Roger Federer: స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు చేదు అనుభం.. క్వార్టర్ఫైనల్లోనే ఓటమి..
Roger Federer Failed: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం... మాజీ నెంబర్ రోజర్ ఫెదరర్.. ఖతార్ ఓపెన్‌లో చేదు అనుభం ఎదురైంది. ఏడాది తర్వాత కోర్టులోకి ఎంట్రీ..
Roger Federer Withdraws: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం… మాజీ నెంబర్ రోజర్ ఫెదరర్.. ఖతార్ ఓపెన్‌లో చేదు అనుభం ఎదురైంది. ఏడాది తర్వాత కోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన స్విస్ ఆటగాడు.. క్వార్టర్ఫైనల్లోనే ఓటమిని చవి చూశాడు. జార్జియా ప్లేయర్ బసిల్ష్విలి చేతిలో ఓడిపోయాడు.
ఏడాది గ్యాప్ తర్వాత కోట్టులోకి అడుగు పెట్టిన స్విస్ మాస్టర్ రోజర్ ఫెదరర్ ఒక్క విజయంతో సరిపెట్టుకున్నాడు. మోకాలి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఫెదరర్ కు గత 13 నెలల్లో తర్వాత తొలి మ్యాచ్ గెలిచినప్పటికీ.. క్వార్టర్‌ఫైనల్ నుంచే వెనుదిరిగాడు.
క్వార్టర్‌ఫైనల్ నుంచే…
ఖతార్ ఓపెన్లో ఫెదరర్ క్వార్టర్ఫైనల్లోనే నిష్క్రమించాడు. రెండో సీడ్ ఫెదరర్ 6-3, 1-6, 5-7తో బసిల్ష్విలి (జార్జియా) చేతిలో ఓడిపోయాడు. తొలి సెట్ గెలిచి జోరు మీద కనిపించిన ఫెదరర్ .. రెండో సెట్‌ను దారుణంగా ఓడిపోయాడు. పేలవమైన ప్రదర్శనతో కేవలం 1-6తో మ్యాచ్‌ను జారవిడుచుకున్నాడు. మూడో సెట్లో పోరాడినా పదకొండో గేమ్‌లో సర్వీస్ చేజార్చుకుని ఓటమి చవిచూశాడు. ఈ టోర్నీలో ఫెదరర్ ఒకే ఒక్క విజయాన్ని అందుకున్నాడు. తొలి రౌండ్లో అతడికి బై లభించడంతో విజయం లభించింది. తొలి మ్యాచ్‌లో 7-6,3-6,7-5తో డాన్ ఎవాన్స్ (బ్రిటన్)పై విజయంను అందుకున్న సంగతి తెలిసిందే.
దుబాయ్ ఏటీపీ టోర్నీ తప్పుకుంటున్నా…
దుబాయ్ ఏటీపీ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లుగా రోజర్ ఫెదరర్ ప్రకటించాడు. ఖతార్ ఓపెన్లో క్వార్టర్స్‌లోనే ఓటమి పాలైన ఈ స్విస్ దిగ్గజం.. మళ్లీ శిక్షణకు వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు.
ఖతార్ ఓపెన్లో క్వార్టర్ఫైనల్లో ఓటమి పాలైన ఫెదరర్.. ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. మళ్లీ శిక్షణకు వెళ్లడం మంచిదని పేర్కొన్నాడు.