BSNL Cinema Plus: రూ.49కే నాలుగు ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు.. బీఎస్ఎన్ఎల్ నుంచి అద్భుతమైన ప్యాకేజీ..

బీఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ ఓటీటీ ప్యాకేజీ ధర దాదాపు 50 శాతం తగ్గింపుతో లభిస్తుంది. గతంలో ఈ ప్యాకేజీ ధర రూ.99 ఉండేది. ఇప్పుడు కేవలం రూ.49కే అందుబాటులోకి వచ్చింది. ఈ ప్యాకేజీతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లయన్స్ గేట్ (Lionsgate),షెమరూమీ (ShemarooMe), హంగామా (Hungama), ఎపిక్ఆన్ (EpicON) తదితర ఓటీటీలలోని సినిమాలను చక్కగా చూడవచ్చు.

BSNL Cinema Plus: రూ.49కే నాలుగు ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు.. బీఎస్ఎన్ఎల్ నుంచి అద్భుతమైన ప్యాకేజీ..
Bsnl Plan
Follow us

|

Updated on: May 01, 2024 | 12:25 PM

ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది.ఫైబర్ బ్యాండ్ సబ్ స్కైబర్లకు అందించే సినిమా ప్లస్ ఓటీటీ ప్యాకేజీ ధరను భారీ గా తగ్గించింది. దాదాపు 50 శాతం తగ్గింపుతో అందిస్తోంది. ఓటీటీ ప్లాట్ ఫారంలను  ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ఈ ప్యాక్ ఆకర్షణీయంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం బీఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ ఓటీటీ గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం రండి..

రూ.49 కే ఓటీటీ ప్యాకేజీ..

బీఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ ఓటీటీ ప్యాకేజీ ధర దాదాపు 50 శాతం తగ్గింపుతో లభిస్తుంది. గతంలో ఈ ప్యాకేజీ ధర రూ.99 ఉండేది. ఇప్పుడు కేవలం రూ.49కే అందుబాటులోకి వచ్చింది. ఈ ప్యాకేజీతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లయన్స్ గేట్ (Lionsgate),షెమరూమీ (ShemarooMe), హంగామా (Hungama), ఎపిక్ఆన్ (EpicON) తదితర ఓటీటీలలోని సినిమాలను చక్కగా చూడవచ్చు. బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ కస్టమర్లందరూ ఈ ఓటీటీని కొనుగోలు చేయవచ్చు.

సినిమా ప్లస్ ప్లాన్లు..

  • బీఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ మొదట స్టార్టర్ ప్యాక్‌ను అందిస్తుంది. లయన్స్ గేట్ ,షెమరూమీ , హంగామా, ఎపిక్ఆన్ తదితర ఓటీటీలలోని సినిమాలను చక్కగా చూడవచ్చు. బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ కస్టమర్లందరూ ఈ ఓటీటీని కొనుగోలు చేయవచ్చు.
  • బీఎస్ఎన్ఎల్ రెండో ప్యాకేజీ కూడా ఖాతాదారులకు అందుబాటులో ఉంది. ఇది జీ5, సోనీలివ్, యూప్ టీవీ, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో వస్తుంది. దీని ధర నెలకు రూ.199.
  • ఇక చివరిగా మూడో ప్యాకేజీ గురించి చేసుకుందాం. ఇది ప్రీమియం ప్యాక్. దీని ధర నెలకు రూ. 249. దీనిలో జీ5, సోనీ లివ్, యూప్ టీవీ, లయన్స్ గేట్, షెమరుమీ, హంగామా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ తదితర ఓటీటీలను చూడవచ్చు. సినిమాప్లస్ సేవ వినియోగదారులకు ఒకే లాగిన్‌తో అనేక ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కంటెంట్‌ను యాక్సెస్ చేస్తుంది. ఎక్స్‌స్ట్రీమ్ ప్లే పేరుతో ఎయిర్ టెల్, జియో టీవీ ప్రీమియం పేరుతో జియో, టాటా ప్లే బింజ్ తో టాటా కూడా ఇటువంటి సేవలను అందజేస్తున్నాయి.

ఇష్టమైన కార్యక్రమాలు..

