Apple: యాపిల్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఈ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్
ఐఫోన్.. చాలా మందికి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలనేది ఒక డ్రీమ్. యాపిల్ నుంచి కొత్త ప్రొడక్ట్ వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా బజ్ ఏర్పడుతుంది. ఐఫోన్ కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చిందంటే చాలు కొనుగోలు చేసేందుకు కస్టమర్లు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఎన్నో అధునాతన ఫీచర్లు ఉండే యాపిల్ ఫోన్స్‌ను కొనుగోలు...
ఐఫోన్.. చాలా మందికి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలనేది ఒక డ్రీమ్. యాపిల్ నుంచి కొత్త ప్రొడక్ట్ వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా బజ్ ఏర్పడుతుంది. ఐఫోన్ కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చిందంటే చాలు కొనుగోలు చేసేందుకు కస్టమర్లు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఎన్నో అధునాతన ఫీచర్లు ఉండే యాపిల్ ఫోన్స్‌ను కొనుగోలు చేయాలనే ఆశ అందరిలో ఉన్నా.. ధరకు భయపడి వెనుకడుగు వేస్తుంటారు.
అయితే తాజాగా యాపిల్ తీసుకున్న నిర్ణయంతో ఐఫోన్ యూజర్లకు ఊరటనిచ్చింది. తాజాగా యాపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాత మోడల్స్‌పై భారీగా డిస్కౌంట్స్‌ను అందిస్తోంది. లాంచ్ చేసిన సమయంతో పోల్చితే ఐఫోన్ పాత మోడల్స్‌పై రూ. 10 వేలరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. వీటితో పాటు ఈ కామర్స్ సంస్థలు అదనంగా పాత ఫోన్‌లపై డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు.
త్వరలోనే ఈ కామర్స్ సంస్థలు అందించననున్న బిగ్ బిలియన్ డేస్‌తో ఐఫోన్‌పై మరింత డిస్కౌంట్ లభించనుంది. ఐఫోన్ 14, 15 సిరీస్‌లపై కంపెనీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఐఫోన్ 15 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 79,900 కాగా ఇప్పుడు రూ. 69,900కి లభించనుంది. ఇక 256 జీబీ వేరియంట్ ధర రూ. 79,900కి అందుబాటులోకి రానుంది. ఐఫోన్ 14 సిరీస్ విషయానికొస్తే.. 128 జీబీ వేరియంట్ ధర రూ. 69,900గా ఉండగా తగ్గిన ధరతో రూ. 59,900కి లభించనుంది. 256 జీబీ వేరియంట్ ధర రూ. 69,900 అలాగే 512 జీబీ వేరియంట్ ధర రూ. 89,900కి లభిచంనుంది. ఇక ఐఫోన్ 16 లాంచ్ చేసిన నేపథ్యంలో యాపిల్.. ఐఫోన్ 15ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ తయారీని నిలిపివేసింది. ఐఫోన్ 13, వాచ్ సిరీస్ 9ను కూడా నిలిపివేసింది.
ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..
ఐఫోన్ 15 ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.1 ఇంచెస్‌తో కూడిన సూర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ ఏ16 బయోనిక్ చిప్ వంటి ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే నాన్‌స్టాప్‌గా 26 గంటలు పనిచేస్తుంది. యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. వైర్‌లైస్ ఛార్జింగ్‌కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
ఐఫోన్ 14 ఫోన్ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.1 ఇంచెస్‌తో కూడిన సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్ 12 మెగాపిక్సెల్స్తో కూడిన కెమెరాను ఇచ్చారు. ఇక ఈ ఫోన్ ఏ15 బయోపిక్ చిప్, 6 కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో బిల్ట్ ఇన్ స్టీరియో స్పీకర్‌ను ఇచ్చారు. ఐఓఎస్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..