Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airtel 5G: దేశంలో తొలిసారిగా 5జి ట్రయల్ నిర్వహించిన ఎయిర్‌టెల్.. 4జీ కన్నా మెరుగైన డౌన్‌లోడ్ వేగం!

ఎయిర్‌టెల్ కంపెనీ భారత్ లో తొలి 5G ట్రయల్‌ని ప్రారంభించింది. ఢిల్లీ ఎన్‌సిఆర్ శివార్లలో ఉన్న భైపూర్ బ్రాహ్మణన్ గ్రామంలో ఈ ట్రయల్ నిర్వహిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఎరిక్సన్ కంపెనీ సహకారంతో ఎయిర్‌టెల్ ఈ ట్రయల్ చేస్తోంది.

Airtel 5G: దేశంలో తొలిసారిగా 5జి ట్రయల్ నిర్వహించిన ఎయిర్‌టెల్.. 4జీ కన్నా మెరుగైన డౌన్‌లోడ్ వేగం!
Airtel 5g
Follow us
KVD Varma

|

Updated on: Oct 06, 2021 | 6:12 PM

Airtel 5G: ఎయిర్‌టెల్ కంపెనీ భారత్ లో తొలి 5G ట్రయల్‌ని ప్రారంభించింది. ఢిల్లీ ఎన్‌సిఆర్ శివార్లలో ఉన్న భైపూర్ బ్రాహ్మణన్ గ్రామంలో ఈ ట్రయల్ నిర్వహిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఎరిక్సన్ కంపెనీ సహకారంతో ఎయిర్‌టెల్ ఈ ట్రయల్ చేస్తోంది. ఒక టెలికాం కంపెనీ ఒక గ్రామంలో 5G ని పరీక్షించడం ఇదే మొదటిసారి. డీఓటీ (DoT) ప్రకారం, 5G టెక్నాలజీ 4G టెక్నాలజీ కంటే 10 రెట్లు మెరుగైన డౌన్‌లోడ్ వేగాన్ని అందిస్తుంది.

ఎయిర్‌టెల్-ఎరిక్సన్ ట్రయల్ కొన్ని నెలల క్రితం భారతీ ఎయిర్‌టెల్-ఎరిక్సన్ చేతులు కలిపి 5G నెట్‌వర్క్ ఇంటర్నెట్ వేగాన్ని 1GB/s కంటే ఎక్కువ చేసింది. ఇద్దరూ కలిసి గురుగ్రామ్‌లోని ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని సైబర్ హబ్‌లో ట్రయల్ చేశారు. ఈ పరీక్ష 3500 MHz సామర్థ్యం కలిగిన ట్రయల్ స్పెక్ట్రంలో జరిగింది. ఎయిర్‌టెల్ ట్రయల్ సమయంలో, కంపెనీ 1Gbps కంటే ఎక్కువ వేగాన్ని సాధించింది. ఇది దేశంలో 4G నెట్‌వర్క్‌లో లభించే వేగం కంటే ఎక్కువ.

వినియోగదారులు 5G ద్వారా క్లౌడ్‌కి కనెక్ట్ అవుతారు..

సెల్యులార్ టెక్నాలజీలో 5G అనేది లేటెస్ట్ టెక్నాలజీ. 5G కింద, వినియోగదారులు మరింత వేగం, తక్కువ జాప్యం, మరింత సౌలభ్యాన్ని పొందుతారు. 5G సెల్యులార్ టెక్నాలజీ గురించి చెప్పుకుంటే ఇది క్లయింట్‌లను క్లౌడ్‌కు కనెక్ట్ చేస్తుంది. 5G కొత్త ప్రక్రియ ద్వారా బహుళ ఛానెల్‌లలో ఒకే డిజిటల్ సిగ్నల్‌ను పంపుతుంది. ఇది మెరుగైన ఇంటర్నెట్ వేగాన్ని అందించడమే కాకుండా, ఆటోమేషన్‌కు కొత్త రూపాన్ని అందిస్తుంది.

వేగం కాకుండా, 5G చాలా చోట్ల ఉపయోగపడుతుంది. ఇది కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది అలాగే 5G.. టెక్నాలజీ సహాయంతో డ్రైవర్ లేని కారు కలని సులభంగా సాకారం చేస్తుంది. ఇది ఆరోగ్య సంరక్షణ, వర్చువల్ రియాలిటీ, క్లౌడ్ గేమింగ్‌ను కూడా సులభతరం చేస్తుంది.

5G ప్రస్తుతం నగరాల్లో మాత్రమే తీసుకువస్తారని భావిస్తున్న తరుణంలో ఆ భావన తప్పు అని నిరూపించడానికి ఈ ట్రయల్ కూడా సహాయపడుతుంది. గ్రామాలు, నగరాల మధ్య డిజిటల్ డివైడర్ గురించి చర్చ జరుగుతోంది. దీంతో అది పోతుంది. 5G సహాయంతో, వినియోగదారులు మెరుగైన మొబైల్ బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్‌ను పొందుతారు. వారు ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ సర్వీస్‌ని కూడా సద్వినియోగం చేసుకోగలుగుతారు. అయితే, ట్రయల్ సమయంలో సాధారణ ప్రజలు 5G ఇంటర్నెట్‌ను ఉపయోగించలేరు.

Also Read: Reliance Jio network down: రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌ డౌన్‌.. ఇబ్బందులు పడ్డ వినియోగదారులు..!

Windows 11: విండోస్ 11 వచ్చేసింది.. దీనిని మీ కంప్యూటర్ లో ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చంటే..

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!