- Telugu News Photo Gallery Technology photos Xiaomi launches new foldable phone Xiaomi Mix Fold 2 price and features Telugu Tech news
Xiaomi Mix Fold 2: షావోమీ నుంచి మడతపెట్టే ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?
Xiaomi Mix Fold 2: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ తాజాగా కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేసింది. షావోమీ మిక్స్ ఫోల్డ్ 2 పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్‌లో అధునాతన ఫీచర్లను అందించారు. ప్రస్తుతం చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ త్వరలోనే భారత్‌లోకి రానుంది...
Updated on: Aug 14, 2022 | 6:18 PM

స్మార్ట్‌ఫోన్‌లు రోజుకో రూపం మార్చుకుంటూ సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం ఫోల్డబుల్ (మడతపెట్టే) ఫోన్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే సామ్‌సంగ్ వంటి అగ్ర సంస్థలు ఇలాంటి ఫోన్‌లను లాంచ్ చేయగా.. తాజాగా చైనాకు చెందిన షావోమీ.. షావోమీ మిక్స్ ఫోల్డ్ 2 పేరుతో చైనాలో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఫోల్డ్ చేసినప్పుడు కనిపించే బయట డిస్‌ప్లే 6.56 ఇంచెస్‌తో రూపొందించారు. ఇక లోపల ఉండే డిస్‌ప్లేను 8 ఇంచెస్‌తో ఇచ్చారు. రెండు డిస్‌ప్లేలూ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌కి సపోర్ట్ చేస్తాయి.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 4ఎన్‌ఎమ్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో గరిష్టంగా 12 జీబీ ర్యామ్, 1టీబీ వరకు స్టోరేజ్‌ను అందించారు.

షావోమీ మిక్స్ ఫోల్డ్ 2 స్మార్ట్ ఫోన్‌లో 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. కేవలం 40 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది.

కెమెరా విషయానికొస్తే 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ఇండియన్ కరెన్సీలో రూ. 1,06,400 కాగా, 12GB+512GB ధర రూ.1,18,300, 12GB RAM + 1TB ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 1,42,000 వరకు ఉండొచ్చు.





























