- Telugu News Photo Gallery Technology photos These are the best convertible ACs under 35,000 in India, check details in telugu
Best ACs Under 35K: హాట్ సమ్మర్‌లో కూల్ కూల్..తక్కువ ధరలో బెస్ట్ ఏసీలు ఇవే..!
వేసవి ప్రారంభంలో మంచి ఏసీ ఒకటి కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అనువైన బడ్జెట్లో.. మంచి పనితీరు.. అధిక నాణ్యత కలిగిన ఎయిర్ కండీషనర్ కావాలనుకుంటున్నారా? అయితే ఇవే మీకు బెస్ట్ ఆప్షన్స్. సూపర్ కూలింగ్ ను అందించే హై ఎండ్ బ్రాండ్లు అయిన గోద్రెజ్, కేరియర్, పానసోనిక్ లకు చెందిన మోడళ్లు ఇవి. వీటిల్లో స్మార్ట్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. యాంటీ కర్రోసివ్ భాగాలు, హై టెక్ ఫిల్టరింగ్ సిస్టమ్స్ తో మంచి క్వాలిటీ ఎయిర్ ను అందిస్తాయి. రూ. 35,000లోపు ధరలోనే మీకు ఈ ఏసీలు లభిస్తున్నాయి. మీ రూమ్ పరిమాణాన్ని బట్టి సామర్థ్యాన్ని ఎంచుకొంటే ఈ సమ్మర్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు.
Srinu |
Updated on: Mar 26, 2025 | 2:07 PM

కేరియర్ 1 టన్ 3 స్టార్ ఏఐ ఫ్లెక్సీ కూల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ.. ఇది శక్తివంతమైన ఎనర్జీ సేవింగ్ కూలింగ్ సిస్టమ్. దీనిలో ఫ్లెక్సీ కూల్ 6 ఇన్ 1 కన్వర్టబుల్ టెక్నాలజీ ఉంటుంది. హెచ్డీ అండ్ పీఎం 2.5 ఫిల్టర్లతో కూడిన డ్యూయల్ ఫిల్టరేషన్ సిస్టమ్ స్వచ్ఛమైన చల్లని గాలిని అందిస్తుంది. 100శాతం కాపర్ కండెన్సర్ ఉంటుంది. ఇన్ స్టా కూల్ టెక్నాలజీతో నాణ్యమైన కూలింగ్ ను అందిస్తుంది. దీని ధర అమెజాన్లో రూ. 31,490గా ఉంది.

క్రూజ్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ.. ఇది అధిక సామర్థ్యం కలిగిన ఏసీ. దీనిలో వేరియోకూల్ కన్వర్టిబుల్ 4 ఇన్ 1 టెక్నాలజీ ఉంటుంది. 7 స్టేజ్ ఎయిర్ ప్యూరిఫికేషన్ ఉంటుంది. పీఎం 2.5 ఫిల్టర్లలో నాణ్యమైన గాలిని అందిస్తుంది. 5 స్టార్ రేటింగ్ తో అతి తక్కువ విద్యుత్ ను వినియోగించుకుంటుంది. ఓ మాదిరి పరిమాణం ఉన్న గదులకు సైతం ఇది సరిగ్గా సరిపోతుంది. దీని ధర అమెజాన్ ప్లాట్ ఫారంలో రూ. 33,990గా ఉంది.

గోద్రెజ్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ల్పిట్ ఏసీ.. దీనిలో కూడా 5ఇన్1 కన్వర్టబుల్ టెక్నాలజీతో వస్తుంది. దీనిలో 40శాతం నుంచి 110శాతం వరకూ కూలింగ్ లెవెల్స్ ఉంటాయి. దీనిలో 100శాతం కాపర్ కండెన్సర్ ఉంటుంది. ఇది 52 డిగ్రీల సెల్సీయస్ వద్ద కూడా మంచి కూలింగ్ ను అందిస్తుంది. ఐ-సెన్స్ టెక్నాలజీతో మీ గదిని చల్లగామార్చేస్తుంది. దీని ధర అమెజాన్లో రూ. 32,490గా ఉంది.

పానసోనిక్ 1.4 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ల్పిట్ ఏసీ.. మంచి ఎనర్జీ సేవింగ్ ఎయిర్ కండీషనర్ ను రూ. 35,000లోపు బడ్జెట్లో కావాలనుకుంటున్నారా? అయితే ఇది మీకు మంచి ఆప్షన్. దీనిలో 7ఎన్1 క న్వర్టిబుల్ మోడ్ ఉంటుంది. దీని సాయంతో మీ రూమ్ పరిమాణానికి అనుగుణంగా సెట్టింగ్స్ సెట్ చేసుకోవచ్చు. 100శాతం కాపర్ ట్యూబింగ్ ఉంటుంది. స్టేబులైజర్ ఫ్రీ ఆపరేషన్ ఉంటుంది. పీఎం0.1 ఫిల్టర్ సాయంతో గాలిని వడపోసి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. దీని ధర అమెజాన్ వెబ్ సైట్లో రూ. 34,490గా ఉంది.

వోల్టాస్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ల్పిట్ ఏసీ.. ఇది మంచి బిల్ట్ క్వాలిటీతో వస్తుంది. 4ఇన్ 1 అడ్జస్టబుల్ కూలింగ్ తో వస్తుంది. అతి తక్కువ విద్యుత్ వినియోగంతో హీట్ లోడ్ ను మెయింటేన్ చేస్తుంది. దీనిలో కూడా కాపర్ కండెన్సర్ ఉంటుంది. యాంటీ డస్ట్ ఫిల్టర్ తో నాణ్యమైన ఫ్రెష్ గాలిని అందిస్తుంది. టర్బో మోడ్ ఇన్ స్టంట్ కూలింగ్ ను అందిస్తుంది. స్టేబులైజర్ ఫ్రీ ఆపరేషన్ అందిస్తుంది. దీని ధర అమెజాన్లో 33,390గా ఉంది.





























