AI: ఏఐ అంటే ప్రశ్నలకు జవాబులు ఇవ్వడమే కాదు.. మరెన్నో పనులు చేస్తుందని తెలుసా.?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌.. ప్రస్తుతం ఎక్కడ విన్నే దీనికి సంబంధించిన వార్తలే వస్తున్నాయి. దాదాపు అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనివార్యంగా మారింది. అయితే మనలో చాలా మందికి ఏఐ అనగానే చాట్‌బాట్‌లే గుర్తొస్తాయి. మనం అడిగే ప్రతీ ప్రశ్నకు సమాధానం ఇస్తాయి ఈ చాట్‌బాట్‌లు. అయితే ఏఐ కేవలం ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాకుండా...

AI: ఏఐ అంటే ప్రశ్నలకు జవాబులు ఇవ్వడమే కాదు.. మరెన్నో పనులు చేస్తుందని తెలుసా.?
Artificial Intelligence
Follow us

|

Updated on: Jul 11, 2024 | 4:54 PM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌.. ప్రస్తుతం ఎక్కడ విన్నే దీనికి సంబంధించిన వార్తలే వస్తున్నాయి. దాదాపు అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనివార్యంగా మారింది. అయితే మనలో చాలా మందికి ఏఐ అనగానే చాట్‌బాట్‌లే గుర్తొస్తాయి. మనం అడిగే ప్రతీ ప్రశ్నకు సమాధానం ఇస్తాయి ఈ చాట్‌బాట్‌లు. అయితే ఏఐ కేవలం ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాకుండా, మరెన్నో పనులను చేసి పెడుతుందని మీకు తెలుసా.? ఏఐని ఏయే రంగాల్లో ఉపయోగిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

* వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా మెషిన్‌ లెర్నింగ అల్గిథమ్‌ల ద్వారా వైద్య డేటాను చిత్రాలను విశ్లేషిస్తున్నారు. వీటిలో ప్రధానమైనవి సీటీ స్కాన్‌, ఎక్స్‌రే, రెటీనా చిత్రాలు. ఇలాంటి వాటిని విశ్లేషించడంలో వైద్యులకు ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.

* ఇక ఔషధాల తయారీ విషయంలో కూడా ఏఐ ఉపయోగపడుతుంది. డేటా సెట్‌ల విశ్లేషణలో ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ప్రెసిషన్‌ మెడిసిన్‌గా పిలిచే ఈ విధానంలో రోగి లక్షణాల ఆధారంగా ఎలాంటి ఔషధాలు ఇవ్వాలన్న విషయాన్ని ఏఐ చెబుతుంది.

* న్యాయపరమైన కేసుల విచారణలో కూడా ఏఐ ఉపయోగపడుతుంది. ఇప్పటికే జర్మనీలోని కోర్టులో ఈ టెక్నాలజీని ఉపయోగించారు. పెండింగ్‌లో కేసులను విచారించడంలో పాత కేసుల డేటాను విశ్లేషించడంలో ఏఐ ఉపయోగపడుతుంది.

* రైలు, విమాన, సినిమా టికెట్ల బుకింగ్స్‌ విషయంలో కూడా ఏఐ సాధనాలు ఉపయోగపడుతున్నాయి. ఇటీవల ఐఆర్‌సీటీసీ యూజర్ల కోసం ఆస్క్‌దిశా 2.0 పేరుతో ఒక ఏఐ చాట్‌బాట్‌ను తీసుకొచ్చింది. ఆస్క్‌దిశా2.0ని డిజిటల్‌ ఇంటరాక్షన్‌గా పిలుస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్ ఆధారంగా ఈ చాట్‌బాట్‌ పనిచేస్తుంది. ఈ చాట్‌బాట్ ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌ భాషకు సపోర్ట్ చేస్తుంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌తో పాటు మొబైల్‌ యాప్‌లో కూడా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

* ఏఐ సహాయంతో వాట్సాప్‌లోనే విమాన టికెట్లు బుక్‌ చేసుకునే అవకాశం లభిస్తోంది. ఇటీవల ఇండిగో కొత్త AI ఫీచర్‌ను ప్రారంభించింది , ఈ ఫీచర్‌ సహాయంతో వాట్సాప్‌లో మెసేజ్‌ చేయడం ద్వారా టికెట్లను సులభం బుక్‌ చేసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..