AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: మీ ఇన్‌బాక్స్ ఓటీపీ మెసేజ్‌లతో నిండిపోయిందా.. ఒక్క క్లిక్‌తో ఇలా క్లియర్ చేసుకోండి..

మీ ఫోన్ ఇన్‌బాక్స్ ఇన్ బాక్స్ ఓటీపీ మెసేజ్‌లతో నిండిపోయిందా.. అయితే ఇవి మీ గూగుల్ సెట్టింగ్స్ ద్వారా ఒక్క క్లిక్ తోనే క్లియర్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల 24 గంటల్లోపు మీ ఓటీపీ మెసేజ్ లన్నీ తొలగించుకోవచ్చు. దీన్ని మీ ఫోన్ లో ఎలా వాడుకోవాలి.. ఏయే సెట్టింగ్ లను మార్చాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Tech Tips: మీ ఇన్‌బాక్స్ ఓటీపీ మెసేజ్‌లతో నిండిపోయిందా.. ఒక్క క్లిక్‌తో ఇలా క్లియర్ చేసుకోండి..
Smart Phone Inbox Clearing Tips
Bhavani
|

Updated on: Mar 04, 2025 | 7:01 PM

Share

డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ షాపింగ్ నుండి ఏదైనా వెబ్‌సైట్ లేదా యాప్‌లోకి లాగిన్ అవ్వడం వరకు ప్రతిదానికీ ఇప్పుడు వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) అవసరం. దీని వలన ఇన్‌బాక్స్ ఓటీపీలతో నిండిపోతుంది. ఈ ఓటీపీలన్నీ మీ ఇన్ బాక్స్‌లో తరచూ కనిపించడం ఏదైనా ముఖ్యమైన మెసేజ్ చూడాల్సి వచ్చినప్పుడు ఇవి చికాకు పెడుతుంటాయి. వీటిని డిలీట్ చేయాలన్నా ఒక్కొక్కటిగా తీసేసే వీలుండదు. దీంతో మీ స్టోరేజ్ కూడా ఫుల్ ఐపోతుంటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఓ చిన్న టెక్నిక్ ఉంది. అదేంటో చూసేయండి.

ఈ స్టప్స్ ఫాలో అవ్వండి..

  • ముందుగా, మీ ఫోన్‌లో గూగుల్ మెసేజెస్ యాప్‌ను తెరవండి. ఒకవేళ ఈ యాప్ మీ ఫోన్ లో డీఫాల్ట్‌గా లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి.
  • దీని తర్వాత, ప్రొఫైల్ చిత్రంపై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మెసేజ్ సెట్టింగ్‌లను నొక్కండి.
  • తరువాత, మెసేజ్ ఆర్గనైజేషన్ పై క్లిక్ చేయండి.

ఇప్పుడు, “ఆటో డిలీట్ ఓటీపీ ఆఫ్టర్ 24 హవర్స్” ఆప్షన్ పక్కన ఒక టోగుల్ కనిపిస్తుంది, దాన్ని ఆన్ చేయండి. ఈ టోగుల్‌ను ఆన్ చేసిన తర్వాత, మీ ఇన్‌బాక్స్‌లోకి వచ్చిన ఓటీపీలు 24 గంటల తర్వాత మీ మెసేజ్ బాక్స్ నుండి వాటివకే డిసపియర్ అవుతాయి. ఈ విధంగా, మీరు మెసేజ్ ఇన్‌బాక్స్‌కి వెళ్లిన ప్రతి ఓటీపీ మెసేజ్ ను మాన్యువల్‌గా వెతికి తొలగించాల్సిన అవసరం లేదు.

జీమెయిల్ ఇన్‌బాక్స్‌ను ఎలా క్లియర్ చేయాలి?

ముందుగా మీరు మీ జీమెయిల్లోని జంక్ ఫైల్‌ను తొలగించాలి. ఇందు కోసం, మీ జీమెయిల్ అకౌంట్ లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి.

సెరచ్ బాక్స్ లో ‘has: attachment larger:10M’ అని టైప్ చేయండి.

ఇప్పుడు మీరు 10ఎంబీ కంటే ఎక్కువ సైజులో అటాచ్‌మెంట్‌లతో ఉన్న అన్ని ఇమెయిల్‌లను ఇక్కడ చూస్తారు. వీటి నుంచి మీకు అవసరమైన అన్ని ఇమెయిల్‌లను సెలక్ట్ చేసుకుని తొలగించండి. ఆ తర్వాత మీరు ట్రాష్ స్పామ్ ఫోల్డర్‌లలోని ఇమెయిల్‌లను కూడా తొలగించాలి.

ఈ సెట్టింగ్స్ ను ఆన్ చేయండి..

మీరు కమర్షియల్ అకౌంట్స్ నుంచి నోటిఫికేషన్స్ ను ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల అనవసరంగా మీ ఇన్ బాక్స్ లో జంక్ వచ్చి చేరకుండా ఉంటుంది. ఇందుకోసం మీకు వచ్చిన ఏదైనా యాడ్ ఇమెయిల్ ను ఓపెన్ చేసి అందులో మూడు డాట్స్ ను ఎంచుకుని అన్‌సబ్‌స్క్రైబ్ బటన్‌ను నొక్కండి. ఈ సెట్టింగ్ యాక్టివేట్ అవ్వడానికి మీకు కొంచెం టైమ్ పట్టొచ్చు.