భార్యలతో వచ్చిందా గొడవ.? కోహ్లీ, రోహిత్ ‘కష్టాలు’!

న్యూఢిల్లీ: ఇటీవల ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌లో ఘోరంగా ఓటమిపాలై.. టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విబేధాలు తలెత్తాయంటూ సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వస్తున్నాయి. ఇక ఈ వార్తలకు బలం చేకూరేలా.. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. తాజాగా కోహ్లీ భార్య అనుష్క శర్మను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశాడు. అంతేకాకుండా దీనిపై విరాట్ కోహ్లీ భార్య అనుష్క […]

  • Updated On - 6:43 pm, Sat, 27 July 19
భార్యలతో వచ్చిందా గొడవ.? కోహ్లీ, రోహిత్ ‘కష్టాలు’!

న్యూఢిల్లీ: ఇటీవల ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌లో ఘోరంగా ఓటమిపాలై.. టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విబేధాలు తలెత్తాయంటూ సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వస్తున్నాయి.

ఇక ఈ వార్తలకు బలం చేకూరేలా.. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. తాజాగా కోహ్లీ భార్య అనుష్క శర్మను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశాడు. అంతేకాకుండా దీనిపై విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ స్పందిస్తూ ‘తప్పుడు వార్తల ప్రచార నేపథ్యంలో నిజం మాత్రమే నిశబ్దంతో కరచాలనం చేస్తుంది’ అని పేర్కొంటూ ఓ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఇంతటితో అంతా సద్దుమణిగిందని అనుకుంటే..

అనుష్క శర్మ ఈ వివాదంపై స్పందిస్తూ ఇన్‌స్టా‌లో స్టోరీ పోస్ట్ చేసిన తర్వాత నుంచి రోహిత్ శర్మ, అతని భార్య రితికను అన్‌ఫాలో చేయడం జరిగింది. అయితే విరాట్ కోహ్లీ మాత్రం రోహిత్ భార్య రితికను ట్విట్టర్‌లో ఫాలో అవుతూ ఉండడం విశేషం. ఏది ఏమైనా జరుగుతున్న పరిణామాల బట్టి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య నిజంగా విబేధాలు తలెత్తాయి అని అభిమానుల్లో ప్రశ్న మెదులుతోంది. అంతేకాకుండా జట్టులోని ఆటగాళ్లు రెండు భాగాలుగా విడిపోయారని ఇన్‌సైడ్ టాక్ కూడా ఉంది.

తాజా సమాచారం ప్రకారం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు విడివిడిగా లాబీస్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అటు వన్డే, టీ20లకు రోహిత్ శర్మకు సారధ్య బాధ్యతలు అప్పగించడం ఇష్టం లేకే.. విరాట్ కోహ్లీ విండీస్ టూర్‌కు సిద్ధమైయ్యాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా ఈ వివాదంపై మాత్రం రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లీ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.