యూవీ వాక్కు…. దేశానికి వారే ఆయువు… సమస్యలు పరిష్కారం కావాలి.. జై జవాన్ జై కిసాన్ జై హింద్ అంటూ ట్వీట్…
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్విట్టర్ వేదికగా రైతు సమస్యలపై స్పందించాడు. పుట్టిన రోజున విడుదల చేసిన ప్రకటనలో దేశానికి రైతులు ఆయువని అన్నారు.
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్విట్టర్ వేదికగా రైతు సమస్యలపై స్పందించాడు. పుట్టిన రోజున విడుదల చేసిన ప్రకటనలో దేశానికి రైతులు ఆయువని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమానికి పరిష్కారం దొరకాలని ఆశా భావం వ్యక్తం చేశారు. దేశ పౌరునిగా ఇటీవల యోగరాజ్ సింగ్ చేసిన ప్రకటనకు బాధపడ్డానని అన్నారు.
— Yuvraj Singh (@YUVSTRONG12) December 11, 2020
అందరూ అప్రమత్తంగా ఉండాలి… దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరు కరోనాతో పోరాడుతున్నారని పేర్కొన్నారు.కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతోందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. చివరగా జై జవాన్, జై కిసాన్, జై హింద్ అంటూ ముంగించాడు.