Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో సరికొత్త రికార్డు.. భారత్ ఖాతాలో ఏడు పతకాలు

Tokyo Olympics 2020: టోక్యో ఒలంపిక్స్‌లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రా సాధించిన స్వర్ణ పతకంతో.. మునుపెన్నడూ లేని స్థాయిలో ఈ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో ఏడు పతకాలు చేరాయి.

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో సరికొత్త రికార్డు.. భారత్ ఖాతాలో ఏడు పతకాలు
Neeraj Chopra Gold Medal
Follow us
Janardhan Veluru

|

Updated on: Aug 07, 2021 | 6:47 PM

Tokyo Olympics 202: టోక్యో ఒలంపిక్స్‌లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రా సాధించిన స్వర్ణ పతకంతో.. మునుపెన్నడూ లేని స్థాయిలో ఈ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో అత్యధికంగా ఏడు పతకాలు చేరాయి. శనివారంనాడు భారత జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. టోక్యో ఒలింపిక్స్ పురుషుల జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం సాధించాడు. వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ అభినవ్ బింద్రా(2008 బీజింగ్ ఒలింపిక్స్) తర్వాత ఒలంపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన రెండో ఆటగాడిగా హర్యానాకు చెందిన నీరజ్ ఘనత సాధించాడు.

అథ్లెటిక్స్ విభాగంలో నీరజ్ చోప్రాదే ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన తొలి పసిడి పతకం కావడం విశేషం. దీంతో 100 ఏళ్ల భారత కల నెరవేరింది. శుక్రవారంనాటి వరకు భారత్ ఖాతాలో మొత్తం ఐదు పతకాలు ఉన్నాయి. నీరజ్ చోప్రా స్వర్ణం సాధించటానికి ముందు.. రెజ్లర్ భజరంగ్ ఉడుంపట్టుతో కాంస్యం సాధించాడు. దీంతో శనివారం ఒక్కరోజే భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి.

నీరజ్ చోప్రా పసిడి గెలిచిన సందర్భం..వీడియో

టోక్యో ఒలంపిక్స్‌లో భారత్ ఖాతాలో మొత్తం ఏడో పతకాలు చేరగా.. ఇందులో ఓ స్వర్ణం, రెండు రజతం, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఒలింపిక్స్ క్రీడాల్లో అత్యధిక పతకాలు టోక్యో ఒలంపిక్స్‌లోనే సాధించడం విశేషం. 2012 లండన్ ఒలంపిక్స్‌లో భారత్ 6వ పతకాలు సాధించడమే ఇప్పటి వరకు రికార్డుగా ఉంటూ వచ్చింది. మొత్తం ఏడు పతకాలతో భారత్ ఇప్పుడు సరికొత్త రికార్డును నమోదుచేసుకుంది.

నీరజ్ చోప్రా సాధించిన స్వర్ణ పతకంతో టోక్యో ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ 47వ స్థానానికి ఎగబాకింది. చైనా 38 స్వర్ణాలు, 30 రజతాలు, 18 కాంస్యాలతో మొత్తం 86 పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలుస్తోంది. 34 స్వర్ణాలు, 37 రజతాలు, 32 కాంస్యాలతో మొత్తం 103 పతకాలు సాధించిన అమెరికా రెండో స్థానంలో కొనసాగుతోంది. మొత్తం పతకాల సంఖ్యలో అమెరికా ముందున్నా..స్వర్ణ పతకాలు సంఖ్య పరంగా చైనా కంటే వెనుకబడింది.

ఇదిలా ఉండగా టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి సాధించిన నీరజ్ చోప్రాకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలియజేశారు.

Also Read..

Sachin Tendulkar : ఆ షాట్‌కి సచిన్‌ ఫ్యాన్‌ అయిపోయాడు..! అతడిని ప్రశంసలతో ముంచెత్తాడు..

Ananta Sriram: గేయ రచయిత అనంత శ్రీరామ్ పై పోలీసులకు ఫిర్యాదు.. కారణం ఇదే..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..