AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: మ్యాచ్ ఓడినా.. డ్రెస్సింగ్ రూమ్ లో టీమిండియా సెలబ్రేషన్స్.. ఎందుకంటే

దక్షిణాఫ్రికాతో అక్టోబర్ 4వ తేదీ మంగళవారం జరిగిన మూడో టీ 20 మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. ముఖ్యంగా టీమిండియా బౌలర్లు అధిక పరుగులు సమర్పించుకోవడంతో పాటు టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ విఫలమవడంతో భారత్ మ్యాచ్ లో ఓటమి చవిచూడాల్సి..

Cricket: మ్యాచ్ ఓడినా.. డ్రెస్సింగ్ రూమ్ లో టీమిండియా సెలబ్రేషన్స్.. ఎందుకంటే
Rishab Pant
Amarnadh Daneti
|

Updated on: Oct 05, 2022 | 10:17 PM

Share

దక్షిణాఫ్రికాతో అక్టోబర్ 4వ తేదీ మంగళవారం జరిగిన మూడో టీ 20 మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. ముఖ్యంగా టీమిండియా బౌలర్లు అధిక పరుగులు సమర్పించుకోవడంతో పాటు టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ విఫలమవడంతో భారత్ మ్యాచ్ లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయినా సరే మ్యాచ్ అయిపోయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో మాత్రం సెలబ్రేషన్స్ చేసుకున్నారు టీమిండియా ఆటగాళ్లు. ఓడిపోయినా సెలబ్రేషన్స్ ఏమిటనుకుంటున్నారా.. దీనికి ఒక కారణం ఉంది. అదే రిషబ్ పంత్ పుట్టినరోజు. మ్యాచ్ పూర్తయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో రిషబ్ పంత్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలను ట్విట్టర్ లో పంచుకున్నాడు రిషబ్ పంత్. ఈ ఫోటోల్లో రిషబ్ పంత్ ముఖం మొత్తం కేక్ క్రీమ్ తో నిండిపోయింది. మ్యాచ్ ఓడిపోయినప్పటికి ఓడిపోయామనే మూడ్ లో లేకుండా పంత్ బర్త్ డే సెలబ్రేషన్స్ తో హ్యాపీ మూడ్ లోకి వెళ్లిపోయారు టీమిండియా ఆటగాళ్లు. పంత్ పుట్టినరోజు వేడుకలతో ఓటమిని మర్చిపోయి.. సిరీస్ గెలిచామనే ఆనందం ఆటగాళ్లంతా సందడి చేశారు.

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో మూడు మ్యాచుల్లోనూ రిషబ్ పంత్ ప్లేయింగ్ లెవన్ లో ఉన్నాడు. అయితే చివరి మ్యాచ్ లో మాత్రమే అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది. అయితే ఈమ్యాచ్ లో ఎక్కువ పరుగులు చేయలేదు. అయినాసరే తన బర్త్ డే వేడుకలను సహచర ఆటగాళ్లు గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ట్విట్టర్ లో పంత్ పోస్టు చేసిన ఫోటోలు చూస్తే టీమిండియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ లో పుట్టినరోజు వేడుకలను ఎలా జరుపుకున్నారో తెలుస్తుంది. ఈ ఫోటోలు చూస్తే మాత్రం పంత్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఎంత ఆనందంగా చేసుకున్నాడో అర్థమవుతుంది. అలాగే తన ఫోటోలను షేర్ చేస్తూ తన పుట్టినరోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి సమయం వెచ్చించిన మిత్రులు, సహాచరులందరికి కృతజ్ఞతలు తెలిపాడు.

నిన్నటి రోజు చాలా గొప్పది.. మీ అభిమానానికి తాను కృతజ్ఞతుడనంటూ ట్వీట్ చేశాడు రిషబ్ పంత్. టీ20 ప్రపంచకప్ కు ప్రకటించిన భారత జట్టులో రిషబ్ పంత్ స్థానం సంపాదించాడు. అయితే ప్లేయింగ్ లెవన్ లో అతడికి అవకాశం లభిస్తుందా అనేది మాత్రం అనుమానమే. వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ అయిన రిషబ్ పంత్ తో పాటు, దినేష్ కార్తీక్ కూడా బ్యాట్స్ మెన్, వికెట్ కీపర్.. ఇటీవల కాలంలో దినేష్ కార్తీక్ ఆఖరి ఓవర్లలో మంచి ఫినిషింగ్ ఇవ్వగలుగుతున్నాడు. దీంతో దినేష్ కార్తీక్ కు జట్టులో స్థానం లభిస్తే పంత్ కు అవకాశం ఉండకపోవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..