India vs South Africa 3rd T20I: చివరి టీ20లో టీమిండియాలో కీలక మార్పులు.. కోహ్లీ, రాహుల్‌కు విశ్రాంతి..
సౌతాఫ్రికాపై వరుసగా రెండు టీ20 మ్యాచుల్లో గెలిచి టీమిండియా 2-0 తేడాతో ఇప్పటికే సిరీస్‌ను ఖాతాలో వేసుకుంది. కాగా.. ఇండోర్‌లో భారత్ - దక్షిణాఫ్రికా మధ్య మంగళవారం మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.
సౌతాఫ్రికాపై వరుసగా రెండు టీ20 మ్యాచుల్లో గెలిచి టీమిండియా 2-0 తేడాతో ఇప్పటికే సిరీస్‌ను ఖాతాలో వేసుకుంది. కాగా.. ఇండోర్‌లో భారత్ – దక్షిణాఫ్రికా మధ్య మంగళవారం మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు భారత జట్టు ఆడబోయే ఆఖరి టీ20 మ్యాచ్ ఇదే కానుంది. అయితే.. ఈమ్యాచ్‌లో ఎట్టకేలకు గెలిచి పరువు నిలబెట్టుకోవాలని సౌతాఫ్రికా ఆటగాళ్లు చూస్తుండగా.. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేసుకోవాలని టీమిండియా ఊవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి టీ20 మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న తరుణంలో స్వల్ప మార్పులు చేసింది. దక్షిణాఫ్రికాతో మంగళవారం జరగనున్న చివరి టీ20 మ్యాచ్ నుంచి విరాట్ కోహ్లీ , కేఎల్ రాహుల్‌లకు విశ్రాంతి లభించింది. అయితే.. ఇప్పటికే ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్‌ని ఇక నేరుగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో బరిలో దింపాలని చూస్తున్నట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు.
ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌కు కూడా విశ్రాంతి ఇచ్చినట్లు బీసీసీఐ వెల్లడించింది. అక్టోబరు 23న ఐకానిక్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్థాన్ – భారత్ మధ్య మ్యాచ్ జరగనుంది. ప్రపంచ కప్ కోసం కోహ్లీ సహా తదితర ఆటగాళ్లను అత్యుత్తమ ఉత్సాహంతో ఉంచేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే.. కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ రెస్ట్ తీసుకుంటే భారత జట్టు బ్యాటింగ్ విభాగం వీక్ అయిపోతుందని పేర్కొంటున్నారు. సౌతాఫ్రికాతో జరిగే చివరి టీ20 మ్యాచ్‌కు సంబంధించి ఆటగాళ్లను ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే.. వారి స్థానంలో ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..