AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp On Smartwatch: అరచేతిలో నుంచి మణికట్టుకు ప్రపంచం!  స్మార్ట్ వాచ్ వినియోగదారులకు వాట్సాప్ గుడ్ న్యూస్..

స్మార్ట్ ఫోన్ల రాకతో ప్రపంచం అరచేతిలో ఇమిడిపోయింది. ఏది కావాలన్నా స్మార్ట్ ఫోన్ సాయంతో తెలుసుకోగలుగుతున్నాం, చేసుకోగలుగుతున్నాం. అయితే సాంకేతికత రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు ఆ స్మార్ట్ ఫోన్ స్థానాన్ని నెమ్మదిగా స్మార్ట్ వాచ్ ఆక్రమిస్తోంది.

WhatsApp On Smartwatch: అరచేతిలో నుంచి మణికట్టుకు ప్రపంచం!  స్మార్ట్ వాచ్ వినియోగదారులకు వాట్సాప్ గుడ్ న్యూస్..
Whatsapp On Smartwatch
Madhu
|

Updated on: Jul 24, 2023 | 5:00 PM

Share

స్మార్ట్ ఫోన్ల రాకతో ప్రపంచం అరచేతిలో ఇమిడిపోయింది. ఏది కావాలన్నా స్మార్ట్ ఫోన్ సాయంతో తెలుసుకోగలుగుతున్నాం, చేసుకోగలుగుతున్నాం. అయితే సాంకేతికత రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు ఆ స్మార్ట్ ఫోన్ స్థానాన్ని నెమ్మదిగా స్మార్ట్ వాచ్ ఆక్రమిస్తోంది. ఏంటి? ఆశ్చర్యంగా ఉందా? నిజమేనండి.. ప్రస్తుతం స్మార్ట్ వాచ్ లు అత్యాధునిక సాంకేతికతతో వస్తున్నాయి. కాల్స్, మెసేజ్, ఫిట్ నెస్ ట్రాకర్, హెల్త్ ట్రాకర్ వంటి ఫీచర్లు ఉంటున్నాయి. ఇప్పుడు కొత్తగా మరో అద్భుతమైన ఫీచర్ స్మార్ట్ వాచ్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. అదేంటే ఇప్పుడు స్మార్ట్ వాచ్ లలో వాట్సాప్ కూడా వినియోగించుకోవచ్చు. చాట్, కాల్స్, అలెర్ట్ లను వాచ్ ద్వారా వినియోగించుకోవచ్చు. ఫోన్ లో వాట్సాప్ చాట్ చేసినట్టుగానే స్మార్ట్ వాచ్ నుంచి వాట్సాప్ మెసేజ్ లకు రిప్లై ఇవ్వొచ్చని వాట్సాప్ ప్రకటించింది. అయితే ఇది ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉంటుందని పేర్కొంది. గూగుల్ వాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ వేర్ ఓఎస్ 3తో పనిచేస్తున్న అన్ని రకాల స్మార్ట్ వాచ్ లలో ఈ వాట్సాప్ సేవలు ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది.

ఈ స్మార్ట్ వాచ్ లలో..

స్మార్ట్ వాచ్ లో వాట్సాప్ పనిచేయాలంటే దానిలో తప్పనిసరిగా వేర్ ఓఎస్ ఉండాలి. ఈ ఓఎస్ ప్రస్తుతానికి శామ్సంగ్, గూగుల్, ఫాజిల్ వంటి ప్రీమియం స్మార్ట్ వాచ్ లలో మాత్రమే అందుబాటులో ఉంది. యాపిల్ స్మార్ట్ వాచ్ లలో ఈ ఫీచర్ అందుబాటులో లేదు. కేవలం ఆండ్రాయిడ్ వెర్షన్, అది కూడా వేర్ ఓఎస్3 పైనే పనిచేసే స్మార్ట్ వాచ్ లలో మాత్రమే ఇది పనిచేస్తుంది. స్మార్ట్ వాచ్ లలో వాట్సాప్ ను ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం రండి..

  • ముందుగా మీరు వేర్ ఓఎస్ 3 ఆధారంగా పనిచేసే స్మార్ట్ వాచ్ ను కొనుగోలు చేయండి.
  • అందులో ప్లే స్టోర్ లోకి వెళ్లి యాప్స్ ఆన్ ఫోన్ పై క్లిక్ చేయండి. వాట్సాప్ ను ఇన్ స్టాల్ చేయండి.
  • అప్పటికే ఉన్న వాట్సాప్ ఇన్ స్టాల్ అయ్యి ఉన్న స్మార్ట్ ఫోన్ తో మీ స్మార్ట్ వాచ్ లింక్ అయ్యి ఉండాలన్న విషయాన్ని మర్చిపోవద్దు.
  • మీ స్మార్ట్ వాచ్ లో వాట్సాప్ ను ఓపెన్ చేయండి.
  • ఎనిమిది అక్షరాల కోడ్ మీకు కనిపిస్తుంది.
  • మీ ఫోన్ లో నోటిఫికేషన్ వచ్చాక దానిని ఫోలో అయితే సరిపోతుంది.
  • ఈ ప్రక్రియ పూర్యాయ్యాక మీ వాట్సాప్ లోని చాట్స్, కాల్స్, ఇమోజీలు అన్ని కనిపిస్తాయి.
  • అయితే ఈ ఫీచర్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఐఫోన్ కంపెనికి చెందిన ఫోన్లలో పనిచేయదు.
  • అలాగే వాట్సాప్ బిజినెస్ ఖాతాకు కూడా పనిచేయదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..