నెంబర్ ఎంచుకోండి. – Next ఆప్షన్ పై కూడా ఎంచుకోండి. – మీ ఫోన్ ఎవరికైనా దొరికితే కనిపించేలా మెసేజ్ ఇక్కడ టైప్ చేయండి. – Done పై క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్ ఫోన్లలో..

Find My Device Tool సెలక్ట్ చేసుకోండి. వెంటనే మీ ఫోన్ లాక్ అయిపోతుంది. ఒకవేళ మీరు పాస్ వర్డ్ లేదా పిన్ లేదా ప్యాటరన్ ఏది సెట్ చేసినా కూడా లాక్ వేయొచ్చు.

– Find My Device లోకి వెళ్లండి. – గూగుల్ అకౌంట్ ద్వారా Log in అవ్వండి. అది కూడా మీ ఫోన్ అసోసియేట్ అయి ఉండాలి. – మీరు ఒక ఫోన్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే.. టాప్ స్ర్కీన్ పై మెనూ సెలక్ట్ చేయండి. – Secure Device ఆప్షన్ పై క్లిక్ చేయండి. – మీ ఫోన్ ఎవరికైనా దొరికితే కనిపించేలా మెసేజ్ ఇక్కడ టైప్ చేయండి. – Secure Device పై క్లిక్ చేయండి.

ఇతర యాప్‌ల ద్వారా ఫోన్ గుర్తింపు..

ఇతరుల చేతికి చిక్కిన ఫోన్లను గుర్తించటానికి థర్డ్‌ పార్టీ యాప్‌లు, యాంటీ థెఫ్ట్‌ యాప్‌లూ కూడా అందుబాటులో ఉన్నాయి.

సెర్బరస్‌: (www.cerberusapp.com) వెబ్‌సైట్‌ ద్వారా, నమోదు చేసుకున్న ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌ పంపించటం, తనకు తానే హెచ్చరికలు జారీ చేయటం.. ఇలా మూడు రకాలుగా ఫోన్‌ను కాపాడుతుంది. అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని, ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఫోన్‌ దొంగిలించినవారు దీన్ని అన్‌ఇన్‌స్టాల్‌ చేయాలన్నా కుదరదు. వెంటనే ఫోన్‌ షట్‌డౌన్‌ అయినట్టూ ‘నటిస్తుంది’! దొంగలు చేసే మొదటి పని సిమ్‌ మార్చటం. అయినా సెర్బరస్‌ ఊరుకోదు. అసలు సిమ్‌ నంబర్‌ను అధికారిక సిమ్‌ నంబరుగా స్టోర్‌ చేసేస్తుంది. నమోదు చేసుకొన్న మొబైల్‌ నంబర్లకు కొత్త సిమ్‌ సమాచారాన్ని, ఫోన్‌ లొకేషన్‌ను చేరవేస్తుంది. Find My Phone3 మెకాఫీ మొబైల్‌ సెక్యూరిటీ: యాంటీవైరస్‌ యాప్‌ అయిన ఇందులో ‘డివైస్‌ లాక్‌ సెక్యూరిటీ’ వంటి యాంటీ థెఫ్ట్‌ పీచర్లూ ఉంటాయి. ఎవరైనా మూడు సార్లు తప్పుడు పిన్‌ నంబరును ఎంటర్‌ చేస్తే ఫోన్‌ దానంతటదే లాక్‌ అవుతుంది. దీనిలోని ‘ఫైండ్‌ మై ఫోన్‌’ ఫీచర్‌తో మ్యాప్‌లో పరికరం ఎక్కడున్నదీ తెలుసుకోవచ్చు. అన్నింటికన్నా మంచి ఫీచర్‌ ‘థీఫ్‌ క్యామ్‌’ ఇది దొంగిలించిన వారి ఫొటోనూ తీస్తుంది మరి. ప్రే యాప్: ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లను గుర్తించటానికిది మంచి యాప్‌. అన్ని పరికరాలనూ ఒకే అకౌంట్‌తో నిర్వహించొచ్చు. ఇది జీపీఎస్‌ ద్వారా పరికరాలను ట్రాక్‌ చేస్తుంది. జియోఫెన్సింగ్‌ చేస్తుంది. Find My Phone6 ఫోన్‌ యాంటీ థెఫ్ట్‌ అలారం: మన జేబులోంచి ఎవరైనా ఫోన్‌ను దొంగిలించటానికి ప్రయత్నిస్తే ఇది వెంటనే మోగుతూ… బిత్తర పోయేలా చేస్తుంది. Find My Phone5 Read Also…. HCL Recruitment: గుడ్‌న్యూస్‌.. హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ ఎలక్ట్రిషన్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

మనదేశంలో ఈఆలయాల్లో డ్రెస్‌కోడ్ జీన్స్, స్కర్ట్స్ ధరిస్తే నోఎంట్రీ
మనదేశంలో ఈఆలయాల్లో డ్రెస్‌కోడ్ జీన్స్, స్కర్ట్స్ ధరిస్తే నోఎంట్రీ
తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2025 షెడ్యూల్‌ వచ్చేసింది
తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2025 షెడ్యూల్‌ వచ్చేసింది
నన్ను గెలికినప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలో కలకలం
నన్ను గెలికినప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలో కలకలం
ఈ ఘటన తలచుకుంటేనే కన్నీళ్లు పెట్టిస్తోంది..!
ఈ ఘటన తలచుకుంటేనే కన్నీళ్లు పెట్టిస్తోంది..!
రైతు బిడ్డ కాస్త రాయల్ బిడ్డ అయ్యాడు.. పల్లవి ప్రశాంత్ ఫొటోస్
రైతు బిడ్డ కాస్త రాయల్ బిడ్డ అయ్యాడు.. పల్లవి ప్రశాంత్ ఫొటోస్
కానిస్టేబుళ్ల నియామకంలో వారిని ప్రత్యేకకేటగిరీగా పరిగణించాల్సిందే
కానిస్టేబుళ్ల నియామకంలో వారిని ప్రత్యేకకేటగిరీగా పరిగణించాల్సిందే
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, షమీ రిటైర్మెంట్ పై జోరుగా చర్చ
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, షమీ రిటైర్మెంట్ పై జోరుగా చర్చ
బెండకాయతో బోలెడన్నీ బెనిఫిట్స్‌.. షుగర్, కొలెస్ట్రాల్‌కు చెక్
బెండకాయతో బోలెడన్నీ బెనిఫిట్స్‌.. షుగర్, కొలెస్ట్రాల్‌కు చెక్
అమ్మో.. 880 కోట్ల రూపాయలను వదిలేసిన పాలసీదారులు..!
అమ్మో.. 880 కోట్ల రూపాయలను వదిలేసిన పాలసీదారులు..!
వరల్డ్‌లోనే పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్
వరల్డ్‌లోనే పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..