మూడో మ్యాచ్ కూడా అదే దారిలో.. రసవత్తరంగా సాగిన ఇండియన్‌ సూపర్‌ లీగ్‌‌.. హైదరాబాద్‌ ఎఫ్‌సీకు మూడో మ్యాచ్ డ్రా..

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌‌లో హైదరాబాద్‌ ఎఫ్‌సీ జట్టుకు మూడో డ్రా ఎదురైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఏటీకే మోహన్‌ బగాన్‌ ఎఫ్‌సీతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌ను హైదరాబాద్‌ 1-1తో డ్రాగా ముగించింది.

మూడో మ్యాచ్ కూడా అదే దారిలో.. రసవత్తరంగా సాగిన ఇండియన్‌ సూపర్‌ లీగ్‌‌.. హైదరాబాద్‌ ఎఫ్‌సీకు మూడో మ్యాచ్ డ్రా..
Sanjay Kasula

|

Dec 12, 2020 | 5:49 AM

Hyderabad FC : ఇండియన్‌ సూపర్‌ లీగ్‌‌లో హైదరాబాద్‌ ఎఫ్‌సీ జట్టుకు మూడో డ్రా ఎదురైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఏటీకే మోహన్‌ బగాన్‌ ఎఫ్‌సీతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌ను హైదరాబాద్‌ 1-1తో డ్రాగా ముగించింది.

ఐఎస్‌ఎల్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో హైదరాబాద్‌ ఎఫ్‌సీ జట్టు మరో ‘డ్రా’ నమోదు చేసుకుంది. శుక్రవారం ఏటీకే మోహన్‌ బగాన్, హైదరాబాద్‌ ఎఫ్‌సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 1–1తో డ్రా అయ్యింది. ప్రారంభం నుంచి మ్యాచ్ పోటా పోటీగా సాగింది. గోల్ చేసేందుకు రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డాయి. ఆట 54వ నిమిషంలో మన్వీర్‌ సింగ్‌ చేసిన గోల్‌తో మోహన్‌ బగాన్‌ 1–0తో ముందంజ వేసింది.

రెండో అర్ధభాగంలో హైదరాబాద్‌ ఈ లెక్కను సరిచేసింది. 65వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను జావో విక్టర్‌ గోల్‌గా మలచడంలో హైదరాబాద్‌ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. లీగ్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లాడిన హైదరాబాద్‌ ఎఫ్‌సీ ఒక మ్యాచ్‌లో గెలుపొంది, 3 మ్యాచ్‌ల్లో డ్రా నమోదు చేసింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu