AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: బలహీనమైన బౌలింగ్ యూనిట్‌తో టీమిండియా.. రూట్ మార్చితేనే ఫలితమంటోన్న మాజీలు..

Team India T20 World Cup 2022: టీ20 ప్రపంచ కప్ 2022 కోసం టీం ఇండియా సిద్ధంగా ఉంది. అయితే ప్రధాన బౌలర్లు గాయం కారణంగా దూరంగా ఉండడంతో, విజయాలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉందని..

T20 World Cup: బలహీనమైన బౌలింగ్ యూనిట్‌తో టీమిండియా.. రూట్ మార్చితేనే ఫలితమంటోన్న మాజీలు..
Team India
Venkata Chari
|

Updated on: Oct 16, 2022 | 3:37 PM

Share

భారత్ టీ20 ప్రపంచకప్ 2022 సిద్ధంగా ఉంది. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (వెన్ను గాయం), దీపక్ చాహర్ (తుంటి సమస్య), ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (మోకాలి శస్త్రచికిత్స)లాంటి స్టార్లు ఈ టోర్నమెంట్‌కు దూరమయ్యారు. టీమిండియా ఆటగాళ్లు గాయాలతో ప్రతిష్టాత్మక ట్రోర్నీకి దూరమవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. కాగా, ప్రస్తుతం వీరు లేకుండానే టీమిండియా బరిలోకి దిగనుంది. మరి కీలకమైన బౌలింగ్ విభాగంలో సూపర్ స్టార్స్ లేకుండా బరిలోకి దిగనుండడంతో.. టీమిండియా విజయాలపై దెబ్బపడే ఛాన్స్ ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ముంబై ఇండియన్స్‌కు టీ20, వన్డే, టెస్టు లేదా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కెప్టెన్‌కు ఇష్టమైన ఆటగాడిగా బుమ్రా ఉన్న సంగతి తెలిసిందే. బుమ్రా ప్రాముఖ్యతను తక్కువ అంచనా వేయలేం. బుమ్రా లేకుండానే టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అడుగుపెట్టనుంది. గాయపడిన జస్ప్రీత్ బుమ్రా లేకుండా ఈ పోరు భారత్‌కు సవాలుగా మారవచ్చు. టీ20 ప్రపంచకప్‌కు సన్నాహాల్లో భారత్ చివరి దశలో ఉన్న సమయంలో బుమ్రా గాయం కారణంగా సెలక్టర్లకు చాలా తక్కువ సమయం మిగిలిపోయింది.

ఇవి కూడా చదవండి

బుమ్రాకు బదులుగా జట్టులోకి వచ్చిన అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి తన ఆటతీరు కనబర్చేందుకు గొప్ప అవకాశం లభించింది. అదే సమయంలో భారత టాప్ ఆల్‌రౌండర్‌లలో ఒకరైన రవీంద్ర జడేజా కూడా మోకాలి గాయం కారణంగా దూరమయ్యాడు. ఇద్దరు కీలక ఆటగాళ్లు లేకపోవడం భారత బౌలింగ్ విభాగాన్ని కుంగదీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ ప్రపంచంలోని అత్యుత్తమ T20 బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా అవతరించడం కొంతవరకు దృష్టిని మరల్చింది.

15 మంది సభ్యులతో కూడిన జట్టులో బుమ్రా స్థానంలో రిజర్వ్, ఫ్రంట్ రన్నర్‌గా ఉన్న దీపక్ చాహర్ ఇటీవల గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే బుమ్రా గైర్హాజరీ కారణంగా భారత్ రెండో టీ20 ప్రపంచకప్‌ను క్లెయిమ్ చేసే అవకాశాలు కోల్పోయినట్లు వాట్సన్ అభిప్రాయపడ్డాడు.

మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో తన ఫామ్‌ను తిరిగి పొందడంతో కొంతమేర కలిసొచ్చే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌పై సెంచరీ చేయడంతోపాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన T20 సిరీస్‌లలో అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. దీంతో భారత్ తన వ్యూహాలను మార్చుకోవాలని, బలహీనమైన బౌలింగ్ యూనిత్‌పై ఆధారపడుకుండా బ్యాటింగ్‌పై ఎక్కువగా ఫోకస్ చేయాలని మాజీలు సూచిస్తున్నారు. బ్యాటింగ్ యూనిట్ బాగా రాణిస్తే, ఎంతటి భారీ స్కోరైనా ఈజీగా మారిపోద్దని వారు అంటున్నారు.

ఇక డెత్ ఓవర్లలో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ విమర్శలకు గురవుతోంది. ముగ్గురు స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్‌లను తీసుకోవడంలోని లాజిక్‌ను నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మరి టీమిండియా ఎలాంటి వ్యూహంతో కదన రంగంలోకి దిగనుందో చూడాలి.

టీ20 ప్రపంచకప్ 2022లో పాల్గొనే భారత జట్టు:

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్.

స్టాండ్‌బై ఆటగాళ్లు: మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్.