Covid positive: భారత మాజీ స్ప్రింటర్ మిల్కా సింగ్‌కు కరోనా పాజిటివ్.. ఆస్పత్రిలో చేరిక.. ప్రస్తుతం ఎలా ఉందంటే..
Covid positive: భారత మాజీ అథ్లెట్ మిల్కాసింగ్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేర్పించినట్లు..
Covid positive: భారత మాజీ అథ్లెట్ మిల్కాసింగ్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేర్పించినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 91 ఏళ్ల మిల్కా సింగ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
కాగా, మిల్కాసింగ్ సహాయకులకు కరోనా పాజిటివ్ రావడంతో మిల్కాసింగ్ సహా ఆయన కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. గత బుధవారం నిర్వహించిన కరోనా టెస్ట్‌లో మిల్కా సింగ్‌కు పాజిటివ్ అని తేలింది. దాంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇంట్లోనే ఆక్సీజన్, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అయితే, మిల్కా సింగ్‌కు స్వల్పంగా జ్వరం వస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మొహాలీలోని ఫోర్టిస్ హాస్పిటల్‌లో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఇదిలాఉంటే.. మిల్కా సింగ్ ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సీన్ వేయించుకోలేదని ఆయన భార్య నిర్మల్ కౌర్ తెలిపారు.
Also read:
KL Rahul: నేను వస్తున్నా.. టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన కేఎల్ రాహుల్…