T20 World Cup 2022: టీ20 ప్రపంచ కప్ ఐసీసీ కామెంటరీ ప్యానెల్ లో హై- ప్రొఫైల్ నేమ్స్ వీరివే.. ఒక ఇండియన్ కూడా..
టీ20 ప్రపంచకప్ కోలహాలం మొదలైంది. అక్టోబర్ 16 ఆదివారం నుంచి గ్రూప్ మ్యాచ్ లు ప్రారంభం అయ్యాయి. శ్రీలంక, నమిబీయా మొదటి మ్యాచ్ లో తలపడగా.. పసికూన నమిబీయా శ్రీలంకను ఓడించి సంచలనం సృష్టించింది. అయితే ఈ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు..
టీ20 ప్రపంచకప్ కోలహాలం మొదలైంది. అక్టోబర్ 16 ఆదివారం నుంచి గ్రూప్ మ్యాచ్ లు ప్రారంభం అయ్యాయి. శ్రీలంక, నమిబీయా మొదటి మ్యాచ్ లో తలపడగా.. పసికూన నమిబీయా శ్రీలంకను ఓడించి సంచలనం సృష్టించింది. అయితే ఈ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు, టోర్నమెంట్ కోసం ఇంటెన్సివ్ కవరేజ్‌లో భాగంగా టీ20 ప్రపంచకప్ మ్యాచ్ లలో వ్యాఖ్యాతల పూర్తి జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ – ఐసీసీ విడుదల చేసింది. అపెక్స్ క్రికెట్ బాడీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఒక పోస్ట్‌లో వ్యాఖ్యాతల జాబితాను విడుదల చేస్తూ.. సరదాగా ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో మెల్ జోన్స్ మాట్లాడుతూ ప్రారంభమయ్యే వీడియోను విడుదల చేసింది. వీడియో ప్రారంభమవుతుంది కామెంటేటర్ ల జాబితాలో రవిశాస్త్రి , ఇయాన్ బిషప్, మైఖేల్ అథర్టన్ , డానీ మోరిసన్, షేన్ వాట్సన్ , మైఖేల్ క్లార్క్ , డిర్క్ నాన్స్ , హర్షా భోగ్లే, రస్సెల్ ఆర్నాల్డ్ వంటి వారు ఉన్నారు.
ఇసా గుహా, కార్లోస్ బ్రాత్‌వైట్ , శామ్యూల్ బద్రీ , డేల్ స్టెయిన్ , షాన్ పొలాక్ , సునీల్ గవాస్కర్ , సైమన్ డౌల్, నాసర్ హుస్సేన్, ఇయాన్ మోర్గాన్ పేర్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ జట్టుకు తన నేతృత్వంలో ఐసిసి ప్రపంచ కప్ అందించి అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత ఇయాన్ మోర్గాన్ ఐసిసి టివి కామెంటరీగా అరంగేట్రం చేయనున్నారు.
ఐసీసీ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో మోర్గాన్ మాట్లాడుతూ.. క్రికెట్ యొక్క అత్యంత ఉత్తేజకరమైన టోర్నమెంట్‌లలో టీ20 వరల్డ్ కప్ ఒకటని, ఆటగాళ్ళు తమ సత్తా చూపించడానికి ఇష్టపడతారని అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న టీ20 ఫార్మాట్‌లో కొత్త నైపుణ్యాలను జోడించే జట్ల మధ్య పోటీకి ఈ ప్రపంచ కప్ తోడ్పడుతుందన్నారు. వ్యాఖ్యాతగా తన కొత్త పాత్ర పోషించబోతున్నట్లు తెలిపాడు.
What an elite commentary line-up for #T20WorldCup 2022 ?
Details ? https://t.co/sCOReFrnTH pic.twitter.com/CuTJlwBeOk
— ICC (@ICC) October 16, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..