PV Sindhu: ‘సైయ్యా.. సై..సై’.. యమగుచితో పీవీ సింధు హైవోల్టేజ్‌ ఫైట్‌.. ఇద్దరి ట్రాక్ రికార్డ్ ఇలా ఉంది

షార్ప్‌ కట్స్‌.. అక్యూరసీ షాట్స్‌.. బుల్లెట్‌లా దూసుకెళ్లే స్మాష్‌లు.. ఎదురులేని స్ట్రోక్‌లు.. ఇలా షటిల్‌పై సంపూర్ణ నియంత్రణ. మొత్తంగా ఆల్‌రౌండ్‌ విన్యాసం...

PV Sindhu: 'సైయ్యా.. సై..సై'.. యమగుచితో పీవీ సింధు హైవోల్టేజ్‌ ఫైట్‌.. ఇద్దరి ట్రాక్ రికార్డ్ ఇలా ఉంది
Pv Sindhu Vs Akane Yamaguch
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 30, 2021 | 1:41 PM

షార్ప్‌ కట్స్‌.. అక్యూరసీ షాట్స్‌.. బుల్లెట్‌లా దూసుకెళ్లే స్మాష్‌లు.. ఎదురులేని స్ట్రోక్‌లు.. ఇలా షటిల్‌పై సంపూర్ణ నియంత్రణ. మొత్తంగా ఆల్‌రౌండ్‌ విన్యాసం సింధూది. అదే ఇప్పుడు.. సింధూకి కలిసొచ్చే బలం. స్వర్ణ ఆశలు మోస్తున్న పీవీ సింధు ఇప్పటికే క్వార్టర్స్‌కు చేరింది. ఇక భారత్‌కు పథకం అందించేందుకు ఒకే అడుగు మిగిలింది. ఎందుకంటే.. భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు మొదటి నుంచి జోరు కొనసాగిస్తోంది. డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్ట్‌ను 21-15, 21-13 తేడాతో ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ధాటిగా ఆడిన సింధు ఈ మ్యాచ్‌ను 41 నిమిషాల్లోనే ముగించింది. తొలి గేమ్‌లో కాస్త తడబడి ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇచ్చింది. కానీ లోపాలను సరిదిద్దుకుంటూ రెండో గేమ్‌ ఆరంభంలోనే 5-0తో దూసుకెళ్లింది. అదే జోరును కొనసాగిస్తూ మ్యాచ్‌ను ముగించింది.

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకమే టార్గెట్‌గా బరిలోకి దిగిన పీవీ సింధు మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. గ్రూఫ్‌- జెలో భాగంగా హాంకాంగ్‌కు చెందిన చియాంగ్ ఎంగన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 21-9, 21-16తో వరుస గేముల్లో గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకుంది. తొలి గేమ్‌ను 15 నిమిషాల్లోనే సునాయాసంగా సొంతం చేసుకున్న సింధుకు.. రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఒక దశలో పీవీ సింధు 6-11తో వెనుకబడడంతో టై ‍బ్రేక్‌ దారి తీసి మూడో రౌండ్‌ ఆడాల్సి వస్తుందని అంతా భావించారు. కానీ సింధు తన ప్రత్యర్థికి అవకాశమివ్వకుండా దెబ్బకొడుతూ వ‌రుస‌గా పాయింట్లు సాధించింది. సింధు తొలి మ్యాచ్‌లోనూ గెలిచిన విష‌యం తెలిసిందే. దీంతో గ్రూప్-జే టాప‌ర్‌గా సింధు ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.

దీంతో బ్యాడ్మింటన్‌లో హైవోల్టేజ్‌ ఫైట్‌ జరుగబోతోంది. నేటి మధ్యాహ్నం జరిగే మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ఐదో ర్యాంకర్‌ జపాన్‌ క్రీడాకారిణి అకానె యమగుచితో.. 7వ ర్యాంకర్‌ పీవీ సింధు తలపడనుంది. గతంలో వీరిద్దరూ 18 సార్లు పోటీపడగా 11-7తో సింధుదే పైచేయి. సింధు, అకానెలిద్దరూ కసిగా తలపడేవారు కావడంతో.. నరాలు తెగే ఉత్కంఠ నెలకొనడం ఖాయం. చివరి సారిగా వీరిద్దరు.. ఈ ఏడాది ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌ క్వార్టర్స్‌లో తలపడ్డారు. 76 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధుదే పైచేయి అయింది.

ఇప్పుడు మాత్రం.. యమగుచి వెన్ను గాయం తర్వాత మునుపటి వేగం తన ఆటలో లోపించిందని స్వయంగా ఆమే ప్రకటించింది. ఇక సొంత గడ్డపై జరుగుతున్న ఒలింపిక్స్‌లో తీవ్రమైన ఒత్తిడి యమగూచికి అదనపు భారం కావడం ఖాయం. ఇప్పటికే ఇద్దరు జాపన్‌ క్రీడాకారులు ఒత్తిడితోనే ఔట్‌ అయ్యారు. మరోవైపు పొడగరి అయిన సింధు.. కచ్చితమైన క్రాస్‌ కోర్టు షాట్‌లు, అటాకింగ్‌ గేమ్‌తో ప్రత్యర్థులపై ఆధిపత్యాన్ని చెలాయిస్తుంటుంది. కానీ, డిఫెన్స్‌లో భారత షట్లర్‌ బలహీనత బహిర్గతమవుతుంది. అయితే, తీవ్ర సాధన, సరికొత్త టెక్నిక్‌లతో లోపాలను సరిదిద్దుకున్నానని చెబుతున్న సింధు.. విజయంపై ధీమాగా ఉంది. ఏదిఏమైనా ఈ మ్యాచ్‌ ఫ్యాన్స్‌కు మంచి మజాను పంచే అవకాశముంది.

Also Read:  ‘దమ్మే కాదు దిమాక్ కూడా ఉండాలి’.. చిరుతతో ‘కోతి కొమ్మచ్చి’ ఆడిన వానరం..

గుంటూరు జిల్లాలో మరణాల వెనుక మిస్టరీ ఏంటి..? చిక్కుముడిగా మారిన ప్రశ్నలు..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!