Amazon Summer Sale: ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్ ఫీచర్లతో..

ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ టాప్ బ్రాండ్ ట్యాబ్లెట్లపై అదిరే ఆఫర్లను అందిస్తోంది. సమ్మర్ ఆఫర్లలో భాగంగా వన్ ప్లస్ ప్యాడ్ ను కేవలం రూ. 30వేల లోపు ధరలోనే అందుబాటులో ఉంచింది. వివిధ బ్యాంకు ఆఫర్లతో కలిపి ఈ ధరకు వన్ ప్లస్ ప్యాడ్ లభిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Amazon Summer Sale: ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్ ఫీచర్లతో..
One Plus Pad
Follow us

|

Updated on: May 05, 2024 | 3:24 PM

ఇటీవల ట్యాబ్లెట్ల వినియోగం బాగా పెరిగింది. చదువు, ఉద్యోగం, వ్యాపార అవసరాల కోసం దీనిని విరివిగా వినియోగిస్తున్నారు. తక్కువ బరువుతో చిన్న సైజ్ లో ఉండడంతో వీటిని ఎక్కడికైనా చాలా సులభంగా తీసువెళ్లవచ్చు. ఫోన్ కన్నా కాస్త పెద్ద సైజులో ఉండటం వల్ల ఎక్కడైనా, ఎలాంటి పరిస్థితులైనా వినియోగించుకునేందుకు మన పనులు సక్రమంగా చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతోంది. అయితే మార్కెట్లో చాలా రకాల బ్రాండ్లు మనకు అందుబాటులో ఉంటాయి. వీటి ధరలు కూడా తక్కువ నుంచి ఎక్కువ వరకూ ఉంటాయి. అయితే మంచి ఫీచర్లతో కూడిన ట్యాబ్లెట్ కావాలంటే అధిక ధర వెచ్చించాల్సిందే. అయితే ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ టాప్ బ్రాండ్ ట్యాబ్లెట్లపై అదిరే ఆఫర్లను అందిస్తోంది. సమ్మర్ ఆఫర్లలో భాగంగా వన్ ప్లస్ ప్యాడ్ ను కేవలం రూ. 30వేల లోపు ధరలోనే అందుబాటులో ఉంచింది. వివిధ బ్యాంకు ఆఫర్లతో కలిపి ఈ ధరకు వన్ ప్లస్ ప్యాడ్ లభిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

వన్ ప్లస్ ప్యాడ్ లో ఫీచర్లు..

అమెజాన్ లో అందుబాటులో ఉన్న వన్ ప్లస్ ప్యాడ్ లో అనే ఫీచర్లు ఉన్నాయి. 11.6 అంగుళాల డిస్ ప్లే, మీడియా టెక్ డైమన్సిటీ 9000 ప్రాసెసర్‌తో పనితీరు మెరుగ్గా ఉంటుంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ సామర్థ్యం ఉంది. కస్టమర్‌లు ప్రత్యేకంగా ట్రాక్‌ప్యాడ్‌తో కూడిన కీబోర్డ్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. అన్ని వర్గాల ప్రజలకు, అవసరమైన ఫీచర్లతో అందుబాటులో ధరలో ఉంది.

ఆఫర్ వివరాలు..

అమెజాన్ లో వన్ ప్లస్ ప్యాడ్ ధర రూ.33,999గా నిర్ణయించారు. ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం తన ఖాతాదారులకు దీనిపై రూ. 2000 కూపన్‌ను అందిస్తోంది. మీరు బాక్స్‌పై టిక్ చేసి ప్యాడ్ పై ఆ తగ్గింపు పొందవచ్చు. అలాగే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డును ఉపయోగించిన చెల్లింపులు చేస్తే మరో రూ.రూ. 3000 తగ్గింపు పొందవచ్చు. దాదాపు రూ.30 వేల లోపు ధరలోనే వన్ ప్లస్ ప్యాడ్ లభిస్తుంది.

వన్ ప్లస్ ప్యాడ్ ప్రత్యేకతలు..

మీడియా టెక్ 9000 చిప్‌సెట్‌తో నిర్మించారు. 12 జీబీ ర్యామ్ తో పనితీరు వేగవంతంగా ఉంటుంది. 11.6 అంగుళాల 2.8 కె ఎల్ సీడీ డిస్‌ప్లేతో చాలా స్పష్టత ఉంటుంది. ఈ డిస్‌ప్లేకు డాల్బీ విజన్‌ సపోర్ట్‌ ఉంది. అలాగే స్పీకర్‌లు డాల్బీ అట్మోస్ మద్దతు లభిస్తుంది.

మెరుగైన పనితీరు..

ట్యాబ్లెట్‌లో నారో బెజెల్స్, అంచుల దగ్గర సాఫ్ట్ కర్వ్ లు ఆకట్టుకుంటున్నాయి. వన్‌ప్లస్ ప్యాడ్ వెనుక ప్యానెల్ 13 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఏర్పాటు చేశారు. కెమెరా మాడ్యూల్‌లో ఎల్ ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. వన్ ప్లస్ స్టైలో, మాగ్నెటిక్ కీబోర్డ్ (విడిగా విక్రయిస్తారు)కు మద్దతు ఇస్తుంది. దీనిలోని 6500 ఎంఏహెచ్ బ్యాటరీ తో చార్జింగ్ ఎక్కువసేపు వస్తుంది. 67 డబ్ల్యూ సూపర్ వీఓఓసీ ఛార్జింగ్ టెక్‌తో లభిస్తుంది. దిగువన ఛార్జింగ్ చేయడానికి టైప్ సీ పోర్ట్ ఉంది. హాలో గ్రీన్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 

మంచి అవకాశం

మంచి ఫీచర్ల కల ట్యాబ్లెట్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండూ ప్రస్తుతం విక్రయాలను నిర్వహిస్తున్నాయి. విస్తృత శ్రేణి  ట్యాబ్లెట్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తున్నాయి. అయితే ధరలను, ఫీచర్లను పరిశీలించి మంచి దానిని ఎంచుకోవాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..