AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PV Sindhu: పతకాల వేటలో తెలుగు తేజం పీవీ సింధు .. ఒలంపిక్స్‌లో మరో విజయం..

PV Sindhu: కరోనా నిబంధనల నడుమ మొదలైన టోక్యో ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ లక్ష్యంగా బరిలోకి దిగిన తెలుగు తేజం పీవీ సింధు మరో గెలుపుని సొంతం చేసుకుంది. మొదటి మ్యాచ్ లో..

PV Sindhu: పతకాల వేటలో తెలుగు తేజం పీవీ సింధు .. ఒలంపిక్స్‌లో మరో విజయం..
Pv Sindhu
Surya Kala
|

Updated on: Jul 28, 2021 | 11:10 AM

Share

PV Sindhu: కరోనా నిబంధనల నడుమ మొదలైన టోక్యో ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ లక్ష్యంగా బరిలోకి దిగిన తెలుగు తేజం పీవీ సింధు మరో గెలుపుని సొంతం చేసుకుంది. మొదటి మ్యాచ్ లో అలవోకగా నెగ్గిన ఈ స్టార్ ప్లేయర్ .. ఈరోజు గ్రూప్ జె నుంచి మరో విజయం సొంతం చేసుకుని టాప్ లో నిలిచి భారత పతకాల ఆశలను సజీవంగా ఉంచుతూ ప్రీ క్వార్టర్ ఫైనల్ కు ఎంట్రీ ఇచ్చింది. హాంకాంగ్ ప్లేయర్ చేంగ్ న్గాన్‌ను రెండు వరస సెట్లను . 21-9, 21-16తో ఓడించింది. తొలి గేమ్‌ లో వరుస స్మాష్, డ్రాప్ షాట్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపింది. కేవలం 15 నిమిషాల్లోనే సునాయాసంగా సొంతం చేసుకుంది సింధు. రెండో గేమ్‌లో ప్ర‌త్యర్థి నుంచి ప్ర‌తిఘ‌ట‌న ఎదురైంది. 14 పాయింట్ల వ‌ర‌కూ ఇద్ద‌రూ హోరాహోరీగా త‌ల‌ప‌డ్డారు. అయితే ఆ త‌ర్వాత పుంజుకున్న సింధు.. వ‌రుస‌గా పాయింట్లు సాధించింది. గ్రూప్ జేలో నుంచి సింధు..

ఆదివారం మహిళల సింగిల్స్‌లో తొలి మ్యాచ్‌లో ఇజ్రాయెల్ షట్లర్‌‌తో తలపడిన సంగతి తెలిసిందే.. సింధు కేవలం 28 నిమిషాల్లో మ్యాచ్ ముగించింది. పీవీ సింధు 21-7, 21-10తో వరుస సెట్లలో సునాయాసంగా గెలిచి తన సత్తా చాటింది. ఒలంపిక్స్ లో ఎలాంటి సంచనాలైనా నమోదు చేసే సత్తా క్రీడాకారులకు ఉందని పలు సందర్భాల్లో రుజువయ్యాయి. ఈ నేపథ్యంలో పీవీ సింధు క్రీడాకారుల ఉందని.. ర్యాంకులతో సంబంధం లేకుండా ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకుండా తనదైన శైలిలో దూకుడుగా ఆడాలని.. అలవోకగా విజయం సొంతం చేసుకోవాలని క్రీడా అభిమానులు కోరుతున్నారు. 2016 లో జరిగిన రియో ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించి ఒలింపిక్ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింన తెలుగు తేజం సింధు ఈసారి పసిడి ని భారత్ కు తీసుకుని రావాలని సింధుకు బెస్ట్ విషెష్ చెబుతున్నారు.

Also Read:

Tokyo Olympics 2021:ఒలంపిక్స్‌లో మరో విజయాన్ని సొంతం చేసుకున్న పీవీ సింధు.. గ్రూప్ జే నుంచి ప్రీ క్వార్ట్రర్స్‌లోకి ఎంట్రీ

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?