AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICICI cash back: ఐఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్..!

ఆపిల్ కంపెనీ నుంచి విడుదలయ్యే వస్తువులకు మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వాటిని కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఎగబడతారు. మిగిలిన వాటితో పోల్చితే వీటి ధరలు కొంచె ఎక్కువగా ఉన్నా, నాణ్యత పనితీరు విషయంలో చాలా మెరుగ్గా ఉంటాయి. ప్రస్తుతం ఐఫోన్ 16 విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐ తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది.

ICICI cash back: ఐఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్..!
Nikhil
|

Updated on: Sep 30, 2024 | 8:45 PM

Share

ఆపిల్ కంపెనీ నుంచి విడుదలయ్యే వస్తువులకు మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వాటిని కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఎగబడతారు. మిగిలిన వాటితో పోల్చితే వీటి ధరలు కొంచె ఎక్కువగా ఉన్నా, నాణ్యత పనితీరు విషయంలో చాలా మెరుగ్గా ఉంటాయి. ప్రస్తుతం ఐఫోన్ 16 విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐ తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఐఫోన్ తో పాటు ఇతర ఆపిల్ వస్తువుల కొనుగోలుపై ప్రత్యేక డీల్ ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంకు తన కస్టమర్లకు ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ ను అందజేస్తుంది. ఆపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారికి ఇది వర్తిస్తుంది. దీనిలో భాగంగా తమ క్రెడిట్, డెటిట్ కార్డులతో ఐఫోన్ 16ను కొనుగోలు చేసిన ఐసీఐసీఐ బ్యాంకు వినియోగదారులు రూ.5 వేలు వరకూ తక్షణ క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అలాగే ఆపిల్ వాచ్ పై రూ.2,500, ఎయిర్ ప్యాడ్ లపై రూ.1,500 వరకూ తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ అమల్లో ఉంటుంది.

ఐ ఫోన్ ఫర్ లైఫ్

ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు హోల్డర్లకు మరో అదనపు ప్రయోజనం లభిస్తుంది. ఆపిల్ కు సంబంధించిన ఐఫోన్ ఫర్ లైఫ్ అనే ప్రోగ్రామ్ ను రిజిస్టర్ చేసుకునే అవకాశం కలుగుతుంది. రూ.2,497 చొప్పున 24 నెలల పాటు వడ్డీ రహిత వాయిదాలలో ఎంపిక చేసిన ఐఫోన్ ను కొనుగోలు చేయడానికి వీలుంటుంది. అలాగే తమ ఫోన్ ను అప్ గ్రేడ్ చేసినప్పుడు ఇప్పటికే కొనుగోలు చేసిన ఐఫోన్ కు గ్యారంటీ బై బ్యాక్ ఆప్షన్ వర్తిస్తుంది. ఆ అవకాశం ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 పై అందుబాటులో ఉంది. సమీపంలోని అప్ట్రోనిక్స్, ఇమేజిన్, యూనికార్న్, క్రోమా, రిలయన్స్, విజయ్ సేల్స్, పూర్విక, సంగీత తదితర వాటితో పాటు ఆన్ లైన్ ప్లాట్ ఫాంలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఏవైనా ఆపిల్ షోరూమ్ లలో ఈ ఆఫర్ మీద వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు.

ఎంతో ప్రయోజనం

కొత్తగా విడుదలైన ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ ఈ జాబితాలో ఉండడం వల్ల వినియోగదారులకు చాలా ఉపయోగం ఉంటుంది. వీటిలో పెద్ద డిస్ ప్లే, కెమెరా నియంత్రణ, ప్రో కెమెరా ఫీచర్లు, ఎక్కువ బ్యాటరీ సామర్జ్యం, ఏ18 ప్రో చిప్ తదితర ఫీచర్లు ఉన్నాయి. కొత్త ఆఫర్ పై ఐసీఐసీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సొల్యూషన్స్ హెడ్ అనీష్ మాధవన్ మాట్లాడుతూ పండగ సీజన్ లో అందిస్తున్ కొత్త ఆఫర్ తో వినియోగదారులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ముఖ్యంగా ఐఫోన్ 16 పై ఇస్తున్న క్యాష్ బ్యాక్ చాలా ఉపయోగంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అలాగే ఐఫోన్ ఫర్ లైఫ్ ప్రోగ్రామ్ తో పండగ షాపింగ్ మరింత ప్రయోజనకరంగా మారుతుందన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..