AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Security: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలు పర్సనల్ డేటాను తీసుకుంటాయా? అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..

సర్ఫ్‌షార్క్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఓ సర్వే చేసింది. యాప్ లు స్వీకరించే డేటా విధానాలను అధ్యయనం చేసింది. దాదాపు 100 ప్రముఖ యాప్ లపై ఈ అధ్యయనం చేసి ఓ నివేదికను వెలువరించింది. ఆ నివేదికలో విస్తు పోయే విషయాలు వెల్లడయ్యాయి. మన వ్యక్తిగత సమాచారాన్ని(డేటాను) అత్యధికంగా తీసుకుంటున్న యాప్స్ ఏంటో తెలుసా? అత్యధికంగా జనాలు వినియోగించే..

Cyber Security: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలు పర్సనల్ డేటాను తీసుకుంటాయా? అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..
Social Media Apps
Madhu
|

Updated on: Jan 21, 2024 | 7:07 AM

Share

స్మార్ట్ ఫోన్లోని ప్రతి యాప్ మీ వ్యక్తిగత సమాచారాన్ని కొంత అడుగుతుంది. అవి తప్పనిసరిగా వాటిలో నమోదు చేయాల్సి ఉంటుంది. అవి ఇవ్వకపోతే యాప్ ఇన్ స్టాల్ కాదు. ఒకవేళ ఇన్ స్టాల్ అయిన దానితో పనిచేయలేం. సోషల్ మీడియా యాప్ ల దగ్గర నుంచి ఆఫీస్ యాప్స్, కొన్ని టూల్స్, ఎడిటింగ్ యాప్స్ అన్నింట్లోనూ వినియోగదారుల డేటా ను అడుగుతుంది. అయితే ఏ యాప్స్ లో చాలా తక్కువ సమాచారం అడుగుతుంది? ఏ యాప్ వినియోగదారులకు సంబంధించిన ఎక్కువ సమాచారం తమ యాప్ లలో నిక్షిప్తం చేస్తుంది? తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే ప్రస్తుతం ఈ యాప్స్ కూడా ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ఈ క్రమంలోనే సర్ఫ్‌షార్క్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఓ సర్వే చేసింది. యాప్ లు స్వీకరించే డేటా విధానాలను అధ్యయనం చేసింది. దాదాపు 100 ప్రముఖ యాప్ లపై ఈ అధ్యయనం చేసి ఓ నివేదికను వెలువరించింది. ఆ నివేదికలో విస్తు పోయే విషయాలు వెల్లడయ్యాయి. మన వ్యక్తిగత సమాచారాన్ని(డేటాను) అత్యధికంగా తీసుకుంటున్న యాప్స్ ఏంటో తెలుసా? అత్యధికంగా జనాలు వినియోగించే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్.. ఈ రెండు యాప్స్ వినియోగదారుల డేటాను కూడా అధికంగా తీసుకుంటుందని చెప్పింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

వీటిని సేకరిస్తున్నాయి..

యాపిల్ ప్రైవసీ పాలసీలో పేర్కొన్న 32 డేటా పాయింట్లను ప్రాథమికంగా తీసుకొని సర్ఫ్‌షార్క్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈ అధ్యయనం చేసింది. వాటిల్లో సెన్సిటివ్ విషయాలైన పేమెంట్ డీటైల్స్, బ్రౌజింగ్ హిస్టరీ, మీ కచ్చితమైన లోకేషన్ వంటివి కూడా ఉన్నాయి. వీటి ఆధారంగా అధ్యయనం చేసి యాప్స్ కు ర్యాకింగ్ ఇచ్చింది.

ఆ రెండు యాప్స్..

మెటా యాజమాన్యంలోని ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ ప్లాట్‌ఫారమ్‌లలోనూ డేటా సేకరణ ఒకే విధంగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. యాపిల్ ప్రైవసీ పాలసీలోని 32 డేటా పాయింట్ల బట్టి చూస్తే వాటన్నంటిని ఈ రెండు యాప్స్ సేకరిస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. మరే ఇతర యాప్లలో కూడా ఇన్ని విధాలుగా డేటా పాయింట్లలో సమాచార సేకరణ లేదని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే రెండు యాప్‌లు జాబితా చేయబడిన అన్ని డేటా పాయింట్‌లను సేకరించినప్పటికీ, అవి పేరు, చిరునామా, ఫోన్ నంబర్‌తో సహా ట్రాకింగ్ ప్రయోజనాల కోసం ఏడు పాయింట్లను మాత్రమే ఉపయోగించాయని ఆ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. ఎక్స్(ట్విట్టర్) మాత్రం అతి తక్కువ డేటాను వినియోగదారు నుంచి సేకరిస్తుందని తెలిపింది. అయితే థర్డ్ పార్టీ యాప్స్ తో భాగస్వామ్యం చేసినప్పుడు ఇది దాదాపు 32 డేటా పాయింట్లను సగం పాయింట్లను యూజర్ ట్రాకింగ్ కోసం వినియోగిస్తున్నట్లు గుర్తంచింది. దీంతో ఎక్స్ లో డేటా షేరింగ్ పద్ధతుల గురించి ఆందోళనలను పెంచుతుంది. దాదాపు 10 సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్ లలో దాదాపు సగటు కంటే ఎక్కువ డేటాను సేకరిస్తున్నట్లు పరిశోధన వెల్లడించింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!