Pro Kabaddi 2022: నేటి నుంచి కబడ్డీ..కబడ్డీ.. తొలి రోజు ముచ్చటగా మూడు మ్యాచ్ లు..

ఈరోజు నుంచి భారత్ లో కబడ్డీ పండగ ప్రారంభం కానుంది. సుమారు నెల రోజుల పాటు కబడ్డీ ప్రియులను అలరించనుంది. శుక్రవారం నుంచి పీకేఎల్ సీజన్‌ 9 ప్రారంభమవుతోంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ దబంగ్‌ ఢిల్లీ కేసీ, మాజీ ఛాంపియన్‌ యు ముంబాతో తలపడనుంది. ప్రారంభ మ్యాచ్..

Pro Kabaddi 2022: నేటి నుంచి కబడ్డీ..కబడ్డీ.. తొలి రోజు ముచ్చటగా మూడు మ్యాచ్ లు..
Pro Kabaddi Season 9
Follow us

|

Updated on: Oct 07, 2022 | 1:53 PM

ఈరోజు నుంచి భారత్ లో కబడ్డీ పండగ ప్రారంభం కానుంది. సుమారు నెల రోజుల పాటు కబడ్డీ ప్రియులను అలరించనుంది. శుక్రవారం నుంచి పీకేఎల్ సీజన్‌ 9 ప్రారంభమవుతోంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ దబంగ్‌ ఢిల్లీ కేసీ, మాజీ ఛాంపియన్‌ యు ముంబాతో తలపడనుంది. ప్రారంభ మ్యాచ్ బెంగళూరులోని శ్రీ కంఠీరవ ఇండోర్‌ స్టేడియంలో జరగనుంది. కోవిడ్ కారణంగా గతంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ లు నిర్వహించగా, మూడు సీజన్ల తర్వాత తొలిసారి ప్రేక్షకులను స్టేడియాలకు అనుమతిస్తున్నారు. ఈ సీజన్ లో ఫ్టస్ లీగ్ మ్యాచులన్నీ బెంగళూరులో జరగనున్నాయి. ఆ తర్వాత మిగిలని మ్యాచు లు పూణేలో జరుగుతాయి. తొలిరోజు మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. దబంగ్ ఢిల్లీ, యు ముంబా మ్యాచ్‌ తర్వాత తెలుగు టైటన్స్‌, బెంగళూరు బుల్స్‌ మధ్య మరో మ్యాచ్‌ జరగనుంది. మూడో మ్యాచ్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌, యూపీ యోధాస్‌ తలపడనున్నాయి. ఈసారి టైటిల్ కోసం పోటీ పడుతున్న మొత్తం 12 జట్లలో.. తెలుగు టైటాన్స్, యు ముంబా, దబాంగ్ ఢిల్లీ, జైపూర్ పింక్ ఫాంథర్స్, యూపీ యోధాస్, హర్యానా స్టీలర్స్, పూణేరి ఫల్టాన్, తమిళ్ తలైవాస్, గుజరాత్ జెయింట్స్, బెంగాళ్ వారియర్స్, బెంగళూరు బుల్స్, పాట్నా పైరెట్స్ ఉన్నాయి.

ప్రొ కబడ్డీ లీగ్ అక్టోబర్ 7వ తేదీ నుంచి నవంబర్ 8వ తేదీ వరకు జరగనుంది. తొలి మూడు రోజులు మూడేసి మ్యాచ్ ల చొప్పున జరగనున్నాయి. లీగ్ లో పాల్గొనే మొత్తం 12 జట్లు ఈ మూడు రోజుల్లో ఆడనున్నాయి. ఆ తర్వాత సీజన్ మొత్తం రోజుకు రెండు మ్యాచ్ లు ఉంటాయి. అయితే సీజన్‌ మొత్తం శుక్ర, శనివారాల్లో మాత్రం మూడేసి మ్యాచ్‌లు ఉంటాయి. ఈసారి పీకేఎల్‌ మ్యాచ్‌లను స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌, డిస్నీ+ హాట్‌స్టార్‌ ఓటీటీల్లో చూడొచ్చు. మూడు మ్యాచ్‌లు ఉన్న రోజుల్లో తొలి మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక రెండో మ్యాచ్‌ 8.30 గంటలకు, మూడో మ్యాచ్‌ 9.30 గంటలకు ప్రారంభమవుతాయి.

ఇవి కూడా చదవండి

గ్రామీణ క్రీడల్లో ఒకటి కబడ్డీ, ప్రత్యేకంగా గ్రౌండ్ లేకపోయినా, గ్రామాల్లో రోడ్ల మీద కూడా కబడ్డీ ఆడుతుంటారు. క్రికెట్ కు ఎంతో క్రేజు ఉందో గతంలో కబడ్డీకి అంతే క్రేజు ఉండేది. అయితే రోడ్లపై ఆడటంతో ఎక్కువ దెబ్బలు తగలడంతో ఆ తరువాత ఈ క్రీడకు కొంత ఆదరణ తగ్గింది. అయితే క్రికెట్ లో ఐపీఎల్ కు క్రేజ్ రావడంతో.. అదే తరహాలో కబడ్డీకి క్రేజు తీసుకొచ్చేందుకు ప్రొ కబడ్డీ లీగ్ 2014లో ప్రారంభమైంది. ఇప్పటిరకు 8 సీజన్ లు పూర్తిచేసుకుని ఈఏడాది 9వ సీజన్ లోకి అడుగుపెట్టింది. ఈ ప్రొ కబడ్డీతో ఎంతోమంది కబడ్డీ ఆటగాళ్లు గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

కర్ణాటకలో ప్రొ కబడ్డీ సీజన్ 9 మ్యాచ్ లు ప్రారంభం కావడంపై ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ సంతోషం వ్యక్తం చేశారు. పోటీల్లో పాల్గొంటున్న జట్లు, క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..