AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Android 16: మరో నాలుగు రోజుల్లో ఆండ్రాయిడ్ 16 లాంచ్.. సిస్టమ్‌లా మారనున్న స్మార్ట్ ఫోన్..!

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. చాలా వరకు స్మార్ట్ ఫోన్స్ గూగుల్‌కు సంబంధించిన ఆండ్రాయిడ్ సిస్టమ్ ఆధారంగా పని చేస్తుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ 15 వెర్షన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. అయితే మరికొన్ని రోజుల్లు ఆండ్రాయిడ్ వెర్షన్ 16 త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్-16 గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Android 16: మరో నాలుగు రోజుల్లో ఆండ్రాయిడ్ 16 లాంచ్.. సిస్టమ్‌లా మారనున్న స్మార్ట్ ఫోన్..!
Android 16
Nikhil
|

Updated on: May 09, 2025 | 4:45 PM

Share

గూగుల్ కొత్త ఆండ్రాయిడ్ 16 ని మే 13 న జరిగే ఆండ్రాయిడ్ షో ఐ/ఓ ఎడిషన్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆండ్రాయిడ్-16లో అనేక కొత్త ఫీచర్లు ఉంటాయని అంచనా వేస్తన్నారు. ముఖ్యంగా త్వరలో లాంచ్ అవ్వబోయే ఆండ్రాయిడ్ వెర్షన్‌లో కొత్త యూఐ ఉండవచ్చని పేర్కొంటున్నారు. ఈ ఆండ్రాయిడ్ 16లో త్వరిత సెట్టింగ్‌ల ప్యానెల్, పునఃరూపకల్పన చేసేలా సెట్టింగ్‌ల మెనూ మార్పు వంటి అనేక ఇతర కొత్త ఫీచర్లు ఉంటాయని ఆండ్రాయిడ్ అథారిటీ ఒక నివేదికలో పేర్కొంది. అదే సమయంలో ఆండ్రాయిడ్ 16 మీ ఫోన్‌ను పీసీలా లాగా ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుందని పలు నివేదికలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఫీచర్‌ని ఉపయోగించడానికి మీరు మీ ఫోన్‌ని బాహ్య మానిటర్‌కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది.

ఆండ్రాయిడ్ 16కు సంబంధించిన తాజా బీటా బిల్డ్‌పై నడుస్తున్న గూగుల్ పిక్సెల్ 8 ప్రో బాహ్య మానిటర్‌కి కనెక్ట్ చేసినప్పుడు డెస్క్‌టాప్ మోడ్‌ను అందిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసిందని నిపుణులు చెబుతున్నారు. ఇది క్రోమ్ బుక్ లాంటి వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ను అందించే సామ్‌సంగ్‌కు సంబంధించిన డెక్స్‌ మోడ్‌ను పోలి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సామ్‌సంగ్ మాత్రమే కాకుండా ఆండ్రాయిడ్ 16 తో వస్తున్న అనేక స్మార్ట్‌ఫోన్‌లు ఈ ప్రత్యేక ఫీచర్‌ అందుబాటులో ఉంటుంది. అందువల్ల మీ మొబైల్‌ను డెస్క్‌టాప్‌గా మార్చుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ ఈ అవుటర్ మానిటర్లను నడపగల శక్తివంతమైన చిప్‌లతో కూడిన హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లకే పరిమితం అయ్యే అవకాశం ఉంది. 

మీ స్మార్ట్ ఫోన్‌ను డెస్క్‌టాప్‌నకు సపోర్ట్ చేసేలా చేయాలంటే మీ ఫోన్ వేగవంతమైన యూఎస్‌బీ-సీ పోర్ట్‌ను కూడా కలిగి ఉండాలి. అయితే ఆండ్రాయిడ్ డెస్క్‌టాప్ మోడ్ ఇంకా బీటా టెస్టింగ్ దశలోనే ఉంది. అయితే గూగుల్ ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ 16 రోల్‌అవుట్ మొదటి రోజున ప్రవేశపెడుతుందా? లేదా? తర్వాత అప్‌డేట్ ద్వారా విడుదల చేస్తుందా అనేది ధ్రువీకరించలేదు. అలాగే ఈ ఫీచర్ గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లకే పరిమితం అవుతుందా? లేదా? ఇతర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ తయారీదారులు కూడా ఈ ఫీచర్‌ను తమ వినియోగదారులకు అందించగలరా? అనేది కూడా అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ అద్భుతమైన ఫీచర్లను చూస్తుంటే ఆండ్రాయిడ్ 16 ఊహించిన దానికంటే చాలా పెద్ద అప్‌డేట్‌గా మారుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us