టీమిండియాకు రవిశాస్త్రినే దిక్కు.. ఒక్కరిపై వేటు మాత్రం తప్పదు!

ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమి అనంతరం.. జట్టులో మార్పులు చేయడానికి బీసీసీఐ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హెడ్ కోచ్‌తో సహా మిగిలిన అన్ని పోస్టులకు ఈనెల 31 వరకు దరఖాస్తులను ఆహ్వానించింది. జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం హేమాహేమీలు సైతం దరఖాస్తు చేసుకున్న సంగతి కూడా తెలిసిందే. ఇది ఇలా ఉండగా బీసీసీఐ.. టీమిండియా హెడ్ కోచ్‌గా మరోసారి రవిశాస్త్రిని కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రవిశాస్త్రి పర్యవేక్షణలో భారత్ జట్టు అనేక విజయాలు […]

  • Updated On - 7:36 pm, Sat, 27 July 19
టీమిండియాకు రవిశాస్త్రినే దిక్కు.. ఒక్కరిపై వేటు మాత్రం తప్పదు!

ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమి అనంతరం.. జట్టులో మార్పులు చేయడానికి బీసీసీఐ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హెడ్ కోచ్‌తో సహా మిగిలిన అన్ని పోస్టులకు ఈనెల 31 వరకు దరఖాస్తులను ఆహ్వానించింది. జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం హేమాహేమీలు సైతం దరఖాస్తు చేసుకున్న సంగతి కూడా తెలిసిందే. ఇది ఇలా ఉండగా బీసీసీఐ.. టీమిండియా హెడ్ కోచ్‌గా మరోసారి రవిశాస్త్రిని కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రవిశాస్త్రి పర్యవేక్షణలో భారత్ జట్టు అనేక విజయాలు సాధించిందని భావిస్తున్న క్రికెట్‌ సలహా కమిటీ(సీఏసీ).. ఆయననే కోచ్‌గా కొనసాగించాలని ప్రాధమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సీఏసీలో సభ్యుడైన అన్షుమన్ గైక్వాడ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. భారత్ జట్టు అద్భుతమైన విజయాలు సాధించడంలో రవిశాస్త్రి కృషి అమోఘమని ఆయన ప్రశంసించాడు.

‘అనిల్ కుంబ్లే తర్వాత రవిశాస్త్రి హెడ్ కోచ్ బాధ్యతలు తీసుకున్న అనంతరం.. భారత్ జట్టు అద్భుతమైన విజయాలు సాధించింది. ఇది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం. కెప్టెన్ విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి మధ్య బంధం కూడా స్ట్రాంగ్‌గా ఉందని’  గ్వైక్వాడ్‌ పేర్కొన్నాడు. ఒకవేళ కోచ్‌ను మార్చినట్లైతే.. అది కాస్తా జట్టు విజయాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అనధికారిక వార్తలు వస్తున్నాయి. ఇకపోతే మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ ఆధ్వర్యంలోని క్రికెట్‌ సలహా కమిటీ.. టీమిండియా ప్రధాన కోచ్‌తో పాటు సపోర్టింగ్‌ స్టాఫ్‌లను ఎంపిక చేయనుంది. ఈ కమిటీలో కపిల్‌, అన్షుమన్ గైక్వాడ్‌, మహిళా జట్టు మాజీ కెప్టెన్‌  శాంతా రంగస్వామి సభ్యులుగా ఉన్నారు. అటు బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌పై వేటు తప్పదని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.