Swapnil Kusale: ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. షూటింగ్‌లో కాంస్యాన్ని ముద్దాడిన స్వప్నిల్

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మూడో పతకం లభించింది. గురువారం (ఆగస్టు 01) జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3వ రౌండ్‌లో స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు . 8 మందితో జరిగిన ఫైనల్ రౌండ్‌లో భారత షూటర్ మొత్తం 451.4 పాయింట్లు సాధించి మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు

Swapnil Kusale: ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. షూటింగ్‌లో కాంస్యాన్ని ముద్దాడిన స్వప్నిల్
Swapnil Kusale
Follow us

|

Updated on: Aug 01, 2024 | 2:26 PM

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మూడో పతకం లభించింది. గురువారం (ఆగస్టు 01) జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3వ రౌండ్‌లో స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు . 8 మందితో జరిగిన ఫైనల్ రౌండ్‌లో భారత షూటర్ మొత్తం 451.4 పాయింట్లు సాధించి మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తద్వారా ఈ ఒలింపిక్స్ లో భారత్‌కు మూడో కాంస్య పతకాన్ని సాధించిపెట్టాడు. చైనాకు చెందిన లియు యుకున్ 463.6 పాయింట్లతో బంగారు పతకాన్ని గెలుచుకోగా, ఉక్రెయిన్‌కు చెందిన సెర్హి కులిష్ 461.3 పాయింట్లతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ ఈవెంట్ లో 7వ స్థానంతో ఫైనల్స్‌లోకి ప్రవేశించిన స్వప్నిల్ కుసాలే చివరి రౌండ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. చెక్ రిపబ్లిక్ షూటర్ జిరి ప్రెవ్రత్ స్కీ (440.7 పాయింట్లు)ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకున్నాడు. భారత షూటర్ మొత్తం 451.4 పాయింట్లు సేకరించి తన తొలి ఒలింపిక్స్ పతకాన్ని సాధించగలిగాడు.

దీంతో పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య మూడుకు చేరింది. అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మహిళా షూటర్ మను భాకర్ భారత్‌కు తొలి కాంస్య పతకాన్ని అందించింది. ఆ తర్వాత మిక్స్‌డ్‌ 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో సరబ్‌జోత్‌ సింగ్‌తో కలిసి మను భాకర్‌ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు 50 మీటర్ల రైఫిల్ 3 రౌండ్ ఈవెంట్‌లో షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.

ఇవి కూడా చదవండి

గురి తప్పలేదు..

గతంలో స్వప్నిల్ విజయాలు..

  •  ప్రపంచ ఛాంపియన్‌షిప్స్, కైరో (2022) – 4వ స్థానం.
  • ఆసియా క్రీడలు (2022) – బంగారు పతకం
  • ప్రపంచ కప్, బాకు (2023) – మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో బంగారు పతకం
  • ప్రపంచ కప్, బాకు (2023) వ్యక్తిగత, టీమ్ ఈవెంట్‌లలో రెండు రజత పతకాలు.
  • ప్రపంచ ఛాంపియన్‌షిప్స్, కైరో (2022) – జట్టు పోటీల్లో కాంస్య పతకం.
  • ప్రపంచ కప్, న్యూఢిల్లీ (2021) – టీమ్ ఈవెంట్‌లో బంగారు పతకం.

మరిన్న క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

'కేవీల్లో ప్రవేశాలకు ఎంపీ కోటా పునరుద్ధరణ యోచన లేదు'
'కేవీల్లో ప్రవేశాలకు ఎంపీ కోటా పునరుద్ధరణ యోచన లేదు'
'నేనైతే ఆ షాట్ తప్పనే వాడిని'.. ఆనంద్ మహీంద్రా ఫన్నీ ట్వీట్
'నేనైతే ఆ షాట్ తప్పనే వాడిని'.. ఆనంద్ మహీంద్రా ఫన్నీ ట్వీట్
ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. కాంస్యాన్ని ముద్దాడిన స్వప్నిల్
ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. కాంస్యాన్ని ముద్దాడిన స్వప్నిల్
సంతోషంగా జీవించాలంటే ఈ చిట్కాలు పాటించండి..
సంతోషంగా జీవించాలంటే ఈ చిట్కాలు పాటించండి..
ఐబీపీఎస్‌ PO, SO పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
ఐబీపీఎస్‌ PO, SO పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
సోయా బీన్స్‌ తింటే.. ఇన్ని సమస్యలకు దూరంగా ఉండొచ్చు..
సోయా బీన్స్‌ తింటే.. ఇన్ని సమస్యలకు దూరంగా ఉండొచ్చు..
ఈ స్మార్ట్‌ఫోన్‌ మహిళలకు ప్రత్యేకం.. హెచ్‌ఎమ్‌డీ నుంచి కొత్త ఫోన్
ఈ స్మార్ట్‌ఫోన్‌ మహిళలకు ప్రత్యేకం.. హెచ్‌ఎమ్‌డీ నుంచి కొత్త ఫోన్
కాస్ట్లీ కారు కొన్న స్టార్ కపుల్.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే
కాస్ట్లీ కారు కొన్న స్టార్ కపుల్.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే
మామిడి నర్సరీలోకి దూరిన దొంగలు ఏమి చేశారో చూడండి
మామిడి నర్సరీలోకి దూరిన దొంగలు ఏమి చేశారో చూడండి
రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం.. తల్లిపేగు తెంచుకొని
రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం.. తల్లిపేగు తెంచుకొని