రోహిత్ శ‌ర్మ‌ ఫ‌స్ట్ క్రికెట్ క్ర‌ష్ ఎవ‌రో తెల్సా..?

రోహిత్ శ‌ర్మ‌ ఫ‌స్ట్ క్రికెట్ క్ర‌ష్ ఎవ‌రో తెల్సా..?

క‌రోనా వైర‌స్ కార‌ణంగా కొన్ని టోర్నీలు ర‌ద్ద‌వ్వ‌డం..మ‌రికొన్ని వాయిదా ప‌డ‌టం తెలిసిందే. ప్ర‌స్తుతం లాక్ డౌన్ అమ‌లవుతోన్న నేప‌థ్యంలో క్రీడాకారులంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో ఫ్యాన్స్ కు సోష‌ల్ మీడియాలో క‌రోనాపై జాగ్ర‌త్త‌లు చెప్తూ.. వారు అడిగిన ప‌ర్స‌న‌ల్ ప్ర‌శ్న‌ల‌కు క్రేజీ స‌మాధానాలు ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే భార‌త ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ‌..త‌న ఫ‌స్ట్ క్రికెట్ క్ర‌ష్ ఎవ‌రో రివీల్ చేశాడు. భార‌త మాజీ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ త‌న ఫ‌స్ట్ క్రికెట్ క్ర‌ష్ అంటూ ఇప్ప‌టివ‌ర‌కు […]

Ram Naramaneni

|

Apr 08, 2020 | 6:07 PM

క‌రోనా వైర‌స్ కార‌ణంగా కొన్ని టోర్నీలు ర‌ద్ద‌వ్వ‌డం..మ‌రికొన్ని వాయిదా ప‌డ‌టం తెలిసిందే. ప్ర‌స్తుతం లాక్ డౌన్ అమ‌లవుతోన్న నేప‌థ్యంలో క్రీడాకారులంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో ఫ్యాన్స్ కు సోష‌ల్ మీడియాలో క‌రోనాపై జాగ్ర‌త్త‌లు చెప్తూ.. వారు అడిగిన ప‌ర్స‌న‌ల్ ప్ర‌శ్న‌ల‌కు క్రేజీ స‌మాధానాలు ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే భార‌త ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ‌..త‌న ఫ‌స్ట్ క్రికెట్ క్ర‌ష్ ఎవ‌రో రివీల్ చేశాడు. భార‌త మాజీ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ త‌న ఫ‌స్ట్ క్రికెట్ క్ర‌ష్ అంటూ ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రికీ తెల‌యని విష‌యాన్ని రివీల్ చేశాడు.

ఇక యువ‌రాజ్ తో త‌న ప‌రిచ‌యం కూడా కాస్త డిఫ‌రెంట్ గా జ‌రిగిందంటూ గ‌త విష‌యాల‌ను గుర్తు తెచ్చుకున్నాడు రోహిత్. తొలిసారి భార‌త జ‌ట్టు బ‌స్సు ఎక్కినప్పుడు, తాను యువ‌రాజ్ సీట్లోనే కూర్చున్నాన‌ని పేర్కొన్నాడు. ఆ త‌ర్వాత స‌న్ గ్లాసెస్ పెట్టుకుని చాలా స్టైలిష్‌గా యువీ బ‌స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడ‌ని, త‌న‌కు వెల్‌క‌మ్ చెప్పిన‌ట్లు వెల్లడించాడు. కాగా యువ‌రాజ్ ని ఫ‌స్ట్ టైమ్ చూసిన తాను థ్రిల్ల‌యిన‌ట్లు రోహిత్ తెలిపాడు. అనంత‌రం యూవీ త‌న‌ సీట్‌లో నుంచి లేచి, వేరే చోట‌ కూర్చోవాల‌ని సూచించాడ‌న్నాడు. ఆ త‌ర్వాతి కాలంలో యూవీతో త‌న‌కు క్లోజ్ నెస్ బాగా పెరిగింద‌ని చెప్పుకొచ్చాడు. అప్ప‌డు యంగ్ ప్లేయ‌ర్స్ లో త‌న‌కే ప‌రిణితి ఎక్కువ ఉందని యువీ ప్రైజ్ చేసిన‌ట్టు తెలిపాడు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu