T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో రిజర్వ్ డే ను ఏ సందర్భంలో ఉపయోగిస్తారో తెలుసా.. నిబంధనలు ఇవే..
టీ20 ప్రపంచకప్ 2022 కోసం రిజర్వ్ డే లను ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది.అయితే అవి సెమీ-ఫైనల్, ఫైనల్స్ మ్యాచుల్లో మాత్రమే ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి. ఇరు జట్ల మధ్య కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ కూడా జరగనప్పుడు మాత్రమే రిజర్వ్ డే నిబంధన..
టీ20 ప్రపంచకప్ 2022 కోసం రిజర్వ్ డే లను ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది.అయితే అవి సెమీ-ఫైనల్, ఫైనల్స్ మ్యాచుల్లో మాత్రమే ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి. ఇరు జట్ల మధ్య కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ కూడా జరగనప్పుడు మాత్రమే రిజర్వ్ డే నిబంధన అమలవుతుంది. రిజర్వుడే అంటే ఏదైనా మ్యాచ్ అనివార్య కారణాల వల్ల జరగాల్సిన రోజు కాకపోతే దానిని పూర్తిగా రద్దు చేయకుండా వేరే రోజు ఆ మ్యాచ్ నిర్వహించడానికి రిజర్వు డేను ఉపయోగిస్తారు. అక్టోబర్ 22వ తేదీ నుంచి సూపర్ 12 మ్యాచ్ లు ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 16వ తేదీ నుంచి గ్రూప్ మ్యాచ్ లు ప్రారంభంమయ్యాయి. ఇప్పటికే మొత్తం టోర్నమెంట్ షెడ్యూల్ చేయబడింది. వెన్యూలతో పాటు మ్యాచ్ నిర్వహించే సమయం డిసైడ్ చేయబడింది. ఇదే సమయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో ‘రిజర్వ్ డే’ని చేర్చింది.సెమీ ఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్ సమయంలో నిర్ణీత రోజులలో మ్యాచ్ జరగని సందర్భంలో, రిజర్వ్ డేలు అమలులోకి వస్తాయి.
ఐసిసి పలు టోర్నమెంట్ లకు సంబంధించి రిజర్వు డేను కేటాయిస్తుంది. రిజర్వు డేను కేటాయించడం ఇది మొదటిసారి కాదు.2019 వన్డే ప్రపంచ కప్‌లో, భారత్, న్యూజిలాండ్ మధ్య సెమీ-ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డేలో జరిగింది. మ్యాచ్ జరగాల్సిన తేదీన మాంచెస్టర్‌లో వర్షం కురవడంతో మ్యాచ్‌ను రిజర్వ్ డే రోజు నిర్వహించారు.
మేఘావృతమైన పరిస్థితులలో న్యూజిలాండ్ బౌలర్ల అధిపత్యంలో భారత్ డీలా పడి.. మ్యాచ్ గెలవలేకపోయింది. అప్పటివరకు ఆ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని భారత్.. సెమీ ఫైనల్స్ మ్యాచ్ లో ఓటమి చవిచూసింది. టీ20 ప్రపంచకప్ కు సంబంధించి రెండు సెమీఫైనల్స్ మ్యాచ్ లు నవంబర్ 9, 10వ తేదీల్లో జరగనున్నాయి. నవంబర్ 13న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..