IND vs SA: మొదటి వన్డేకు వరుణుడి ఆటంకం తప్పదా.. వాతావరణ శాఖ అంచనా ఎలా ఉందంటే..
స్వదేశంలో భారత్ దక్షిణాఫ్రికాతో మూడు వన్డే మ్యాచ్ లు ఆడనుంది. అక్టోబర్ 6వ తేదీన ప్రారంభమయ్యే వన్డే సిరీస్ అక్టోబర్ 11వ తేదీ వరకు జరగనుంది. ఈ వన్డే సిరీస్ కు కొత్త ఆటగాళ్లకు అవకాశం లభించింది. అక్టోబర్ నెలలోనే టీ20 ప్రపంచ కప్ ఉండటంతో..
స్వదేశంలో భారత్ దక్షిణాఫ్రికాతో మూడు వన్డే మ్యాచ్ లు ఆడనుంది. అక్టోబర్ 6వ తేదీన ప్రారంభమయ్యే వన్డే సిరీస్ అక్టోబర్ 11వ తేదీ వరకు జరగనుంది. ఈ వన్డే సిరీస్ కు కొత్త ఆటగాళ్లకు అవకాశం లభించింది. అక్టోబర్ నెలలోనే టీ20 ప్రపంచ కప్ ఉండటంతో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు ద్వితీయ శ్రేణి జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఇప్పటికే రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాకు బయలేదేరి వెళ్లింది. దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ కు శిఖర్ దావన్ నేతృత్వం వహిస్తున్నాడు. అయితే లక్నో వేదికగా భారతరత్న అటల్ బిహరీ వాజ్ పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో గురువారం మద్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావల్సి ఉంది. మద్యాహ్నం ఒంటి గంటకు టాస్ వేస్తారు. అయితే ప్రస్తుతం లక్నోలో వాతావరణ పరిస్థితులను చూస్తే మాత్రం మొదటి వన్డేకు వరుణుడి ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది.
భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం గురువారం లక్నోలో వర్షం కురిసే అవకాశం ఉంది. గత రెండు రోజులుగా కూడా లక్నోలో వానలు పడుతున్నాయి. బుధవారం వర్షం కురవడంతో భారత్ ప్రాక్టీస్ సెషన్ రద్దయింది. వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం మద్యాహ్నం ఒంటి గంట ప్రాతంలో 1.6 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదయ్యే అవకాశం ఉందని, వాతావరణంలో తేమ దాదాపు 82 శాతం ఉంటుంది. గురువారం మొత్తం వాతావరణం మేఘావృతమై ఉంటుందని, మద్యాహ్నం 3 గంటల సమయంలోనూ ఎక్కువ వర్షం కురిస్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో మొదటి వన్డే మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానం నెలకొంది.
టీ20 ప్రపంచకప్ కు స్టాండ్ బై ఆటగాళ్లుగా ఉన్న కొందరికి దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ లో అవకాశం కల్పించింది. ఒక వేళ టీ20 ప్రపంచకప్ నాటికి ఎవరైనా ప్రధాన ఆటగాళ్లు దూరమైతే వారి స్థానంలో స్టాండ్ బై ఆటగాళ్లకు అవకాశం లభిస్తుంది. తమ సత్తా చాటుకునేందుకు స్టాండ్ బై ఆటగాళ్లకు వన్డే సిరీస్ ఒక అవకాశం కానుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..