Cricket World Cup 2023: ప్రపంచ కప్ కు జట్టు ఎంపిక ఓ ఛాలెంజ్ గా మారనుందన్న వీవీఎస్.లక్ష్మణ్.. ఎందుకంటే..
భారత్ వేదికగా 2023లో క్రికెట్ ప్రపంచకప్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ కు జట్టు ఎంపికపై భారత మాజీ క్రికెటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్.లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరల్డ్‌కప్‌నకు జట్టు ఎంపిక సెలక్టర్లకు కత్తిమీద సాముగా మారనుందని చెప్పాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌కు వీవీఎస్.లక్ష్మణ్ స్టాండ్ ఇన్..
భారత్ వేదికగా 2023లో క్రికెట్ ప్రపంచకప్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ కు జట్టు ఎంపికపై భారత మాజీ క్రికెటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్.లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరల్డ్‌కప్‌నకు జట్టు ఎంపిక సెలక్టర్లకు కత్తిమీద సాముగా మారనుందని చెప్పాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌కు వీవీఎస్.లక్ష్మణ్ స్టాండ్ ఇన్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే యువ క్రికెటర్లు అద్భుతంగా ఆడుతుండటంతో సెలక్టర్ల ఆప్షన్లు కఠినతరంగా మారనున్నాయని లక్ష్మన్ వ్యాఖ్యానించారు. బ్యాకప్ కోచ్‌గా ఇప్పటి వరకు బాగానే ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విధానం వల్ల రాహుల్ ద్రవిడ్ టీ20 ప్రపంచ కప్‌నకు పూర్తిస్థాయిలో సేవలు అందించేలా వెసులుబాటు లభిస్తోందన్నారు ఈ హైదరాబాదీ వెటరన్ క్రికెటర్. భారత్ లో సరిపడినంత మంది మంచి క్రికెటర్లు ఉన్నారని, వారంతా భవిష్యత్తు సిరీస్‌లను దృష్టిలో పెట్టుకొని సిద్ధమవుతున్నారని తెలిపారు. వారి మధ్య మంచి పోటీ ఉందని, 2023 వన్డే ప్రపంచ కప్‌నకు సరైన జట్టును ఎంపిక చేయడం సెలక్టర్లకు కష్టతరం కానుందని, ఒక రకంగా ఇది ఛాలెంజ్ అని వ్యాఖ్యానించారు. ఒక్క సారి ప్రధాన ఆటగాళ్లు తిరిగి వస్తే అవకాశాలు పరిమితం అవుతాయని యువ ఆటగాళ్లకు తెలుసుని, అందుకే వారు బాగా ఆడుతున్నారని వీవీఎస్. లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.
యువ క్రికెటర్లకు ఇది ఒక మంచి అవకాశమని వీవీఎస్. లక్మణ్ చెప్పారు. బాగా ఆడిన వారినే ఎంపిక చేస్తున్నప్పుడు.. మంచి ప్రదర్శనతో అవకాశాలను సజీవంగా ఉంచుకోవచ్చని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లతో కూడిన జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లడంతో, దక్షిణాఫ్రికాతో వన్డే సీరిస్ కు భారత్ కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. దీంతో యువ క్రికెటర్లని దృష్టిలో పెట్టుకుని లక్ష్మణ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ప్రపంచకప్ లేదా ఏదైనా అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ లకు జట్టు ఎంపిక చాలా కీలకం. ప్రతి జట్టు గెలవాలనే లక్ష్యంతోనే తమ తుది జట్లను ఎంపిక చేస్తుంది. ఈ క్రమంలో బాగా ఆడే ఆటగాళ్లకు అవకాశం లభిస్తోంది. ఇలా చాలా మంది యువ ఆటగాళ్లకు అవకాశం కూడా వచ్చింది. సూర్యకుమార్ యాదవ్ లాంటి వాళ్లు ఐపీఎల్ లో తమదైన ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో వారు ఆ తర్వాత భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించుకోవడంతొ పాటు.. వారి స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. కేవలం సూర్య కుమార్ యాదవ్ ఒక్కడే కాదు. ఈ జాబితాలో ఎంతో మంది క్రికెటర్లు ఉన్నారు. యువ క్రికెటర్లు తమకు అవకాశం దొరికనప్పుడు తమ సత్తా చాటుతుంటే వారు సెలక్టర్ల దృష్టిలో పడతారు. అద్భుత ప్రదర్శన ఇచ్చే ఆటగాళ్ల సంఖ్య ఎక్కువుగా ఉన్నప్పుడు జట్టు ఎంపిక సెలక్టర్లకు కష్టతరమవుతుంది. కొన్ని సందర్భాల్లో సరైన జట్టును ఎంపిక చేయకపోతే, మాజీ క్రికెటర్ల నుంచే కాకుండా క్రికెట్ అభిమానుల నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఇవ్వన్ని దృష్టిలో పెట్టుకునూ వీవీఎస్. లక్ష్మణ్ వరల్డ్ కప్ కు జట్టు ఎంపిక కత్తిమీద సాముగా మారనుందనే వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..