ఈ ప్లాట్‌ఫారమ్‌లలో కొన్ని కంటెంట్‌కి మరింత విస్తృతమైన యాక్సెస్‌ను కూడా అందిస్తాయి. మీరు హెచ్ బీఓ కంటెంట్ కావాలనుకుంటే జియో సినిమా ప్రీమియం ప్లాట్‌ఫారమ్‌లో కొనుగోలు చేయవచ్చు. బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్‌కు యాక్సెస్ కావాలనుకునే ఫైబర్ కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ వెబ్‌సైట్‌కి వెళ్లి తమకు నచ్చిన ప్లాన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. అనంతరం తమకు ఇష్టమైన టీవీ షోలు, సినిమాలను చూడటం ప్రారంభించవచ్చు. సబ్‌స్క్రిప్షన్ రుసుము కస్టమర్ బ్రాడ్‌బ్యాండ్ బిల్లుకు కలుపుతారు. ప్రత్యేకంగా ఛార్జ్ చేయరు.

ఓటీటీ అంటే..

ఇంటర్నెట్ ఆధారంగా సినిమాలు, టీవీ షోలు, ఇతర కార్యక్రమాలను అందించే దానిని ఓటీటీ అంటారు. వీటిలో సినిమాలు, వెబ్ సిరీస్, టీవీ షోలు, సెలబ్రిటీ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మనం దేశంలో కొన్ని కొత్త సినిమాలు ఈ ఓటీటీలలోనే విడుదల చేస్తున్నారు. కరోనా సమయం నుంచి వీటికి ఆదరణ బాగా పెరిగింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
మళ్లీ పటాస్ ప్రవీణ్‌తో జబర్దస్త్ ఫైమా..కొత్త లవర్‌ను పరిచయం చేసి
మళ్లీ పటాస్ ప్రవీణ్‌తో జబర్దస్త్ ఫైమా..కొత్త లవర్‌ను పరిచయం చేసి
ఎదుటివారిలో ఈ లక్షణాలు కనిపిస్తే అబద్దాలు చెబుతున్నారని అర్ధమట
ఎదుటివారిలో ఈ లక్షణాలు కనిపిస్తే అబద్దాలు చెబుతున్నారని అర్ధమట
ఆ కాంట్రవర్సీలో ఇరుక్కున్న పాయల్ రాజ్‌పుత్.. కెరీర్‌పై ఎఫెక్ట్.
ఆ కాంట్రవర్సీలో ఇరుక్కున్న పాయల్ రాజ్‌పుత్.. కెరీర్‌పై ఎఫెక్ట్.
ఫైనల్‌కు వెళ్లేదెవరు?KKRతో క్వాలిఫైయర్ మ్యాచ్.. టాస్ గెలిచిన SRH
ఫైనల్‌కు వెళ్లేదెవరు?KKRతో క్వాలిఫైయర్ మ్యాచ్.. టాస్ గెలిచిన SRH
బోనస్‌పై కాంగ్రెస్ మాట మార్చిందా? కొనుగోళ్లలో U ట్యాక్స్‌ నిజమేనా
బోనస్‌పై కాంగ్రెస్ మాట మార్చిందా? కొనుగోళ్లలో U ట్యాక్స్‌ నిజమేనా
మాకొచ్చే సీట్ల విషయంలో క్లారిటీతో ఉన్నాం.. బొత్స కీలక వ్యాఖ్యలు
మాకొచ్చే సీట్ల విషయంలో క్లారిటీతో ఉన్నాం.. బొత్స కీలక వ్యాఖ్యలు
కిర్గిస్థాన్‌లో అల్లర్లు.. ఉలిక్కిపడ్డ విజయనగరం.. తమ పిల్లల కోసం
కిర్గిస్థాన్‌లో అల్లర్లు.. ఉలిక్కిపడ్డ విజయనగరం.. తమ పిల్లల కోసం
యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.. మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.. మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ముఖానికి మాస్క్ పెట్టేసిన ఈ స్టార్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
ముఖానికి మాస్క్ పెట్టేసిన ఈ స్టార్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
మీరు మోక్షం పొందాలంటే జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాలను దర్శించండి..
మీరు మోక్షం పొందాలంటే జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాలను దర్శించండి..