Motorola Razr 40: తప్పలేదు మరి.. లెంపలేసుకొన్న అమెజాన్.. అసలేం జరిగిందంటే..
అమోజాన్ ఇండియా మోటోరోలా రాజ్ఆర్ 40 స్మార్ట్ ఫోన్ లాంచింగ్ ముందే దాని ధరను అనుకోకుండా ప్రకటించేసింది. అయితే ఇప్పుడు దానిని తొలగించేసింది. అమెజాన్ లిస్టింగ్ ప్రకారం ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ధర రూ. 59,999గా ఉంది.

మోటోరోలా నుంచి సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మోటోరోలా రాజ్ఆర్40 లాంచింగ్ కు రెడీ అయ్యింది. దీనిని జూలై 3వ తేదీన మోటోరోలా రాజ్ఆర్ 40 అల్ట్రాతో కలిపి విడుదల చేసేందుకు మోటోరోలా ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఈలోపే అమెజాన్ మోటోరోలా రాజ్ ఆర్ 40 ధరను ప్రకటించేసింది. అనుకోకుండా జరిగిన పొరపాటుతో అమెజాన్ లెంపలేసుకుని, మళ్లీ ఆ లిస్టింగ్ ను తొలగించింది. వాస్తవానికి ఈ ఫోల్డబుల్ ఫోన్ కు సంబంధించిన ఫీచర్లపై మోటోరోలా ఇది వరకూ టీజర్ విడుదల చేసింది. 6.9 అంగుళాల పీఓఎల్ఈడీ డిస్ ప్లే తో పాటు 144హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో ఈ ఫోన్ వస్తోంది. దీనిలో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ఎస్ఓసీ ప్రాసెసర్ ఉంటుంది. ఇది మొదట చైనాలో విడుదలైంది. దీనిలో 4,200ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 33 వాట్ల టర్బో చార్జింగ్ సదుపాయంతో వస్తోంది.
అమెజాన్ లిస్టింగ్ ప్రకారం..
అమోజాన్ ఇండియా మోటోరోలా రాజ్ఆర్ 40 స్మార్ట్ ఫోన్ లాంచింగ్ ముందే దాని ధరను అనుకోకుండా ప్రకటించేసింది. అయితే ఇప్పుడు దానిని తొలగించేసింది. అమెజాన్ లిస్టింగ్ ప్రకారం ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ధర రూ. 59,999గా ఉంది. ప్రస్తుతం ఈ మోటోరోలా రాజ్ ఆర్ 40, రాజ్ ఆర్ 40 అల్ట్రా రెండో స్మార్ట్ ఫోన్లు అమెజాన్ వెబ్ సైట్ నుంచి తొలగించింది.
చైనాలో దీని ధర ఎంతంటే..
వాస్తవానికి ఈ మోటోరోలా రాజ్ఆర్ 40 మొదటిగా చైనాలో గత నెలలో లాంచ్ అయ్యింది. 8జీబీ ర్యామ్, 128జీబీ వేరియంట్ ప్రారంభ ధర CNY 3,999 అంటే మన కరెన్సీలో రూ. 46,000గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 256జీబీ వేరియంట్ ధర CNY 4,299 అంటే మన కరెన్సీలో దాదాపు రూ.49,000 వరకూ ఉంటుంది. అలాగే 12జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో ఉండే వేరియంట్ ధర CNY 4,699 అంటే మన కరెన్సీలో రూ. 54,500 వరకూ ఉంటుంది.



జూలై 3న లాంచ్..
మోటోరోలా రాజ్ ఆర్ 40, మోటోరోలా రాజ్ 40 అల్ట్రా రెండు ఫోన్లు జూలూ 3న మన మార్కెట్లోకి రానున్నాయి. అమెజాన్ ప్లాట్ ఫాం పై అమ్మకాలు జరగనున్నాయి. ప్రారంభ ఆఫర్ కింద 10శాతం డిస్కౌంట్ కూడా అమెజాన్ ఈ ఫోన్లపై అందిస్తోంది. అయితే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్స్, ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
మోటోరోలా రాజ్ ఆర్ 40 స్పెసిఫికేషన్లు ఇవి..
మన దేశంలో లాంచ్ కాబోతున్న మోటోరోలా రాజ్ ఆర్ 40 ఫీచర్ల విషయానికి వస్తే.. దీనిలో 6.9 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఫోల్డబుల్ పీ ఓఎల్ఈడీ డిస్ ప్లే ఉంటుంది. 144 హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది స్నాప్ డ్రాగన్ 7జెన్ 1 ఎస్ఓసీ ఆధారంగా పనిచేస్తుంది. 12జీబీ ర్యామ్ సైజ్ ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ లో వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెట్ అప్ ఉంటుంది. 64 మెగా పిక్సల్ ప్రైమరీ సెన్సార్ఱ ఉంటుంది. 12 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ముందు వైపు సెల్ఫీల కోసం 32 మెగా పిక్సల్ కెమెరా ఉంటుంది. దీనిలో 4,200ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ల టర్బోచార్జింగ్ సపోర్టు ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




