- Telugu News Photo Gallery Technology photos Noise launches new smartwatch Noise colorfit ultra 2 buzz features and price Telugu Tech News
Noise Smart Watch: బడ్జెట్ ధరలో బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ కోసం సెర్చ్ చేస్తున్నారా.? అయితే ఇదే బెస్ట్ ఆప్షన్..
Noise Colorfit Ultra 2 buzz: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం నాయిస్ కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. ఆగస్టు 17వ తేదీన సేల్ ప్రారంభం కానున్న ఈ స్మార్ట్ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్‌తో పాటు మరెన్నో అధునాతన ఫీచర్లను అందించారు..
Updated on: Aug 13, 2022 | 8:38 PM

ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌ల హవా నడుస్తోంది. ముఖ్యంగా బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌లకు డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో నాయిస్ కొత్త వాచ్‌ను లాంచ్ చేసింది. నాయిస్ కలర్‌ఫిట్ అల్ట్రా 2 బజ్ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ వాచ్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారు.

ఈ స్మార్ట్ వాచ్‌లో 1.78 ఇంచుల అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 368x448 పిక్సెల్ రెజల్యూషన్, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, అల్‌వేర్ ఆన్ డిస్‌ప్లే ఫీచర్లు ఇచ్చారు.

100కుపైగా వాచ్ ఫేసెస్‌తో పాటు బ్లూటూత్ కాలింగ్ కోసం ఇన్‌బుల్ట్‌గా మైక్, స్పీకర్‌ను అందించారు. వాచ్‌తోనే నేరుగా కాల్స్ మాట్లాడుకోవచ్చు. బ్లూటూత్ వెర్షన్ 5.3తో వాచ్ పనిచేస్తుంది.

హార్ట్‌రేట్ సెన్సార్, ఎస్‌పీఓ2, స్లీప్ ట్రాకింగ్‌తో మరెన్నో హెల్త్ సంబంధిత ఫీచర్స్ అందించారు. రన్నింగ్, సైక్లింగ్ సహా మొత్తంగా 100కుపైగా స్పోర్ట్స్ మోడ్స్‌కు సపోర్ట్ చేస్తుంది.

ధర విషయానికొస్తే.. ఆగస్టు 17న సేల్ ప్రారంభం కానున్న ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 6,999కాగా ఆఫర్‌లో భాగంగా రూ. 3,999కి అందుబాటులోకి తీసుకురానున్నారు.





























