AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Microsoft: వీడియోల కోసం యూట్యూబ్ లాంటి మరో కొత్త టూల్.. మైక్రోసాఫ్ట్ సరికొత్త ఆవిష్కరణ..

టెక్ దిగ్గజం గూగుల్ సబ్సిడరీ కంపెనీగా యూ ట్యూబ్ పనిచేస్తోంది. దీనిలో అన్ని వీడియోలకు కాపీ రైట్ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వీడియో కంటెంట్ కు ఏకైక ప్లాట్ ఫారంగా అందుబాటులో ఉంది ఈ యూ ట్యూబ్. గ్లోబల్ వైడ్ గా దీనికి పోటీనిచ్చే మరే ఇతర యాప్ కూడా లేదు. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ యూ ట్యూబ్ నకు పోటీగా.. మరో వీడియో కాపీ రైట్ యాప్ ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పలు ఆన్ లైన్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Microsoft: వీడియోల కోసం యూట్యూబ్ లాంటి మరో కొత్త టూల్.. మైక్రోసాఫ్ట్ సరికొత్త ఆవిష్కరణ..
Youtube
Madhu
|

Updated on: Jan 21, 2024 | 8:07 AM

Share

వీడియో కంటెంట్ కోసం ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న ఏకైన ప్లాట్ ఫారం యూ ట్యూబ్. మిలియన్ల కొద్దీ వీడియోలు దీనిలో అందుబాటులో ఉంటాయి. టెక్ దిగ్గజం గూగుల్ సబ్సిడరీ కంపెనీగా యూ ట్యూబ్ పనిచేస్తోంది. దీనిలో అన్ని వీడియోలకు కాపీ రైట్ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వీడియో కంటెంట్ కు ఏకైక ప్లాట్ ఫారంగా అందుబాటులో ఉంది ఈ యూ ట్యూబ్. గ్లోబల్ వైడ్ గా దీనికి పోటీనిచ్చే మరే ఇతర యాప్ కూడా లేదు. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ యూ ట్యూబ్ నకు పోటీగా.. మరో వీడియో కాపీ రైట్ యాప్ ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పలు ఆన్ లైన్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కంటెంట్ క్రియేటర్లకు, బ్రాడ్ కాస్టర్లకు మేలు చేకూర్చే విధంగా.. అనధికారికంగా వీడియలను కాపీ చేయలేని విధంగా కొత్త ప్లాట్ ఫారంను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

యూ ట్యూబ్ లాంటి టూల్..

మైక్రోసాఫ్ట్ వీడియోల కోసం కొత్త టూల్‌ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. యూ ట్యూబ్ లాంటి ఫీచర్లతో ఇది రానుంది. ఇటీవల ఫైల్ చేసిన పేటెంట్‌లో ఈ విషయం స్పష్టమవుతోంది. పైగా దీనిలో కాపీరైట్ చేయబడిన మెటీరియల్‌తో వీడియోలను గుర్తించడానికి వినియోగదారులు షాజమ్ వంటి ఉత్పత్తి కూడా కనిపిస్తుందని చెబుతున్నారు. విండోస్ ప్రకటించిన నివేదికలో గుర్తించినట్లుగా యూట్యూబ్ కాపీరైట్ మ్యాచ్ టూల్ వలె పనిచేసే విధంగా మైక్రోసాఫ్ట్ దీనిని తీసుకొస్తోంది. కాపీరైట్ చేసిన వీడియో కంటెంట్ ను అనధికారికంగా వినియోగించే ఆటోమేటిక్ గా గుర్తించే విధంగా దీనిని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇలా ఉంటుంది..

ఈ మైక్రోసాఫ్ట్ కొత్త యాప్లో నుంచి వినియోగదారులు వీడియోను ఉపయోగించాలంటే తప్పనిసరిగా “టార్గెట్ వీడియో” , “రిఫరెన్స్ వీడియో”ని సమర్పించాలి. అక్కడ నుంచి టూల్ రెండు వీడియోలను పోల్చి, టార్గెట్ వీడియో అవునా కాదా అని తనిఖీ చేస్తుంది. రిఫరెన్స్ వీడియోలోని అన్ని షాట్‌లను కలిగి ఉందా లేదా? రిఫరెన్స్ వీడియోలో ఉన్న షాట్‌ల సమూహాలను కూడా కలిగి ఉందా? రెఫరెన్స్ వీడియో వలె ఒకే క్రమంలో ఉన్న షాట్‌లను కలిగి ఉందా అని గుర్తిస్తుంది. అయితే యాప్ పని చేయడానికి వినియోగదారులు టార్గెట్ వీడియో, రిఫరెన్స్ వీడియో రెండింటినీ కలిగి ఉండవలసిన అవసరం లేదని తెలుస్తోంది. ఈ పరిస్థితిలో, అనువర్తనం దాని ప్రస్తుత డేటాబేస్కు వ్యతిరేకంగా కలిగి ఉన్న సమాచారంతో పని చేస్తుంది.

ఎలా పనిచేస్తుందంటే..

యూ ట్యూబ్ లో ఇప్పటికే ఉన్న ఈ వీడియోల డేటాబేస్‌ను రూపొందించడానికి యాప్ గూగుల్, బింజ్, ఇతర శోధన ఇంజిన్‌లపై ఆధారపడుతుంది. అయితే మైక్రోసాఫ్ట్ ఈ సాధనాన్ని ఎలా ఉపయోగించాలని యోచిస్తోందో ప్రస్తుతానికి తెలియదు. అయితే ఇది స్వతంత్ర యాప్‌గా మారవచ్చని లేదా మరొక మైక్రోసాఫ్ట్ ఉత్పత్తిలో ఫీచర్ చేయవచ్చని చెబుతున్నారు. భవిష్యత్తులో ఇది మైక్రోసాఫ్ట్ కోపైలట్‌కు ప్లగిన్‌గా మారే అవకాశం ఉంది. అయితే ఈ టూల్ ఎప్పటికి ప్రజలకు అందుబాటులోకి వస్తుందో అనే విషయంపై ఎటువంటి సమాచారం లేదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?