AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swiggy Instamart: ఈ కామర్స్‌ రంగంలో మరో విప్లవం.. అందుబాటులోకి 24/7 సేవలు..

ఈకామర్స్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. అత్యంత తక్కువ సమయంలో వస్తువులను డెలివరీ చేసే సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇంట్లో కూర్చొనే నచ్చిన వస్తువులు గడప వద్దకు వచ్చేస్తున్నాయి. అయితే కొన్ని సంస్థలు మరో అడుగు ముందుకేసి కేవలం 10 నిమిషాల్లోనే ప్రొడక్ట్స్‌ను అందిస్తున్నాయి..

Swiggy Instamart: ఈ కామర్స్‌ రంగంలో మరో విప్లవం.. అందుబాటులోకి 24/7 సేవలు..
Swiggy
Narender Vaitla
|

Updated on: Sep 30, 2024 | 3:55 PM

Share

ఈకామర్స్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. అత్యంత తక్కువ సమయంలో వస్తువులను డెలివరీ చేసే సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇంట్లో కూర్చొనే నచ్చిన వస్తువులు గడప వద్దకు వచ్చేస్తున్నాయి. అయితే కొన్ని సంస్థలు మరో అడుగు ముందుకేసి కేవలం 10 నిమిషాల్లోనే ప్రొడక్ట్స్‌ను అందిస్తున్నాయి.

క్విక్‌ కామర్స్‌ పేరుతో బ్లింక్‌ఇట్‌, జెప్టో, స్విగ్గీ వంటి సంస్థలు అత్యంత తక్కువ సమయంలో డెలివరీలు అందిస్తోంది. అయతే ఇప్పటి వరకు ఈ సేవలు గరిష్టంగా రాత్రి 10 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే తాజాగా ప్రముఖ డెలివరీ సంస్థ స్విగ్గీ సరికొత్త విప్లవానికి నాంది పలికింది. 24/7 సేవలను అందుబాటులోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుత పండగ నేపథ్యంలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇకపై కస్టమర్లు రోజులో ఏ సమయంలో అయినా సరే వస్తువులను కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే పొందొచ్చు. ప్రస్తుతం ఈ సేవలను ఢిల్లీ, గోర్గాన్‌ నోయిడా పట్టణాల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అత్యవసర వస్తువులు మొదలు గ్రాసరీలు, ఎలక్ట్రానిక్స్‌, బహుతులు వంటి వాటిని ఈ సేవల ద్వారా పొందొచ్చు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇలాంటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి ఈ కామర్స్‌ సంస్థగా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ నిలిచింది. రానున్న రోజుల్లో ఈ సేవలను దేశమంతా విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే