AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Routers Under 3K: తక్కువ ధరలో బెస్ట్ రూటర్లు ఇవే.. వేగవంతమైన కనెక్టివిటీ, టాప్ ఫీచర్లు..

అందరూ ఇంట్లో ఓ వైఫై కనెక్షన్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ రూటర్ అందరికీ అవసరం అవుతోంది. అది కూడా మంచి వేగం, భద్రత, రేంజ్ వంటివి అధికంగా ఉన్న వాటికి డిమాండ్ ఉంటోంది. అలాగే ఫాస్ట్ కనెక్టివిటీ, ఎన్ని డివైజ్ లు కనెక్ట్ చేసినా ఎటువంటి లాగ్ లు లేకుండా నెట్ అందించే రూటర్లను కోరుకుంటున్నారు. అంతేకాక అవి అనువైన ధరలో ఉండాలని వినియోగదారులు ఆశిస్తున్నారు.

Best Routers Under 3K: తక్కువ ధరలో బెస్ట్ రూటర్లు ఇవే.. వేగవంతమైన కనెక్టివిటీ, టాప్ ఫీచర్లు..
Best Wifi Routers
Madhu
|

Updated on: Jan 21, 2024 | 7:40 AM

Share

ప్రస్తుత ఆధునిక యుగంలో ఇంటర్ నెట్ లేని ప్రపంచాన్ని ఊహించలేం. అరచేతిలో మొబైల్ ఫోన్ నుంచి ఇంట్లో టీవీలు, ల్యాప్ టాప్, స్మార్ట్ డివైజెస్ అన్నింటికీ ఇంటర్ నెట్ కనెక్షన్ అవసరం. అది లేనిదే ఏ పని చేయలేని పరిస్థితి. అందుకే అందరూ ఇంట్లో ఓ వైఫై కనెక్షన్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ రూటర్ అందరికీ అవసరం అవుతోంది. అది కూడా మంచి వేగం, భద్రత, రేంజ్ వంటివి అధికంగా ఉన్న వాటికి డిమాండ్ ఉంటోంది. అలాగే ఫాస్ట్ కనెక్టివిటీ, ఎన్ని డివైజ్ లు కనెక్ట్ చేసినా ఎటువంటి లాగ్ లు లేకుండా నెట్ అందించే రూటర్లను కోరుకుంటున్నారు. అంతేకాక అవి అనువైన ధరలో ఉండాలని వినియోగదారులు ఆశిస్తున్నారు. అటువంటి వారి కోసం మార్కెట్లో రూ. 3000లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ రూటర్ల జాబితాను మీకు అందిస్తున్నాం. ఓ లుక్కేయండి..

టీపీ-లింక్ ఆర్చర్ ఏసీ1200 ఆర్చర్ సీ6 వైఫై రూటర్..

ఇది అద్భుతమైన పనితీరుని అందించే శక్తివంతమైన రూటర్. 5జీహెర్జ్ బ్యాండ్ పై 867ఎంబీపీఎస్ వరకూ 2.4జీహెర్జ్ బ్యాండ్ పై 400ఎంబీపీఎస్ వరకూ వీల్యాన్ వేగంతో ఇంటర్ నెట్ కనెక్షన్ ను అందిస్తుంది. ఐదు గిగా పోర్టులు, నాలుగు ఎక్స్ టర్నల్ యాంటెనాలు ఉంటాయి. దీని ధర అమెజాన్ ప్లాట్ ఫారంలో రూ. 2,599గా ఉంది.

టెండా ఏసీ10 ఏసీ1200 వైర్‌లెస్ స్మార్ట్ డ్యూయల్-బ్యాండ్ గిగాబిట్ వైఫై రూటర్..

రూ. 3000లోపు ధరలో రూటర్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఫీచర్ రిచ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. 5జీహెర్జ్ బ్యాండ్ పై 867 ఎంబీపీఎస్, 2.4జీహెర్జ్ బ్యాండ్ పై 300ఎంబీపీఎస్ వైఫై వేగాన్ని అందిస్తోంది. నాలుగు గిగా బిట్ పోర్టులు ఉంటాయి. హై స్పీడ్ వైర్డు కనెక్షన్లను అందిస్తోంది. దీని ధర అమెజాన్ ఫ్లాట్ ఫారంలో రూ. 2,308గా ఉంది.

ఇవి కూడా చదవండి

టీపీ-లింక్ డెకో ఈ4 హోల్ హోమ్ వైఫై రూటర్..

ఇది ఏసీ1200 వైర్ లెస్ టెక్నాలజీతో వస్తోంది. 1200ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ అందిస్తోంది. వైఫై బూస్టర్ గా పనిచేస్తుంది. డ్యూయల్-బ్యాండ్ ఫంక్షనాలిటీ పనితీరు, కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తుంది. పేరెంట్ కంట్రోల్స్ మీరు వైఫై ని పర్యవేక్షించడానికి, మిమ్మల్ని అనుమతిస్తాయి. దీని ధర అమెజాన్లో రూ. 2,999గా ఉంది.

నెట్ గేర్ ఆర్6120-100ఐఎన్ఎస్ ఏసీ1200 డ్యూయల్-బ్యాండ్ వైఫై రూటర్

ఈ రూటర్ డిఫరెంట్ లుక్లో కనిపిస్తుంది. ఇది సెకనుకు 1200 మెగాబిట్ల వరకూ వేగవంతమైన ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. ఈ రూటర్లో మోడెమ్ ఉండదు. ఎందుకంటే ఇది ప్రధానంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఉద్దేశించింది. ఇది స్ట్రీమింగ్ అయినా, గేమింగ్ కోసం అయినా, బ్రౌజింగ్ కోసం అయినా సరిగ్గా సరిపోతోంది. ఈ ఫీచర్ రిచ్ రౌటర్ ధర అమెజాన్లో రూ. 1,985గా ఉంది.

వీ-గార్డ్ ఎన్వైబ్ 12డీ4 రూటర్ యూపీఎస్..

దీనిలో ఇన్ బిల్ట్ యూపీఎస్ ఉంటుంది. దీని సాయంతో మీ ఇంట్లో కరెంట్ లేకపోయినా ఇంటర్నెట్ కనెక్షన్ ను ఆస్వాదించవచ్చు. 4 నుంచి ఐదు గంటల బ్యాకప్ ను అందిస్తుంది. అలాగే ఈ యూపీఎస్ పవర్ హెచ్చుతగ్గుల నుంచి సర్జ్ ల నుంచి సురక్షితంగా ఉంచుతుంది. దీనికి ఒక సంవత్సరం వారంటీ ఉంటుంది. అలాగే వేగవంతమైన కనెక్టివిటినీ అందిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..