Microchip: తప్పిపోయిన పిల్లి సొంతింటికి చేరిందిలా.. యజమానులకు ఆనందానికి కారణమిదే..!

చాలామంది తమ ఇళ్లలో కుక్కలను, పిల్లులను పెంచుకుంటూ ఉంటారు. తమ పిల్లలతో సమానంగా ఎంతో ప్రేమగా వాటి బాగోగులు చూస్తారు. కుటుంబంలో సభ్యులుగా వాటిని పరిగణిస్తారు. అవి కూడా తమ యజమానులపై ఎంతో ప్రేమగా ఉంటాయి. అయితే అనుకోని సందర్బాల్లో అవి తప్పిపోయి, ఎటో వెళ్లిపోయినప్పుడు చాలా బాధ కలుగుతుంది.

Microchip: తప్పిపోయిన పిల్లి సొంతింటికి చేరిందిలా.. యజమానులకు ఆనందానికి కారణమిదే..!
Microchip Pets
Follow us
Srinu

|

Updated on: Sep 30, 2024 | 8:11 PM

చాలామంది తమ ఇళ్లలో కుక్కలను, పిల్లులను పెంచుకుంటూ ఉంటారు. తమ పిల్లలతో సమానంగా ఎంతో ప్రేమగా వాటి బాగోగులు చూస్తారు. కుటుంబంలో సభ్యులుగా వాటిని పరిగణిస్తారు. అవి కూడా తమ యజమానులపై ఎంతో ప్రేమగా ఉంటాయి. అయితే అనుకోని సందర్బాల్లో అవి తప్పిపోయి, ఎటో వెళ్లిపోయినప్పుడు చాలా బాధ కలుగుతుంది. అవి తిరిగి వస్తాయని ఎదురుచూస్తూ గడుపుతూ ఉంటారు.  అమెరికాకు చెందిన దంపతులు తాము ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లి తప్పిపోయినందుకు చాలా బాధ పడ్డారు. అయితే కొంతకాలం తర్వాత ఆ పిల్లి వారి వద్ద కు చాలా సురక్షితంగా  చేరింది. ఆ పిల్లికి ఏర్పాటు చేసిన మైక్రోచిప్ వల్ల ఇదంతా సాధ్యమైంది.  

తప్పిపోయిన పిల్లి

కాలిఫోర్నియాలో నివసించే సుసానే, బెన్నీ దంపతులు విహారయాత్రకు వెళ్లారు. రెండున్నరేళ్ల వయసున్న వారి పెంపుడు పిల్లి రేన్ బ్యూ ను కూడా తీసుకువెళ్లారు. యాత్రలో భాగంగా ఎల్లోస్టోన్ నేషనల్ పార్కును సందర్శించినప్పుడు పిల్లి కనిపించకుండా పోయింది. ఆ పార్కులో ఎటో తప్పిపోయింది. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో సునానే దంపతులు తమ ఇంటికి తిరిగి వచ్చేవారు. తప్పిపోయిన పిల్లిని తలుచుకుని ఎంతో బాధపడేవారు.

ఫోన్ కు మెసేజ్

సుసానే దంపతులకు కొన్ని నెలల తర్వాత ఒక మెసేజ్ వచ్చింది. వారి పిల్లి ఒక జంతుసంరక్షణ కేంద్రంలో ఉందని, దానికి ఆరోగ్యం బాగాలేదని దానిలో సారాంశం. పిల్లి సమాచారం తెలియడంతో వారిద్దరూ ఎంతో సంతోషించారు. కాగా పిల్లికి మైక్రోచిప్ అమర్చడం వల్ల ఇందతా సాధ్యమైంది. పొగొట్టుకున్నామనుకున్న పిల్లి దొరకడంతో సుసానే దంపతులు చాలా సంతోషం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

ప్రయోజనమిదే..

అమెరికన్ వెటర్నరీ మెడికల్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏటా మిలియన్ల కొద్దీ పిల్లులు, కుక్కులు తమ యజమానుల నుంచి తప్పిపోతున్నాయి. లేకపోతే దొంగిలించబడుతున్నాయి. వాటిలో 50 జంతువులలో ఒకటి మాాత్రమే తిరిగి సొంతింటికి చేరుతోంది. పెంపుడు జంతువులకు మైక్రోచిప్ చేయించడం వల్ల ఇలాంటి సమయంలో చాలా ఉపయోగంగా ఉంటుంది. మైక్రోచిప్ ఉన్న జంతువులు తప్పిపోతే గుర్తించడానికి అవకాశం ఉంటుంది.

మైక్రోచిప్ అంటే..

మైక్రోచిప్ అనేది పెంపుడు జంతువులకు ఐడీగా పనిచేస్తుంది.  దానిలో యజమాని వివరాలు, ఫోన్ నంబర్ ఉంటాయి. వీటిని టీకా మాదిరిగా ఇంజెక్షన్ తో జంతువుల చర్మం లోపల అమర్చుతారు. వీటివల్ల ఎలాంటి ఇబ్బందులు, సైడ్ ఎఫెక్టులు ఉండవు. తప్పిపోయి రోడ్లపైన తిరుగుతున్న జంతువులను అధికారులు గుర్తించి సంరక్షణ కేంద్రానికి తీసుకువెళతారు. అక్కడ ఈ మైక్రోచిప్ ను స్కాన్ చేసి యజమానుల వివరాలను గుర్తించే అవకాశం ఉంటుంది. మైక్రోచిప్ అనేది జంతువులను బట్టి మారుతూ ఉంటుంది. వీటిని అమర్చడానికి జంతువుకు మత్తు మందు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సులువుగా, వేగంగా ఆ ప్రక్రియ పూర్తవుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

భారత బౌలర్లకు హెచ్చరిక: ఆస్ట్రేలియా టీనేజర్ సంచలన వ్యాఖ్యలు!
భారత బౌలర్లకు హెచ్చరిక: ఆస్ట్రేలియా టీనేజర్ సంచలన వ్యాఖ్యలు!
టీమిండియాకు షాక్..! బాక్సింగ్ డే టెస్ట్ ముందు కేఎల్ రాహుల్ గాయం..
టీమిండియాకు షాక్..! బాక్సింగ్ డే టెస్ట్ ముందు కేఎల్ రాహుల్ గాయం..
ఎన్టీఆర్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ఎన్టీఆర్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ఆదివారం పొరపాటున కూడా వీటిని తినొద్దు.. ఎందుకంటే
ఆదివారం పొరపాటున కూడా వీటిని తినొద్దు.. ఎందుకంటే
కిర్రాకెక్కించే పజిల్.. ఈ ఫోటోలో నెంబర్ గురిస్తే మీరు తోపు బాసూ.
కిర్రాకెక్కించే పజిల్.. ఈ ఫోటోలో నెంబర్ గురిస్తే మీరు తోపు బాసూ.
ఫ్లిప్‌కార్ట్ నుంచి ప్రత్యేక సేల్‌.. వీటిపై భారీ తగ్గింపు!
ఫ్లిప్‌కార్ట్ నుంచి ప్రత్యేక సేల్‌.. వీటిపై భారీ తగ్గింపు!
ఏంటి.. జమిలికి మరో పదేళ్లా?
ఏంటి.. జమిలికి మరో పదేళ్లా?
బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..