AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lay Offs: ఉద్యోగులను సాగనంపే దిశగా అడుగులు.. రంగం సిద్ధం చేస్తోన్న సోషల్‌ మీడియా దిగ్గజం..

Lay Offs: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ముసురుకుంటోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటోంది. అయితే ఇప్పటి వరకు ఆర్థిక సంక్షోభానికి సంబంధించి అమెరికా ఎలాంటి...

Lay Offs: ఉద్యోగులను సాగనంపే దిశగా అడుగులు.. రంగం సిద్ధం చేస్తోన్న సోషల్‌ మీడియా దిగ్గజం..
Narender Vaitla
|

Updated on: Aug 14, 2022 | 5:01 PM

Share

Lay Offs: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ముసురుకుంటోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటోంది. అయితే ఇప్పటి వరకు ఆర్థిక సంక్షోభానికి సంబంధించి అమెరికా ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ అక్కడి టెక్‌ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండడం చూస్తుంటే మాంద్యం వచ్చేసిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌, మైక్రోసాఫ్ట్‌, టిక్‌టాక్‌ వంటి కంపెనీలు ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లు ఇచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో సోషల్‌ మీడియా దిగ్గజం స్నాప్‌చాట్‌ కూడా తమ ఉద్యోగులను తొలగించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆర్థిక కారణాల దృష్ట్యా ఉద్యోగులను తొలగించే దిశగా స్నాప్‌చాట్‌ మేనేజర్లు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఉద్యోగుల తొలగింపుపై ఇప్పటి వరకు కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.  సుమారు 6 వేల మంది ఉద్యోగులను పంపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఏ స్థాయి ఉద్యోగులను తొలగించనున్నారు అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే స్నాప్‌చాట్‌ ఉద్యోగులను తొలగిచండం ఇదే తొలిసారి కాదు.

2018లోనూ పలువురు ఉద్యోగులను సాగనంపింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో స్నాప్‌చాట్ సీఈఓ ఇవాన్‌ స్పీగెల్ ఉద్యోగుల నియామక ప్రక్రియను నిలిపివేసి, అదనపు వ్యయాలను ఆదా చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉద్యోగులను తొలగించనున్నట్లు వస్తున్న వార్తలకు బలం చేకూర్చినట్లైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

బుల్లెట్ రైళ్ల కారిడార్‌పై కేంద్రం నుంచి బిగ్ అప్డేట్
బుల్లెట్ రైళ్ల కారిడార్‌పై కేంద్రం నుంచి బిగ్ అప్డేట్
బూజే కదా అని నిర్లక్ష్యం చేస్తే.. అంతులేని నష్టాలు తప్పవు..!
బూజే కదా అని నిర్లక్ష్యం చేస్తే.. అంతులేని నష్టాలు తప్పవు..!
రాత్రి పడుకునే ముందు జస్ట్ ఇలా చేస్తే చాలు.. మీ ముఖం అద్దంలా
రాత్రి పడుకునే ముందు జస్ట్ ఇలా చేస్తే చాలు.. మీ ముఖం అద్దంలా
మ్యాచ్ చూస్తూ హాయిగా కూల్ డ్రింక్ తాగుదామని ప్లాన్ చేస్తున్నారా..
మ్యాచ్ చూస్తూ హాయిగా కూల్ డ్రింక్ తాగుదామని ప్లాన్ చేస్తున్నారా..
కొబ్బరి పచ్చడి ఇలా కొత్తగా ట్రై చేయండి.. లంచ్ బాక్స్ కు పర్ఫెక్ట్
కొబ్బరి పచ్చడి ఇలా కొత్తగా ట్రై చేయండి.. లంచ్ బాక్స్ కు పర్ఫెక్ట్
శివరాత్రి రోజున త్రిగ్రహ సంచారం.. ఈ రాశులపై శివుడి కటాక్షం..
శివరాత్రి రోజున త్రిగ్రహ సంచారం.. ఈ రాశులపై శివుడి కటాక్షం..
మీ ఇంట్లో రణపాల మొక్క ఉంటే ఏమవుతుందో తెలుసా..?
మీ ఇంట్లో రణపాల మొక్క ఉంటే ఏమవుతుందో తెలుసా..?
BCB vs BCCI: బీసీసీఐతో కాళ్ల బేరానికి వచ్చిన బంగ్లాదేశ్..
BCB vs BCCI: బీసీసీఐతో కాళ్ల బేరానికి వచ్చిన బంగ్లాదేశ్..
గ్రామ పంచాయతీలకు కేంద్రం మరో గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు
గ్రామ పంచాయతీలకు కేంద్రం మరో గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు
వామ్మో.. గుండెలు పగిలే దృశ్యం.. ఒక్కచోటనే 3 కొండచిలువలు
వామ్మో.. గుండెలు పగిలే దృశ్యం.. ఒక్కచోటనే 3 కొండచిలువలు