Tokyo Olympics 2020: రవి దహియా, పురుషుల హాకీ జట్టు పతకాల పోరు! భారత అథ్లెట్ల పూర్తి షెడ్యూల్
టోక్యో ఒలింపిక్స్‌లో రవి దహియా ఫైనల్‌కు చేరుకోవడంతో దేశానికి మరో పతకం ఖాయం చేశాడు. ఈ రోజు బంగారం లేదా వెండి పతకాన్ని తెస్తాడా అనేది చూడాలి.
టోక్యో ఒలింపిక్స్ -2020 లో భారత్‌కు గురువారం చాలా ముఖ్యమైనది. ఈ రోజున కొన్ని పతకాలు భారతదేశానికి అందే అవకాశం ఉంది. కాంస్య పతక పోరులో భారత పురుషుల హాకీ జట్టు జర్మనీతో తలపడుతుంది. రెజ్లింగ్‌లో రవి దహియా తన చివరి మ్యాచ్‌ని నేడు ఆడనున్నాడు. అలాగే దీపక్ పూనియా, మహిళా రెజ్లర్ అన్షు మాలిక్ రీపేజ్ ద్వారా దేశానికి పతకం అందించే ఛాన్స్ ఉంది. పతక ఆశావహులలో ఒకరైన వినేష్ ఫోగట్ కూడా ఈరోజు తన పోరును ఆరంభించనున్నారు. రవి ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. కానీ, అతను బంగారు పతకాన్ని గెలుచుకోగలడా లేదా అనేది నేడు తేలనుంది.
హాకీ, రెజ్లింగ్ కాకుండా, అథ్లెటిక్స్, గోల్ఫ్‌లో భారతదేశం ఈ రోజు తన పోటీని ప్రదర్శిస్తుంది. అదితి అశోక్ మహిళల గోల్ఫ్‌లో గొప్ప ఆరంభాన్ని సాధించింది. మరోవైపు, దీక్షా దాగర్ తన ఆటను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తుంది. అథ్లెటిక్స్‌లో కెటి ఇర్ఫాన్ ట్రాక్‌లోకి వెళ్లనున్నాడు. ఈ రోజు టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల షెడ్యూల్ ఎలా ఉందో చూద్దాం.
గురువారం టోక్యో ఒలింపిక్స్‌లో భారత షెడ్యూల్ ఇలా ఉంది అథ్లెటిక్స్ పోటీలు: మధ్యాహ్నం 1 గంట నుంచి: కెటి ఇర్ఫాన్, రాహుల్ రోహిల్లా, సందీప్ కుమార్ – పురుషుల 20 కిమీ నడక
గోల్ఫ్: సాయంత్రం 4 గంటలకు: అదితి అశోక్ – దీక్షా దగర్, మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే
హాకీ: ఉదయం 7 గంటలకు: ఇండియా వర్సెస్ జర్మనీ, పురుషుల కాంస్య పతక మ్యాచ్
రెజ్లింగ్: ఉదయం 8 గంటలకు: మహిళల ఫ్రీస్టైల్ 53కేజీలో వినేష్ ఫోగట్ వర్సెస్ సోఫియా మాగ్డలీనా మాట్సన్ (స్వీడన్) ఉదయం 7:30గంటలకు: మహిళల ఫ్రీస్టైల్ 57 కిలోల రీపేజ్ రౌండ్‌లో అన్షు మాలిక్ వర్సెస్ వలేరియా కొబ్లోవా (రష్యా) మధ్యాహ్నం 2:45: పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల ఫైనల్లో రవి దహియా వర్సెస్ జవూర్ యుగుయేవ్ (రష్యా) మధ్యాహ్నం 2:45 గంటలకు: పురుషుల ఫ్రీస్టైల్ కాంస్య పతకం మ్యాచ్‌లో దీపక్ పూనియా
Also Read: MS Dhoni: ఫుట్‌బాల్ ఆడిన ధోని.. బాంద్రా ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో సినీ తారలతో సందడి.. వీడియో
Tokyo Olympics: సెమీ ఫైనల్‌లో ఓడిన భారత మహిళల హాకీ జట్టు.. 1-2 తేడాతో ఓటమి