Amazon Great indian: ప్రైమ్‌ యూజర్లకు మరో బంపరాఫర్‌ ప్రకటించిన అమెజాన్‌.. స్మార్ట్ ఫోన్ కొనుగోళ్లపై..

Amazon Great indian festival: ఈ పండుగ సీజన్‌ కోసం ఈ కామర్స్‌ సైట్లన్నీ భారీ ఎత్తున వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫెస్టివ్‌ సేల్స్‌ పేరుతో..

Amazon Great indian: ప్రైమ్‌ యూజర్లకు మరో బంపరాఫర్‌ ప్రకటించిన అమెజాన్‌.. స్మార్ట్ ఫోన్ కొనుగోళ్లపై..
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 05, 2021 | 3:47 PM

Amazon Great indian festival: ఈ పండుగ సీజన్‌ కోసం ఈ కామర్స్‌ సైట్లన్నీ భారీ ఎత్తున వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫెస్టివ్‌ సేల్స్‌ పేరుతో మునుపెన్నడూ లేని ఆఫర్లను ప్రకటించాయి. ఇందులో భాగంగానే అమెజాన్‌ గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌ సేల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అక్టోర్‌ 3 నుంచి ప్రారంభమైన ఈ సేల్‌ దూసుకుపోతోంది. ఏకంగా నెల రోజుల పాటు జరగనున్న ఈ ఫెస్టివల్‌ సేల్‌లో భాగంగా ల్యాప్‌టాప్‌ల నుంచి మొదలు పెడితే.. స్మార్ట్ టీవీలు , మొబైల్ ఫోన్‌లు , ఎయిర్ ప్యూరిఫైయర్‌లు , గృహోపకరణాలు , వంటగది ఉపకరణాలు ఇలా అన్ని రకాల వస్తువులపై ఆఫర్లు ప్రకటించింది.

ఇదిలా ఉంటే అమెజాన్‌ తన ప్రైమ్‌ మెంబర్స్‌ కోసం ఈ ఆఫర్‌ను ఒకరోజు ముందుగానే తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ప్రైమ్‌ మెంబర్స్‌ కోసం అమెజాన్‌ ఓ సర్‌ప్రైజింగ్‌ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ‘ అడ్వాన్‌టేజ్‌ జస్ట్‌ ఫర్‌ ప్రైమ్‌’ పేరిట సరికొత్త ప్రోగ్రాంను లాంచ్‌ చేసింది అమెజాన్‌. ఇందులో భాగంగా.. ప్రైమ్ మెంబర్స్‌కు నో కాస్ట్‌ ఈఏమ్‌ఐలను అందిస్తోంది. ప్రస్తుతం ఈ ఆఫర్‌ కేవలం స్మార్ట్‌ఫోన్లకే అందుబాటులో ఉంది.

దీంతో పాటుగా స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై అదనంగా కస్టమర్లు ఆరు నెలల ఉచిత స్క్రీన్‌ రిప్లేస్‌మెంట్‌ ప్రయోజనాలను కూడా పొందవచ్చును. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వినియోగదారుల కోసం మరిన్నీ ప్రత్యేక ఆఫర్లను కూడా అందిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ M52 5జీ , ఐక్యూ జెడ్‌5, షావోమీ 11 లైట్‌ 5G ఎన్‌ఈ, ఒప్పో ఏ55 నో వంటి ఫోన్‌లపై నో కాస్ట్‌ ఈఎమ్‌ఐలను అందిస్తోంది.

Also Read: Maa Elections 2021: మా ఎన్నికల్లో మరో ట్విస్ట్.. ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ..

KTR: నగర శివారు ప్రాంతాల్లో అండర్‎గ్రౌండ్ డ్రైనేజ్.. కౌన్సిల్‎లో కేటీఆర్..

Corona Third Wave: మూడోవేవ్ ముప్పు పొంచి ఉంది..జాగ్రత్తగా ఉండాలి.. ఆ రాష్ట్రాలకు ఐసీఎంఆర్ హెచ్చరిక!