Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivo T4 5G: లాంచ్ డేట్ ఫిక్స్! వివో నుంచి మరో 5జీ ఫోన్ వచ్చేస్తోంది..!

వివో నుంచి మరో 5జీ ఫోన్ లాంచింగ్ కు సిద్ధమైంది. గతేడాది వివో టీ3 5జీని తీసుకొచ్చిన కంపెనీ ఈ ఏడాది ఈ నెలలోనే వివో టీ4ఎక్స్ ను లాంచ్ చేసింది. ఇదే క్రమంలో మరో 5జీ ఫోన్ వివో టీ4 5జీని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. పలు ఆన్ లైన్న నివేదికల ప్రకారం వచ్చే ఏప్రిల్ ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనిలో టాప్ క్లాస్ ఫీచర్లతో పాటు భారీ బ్యాటరీ ఉంది. చూడటానికి స్టైలిష్ లుక్ ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

Vivo T4 5G: లాంచ్ డేట్ ఫిక్స్! వివో నుంచి మరో 5జీ ఫోన్ వచ్చేస్తోంది..!
Vivo T4 5g
Follow us
Srinu

|

Updated on: Mar 25, 2025 | 4:00 PM

భారతీయ మార్కెట్లో వివో స్మార్ట్ ఫోన్లకు మంచి డిమాండే ఉంది. ముఖ్యంగా బ్రాండ్ స్టైలిష్ డిజైన్ తో పాటు మంచి కెమెరా క్వాలిటీని అందిస్తుంది కాబట్టి యువత ఎక్కువ ఈ ఫోన్లను కొనుగోలు చేస్తుంటారు. మన మార్కెట్లో ఉన్న ఈ డిమాండ్ ను అందిపుచ్చుకోడానికి వివో సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను పరిచయం చేస్తూనే ఉంటోంది. ఈ క్రమంలో గతేడాది మార్చిలో వివో టీ3 5జీని తీసుకొచ్చింది. ఈ ఏడాది మార్చిలో వివో టీ4 ఎక్స్ ను లాంచ్ చేసింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వివో టీ4 5జీని లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అన్ని కుదిరితే ఏప్రిల్ నెలలోనే ఇది మార్కెట్లోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. కాగా ఈ ఫోన్ కు సంబంధించిన కీలక ఫీచర్లు ఆన్ లైన్ లో కనిపించాయి. దీని ధర రూ. 25,000 బడ్జెట్లో ఉండొచ్చని తెలుస్తోంది. ఈ హ్యాండ్ సెట్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ఎస్ఓసీ, 90వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో 7,300ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వచ్చే అవకావం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

వివో టీ4 5జీ లాంచ్ డేట్, ధర..

పలు ఆన్ లైన్ నివేదికల ప్రకారం వివో టీ4 5జీ స్మార్ట్ ఫోన్ వచ్చే నెల అంటే ఏప్రిల్ మాసంలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కంపెనీ త్వరలోనే అధికారికంగా హ్యాండ్‌సెట్‌ను టీజ్ చేసే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ధర దేశంలో రూ. 20,000 నుంచి రూ. 25,000 మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ 8జీబీ + 128జీబీ, 8జీబీ + 256జీబీ, 12జీబీ + 256జీబీ వేరియంట్లలో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే వివో టీ3 5జీ ఫోన్ మన దేశంలో 8జీబీ + 128జీబీ, 8జీబీ + 256జీబీ కాన్ఫిగరేషన్‌లతో వరుసగా రూ. 19,999, రూ. 21,999 ధరలకు అందుబాటులో ఉంది. అదే విధంగా వివో టీ4 5జీ ధరలు కూడా ఉండే అవకాశం ఉందని ఆన్ లైన్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

వివో టీ4 5జీ స్పెసిఫికేషన్లు..

ఆన్ లైన్ నివేదికలు చెబుతున్న దాని ప్రకారం వివో టీ4 5జీ ఫోన్ 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోల్డ్ క్వాడ్ కర్వడ్ డిస్ ప్లేను కలిగి ఉండొచ్చు. ఇది స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 15తో రవాణా అయ్యే అవకాశం ఉంది. ఆప్టిక్స్ విషయానికొస్తే, వివో టీ4 5జీ ఫోన్లో 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో కూడిన 50-మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్882 సెన్సార్ అమర్చబడి ఉంటుంది. హ్యాండ్‌సెట్‌లో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఉంది. అలాగే ఫోన్లో వివో టీ4 5జీ 90వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,300ఎంఏహెచ్ బ్యాటరీతో మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. ఇది ఐపీ బ్లాస్టర్‌తో వస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. హ్యాండ్‌సెట్ 8.1ఎంఎం ప్రొఫైల్‌తో రావచ్చు. 195 గ్రాముల బరువు ఉండే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..