AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boxing Coach Arrest: బాక్సింగ్‌లో శిక్షణ పేరుతో ఆ బాలిక బతుకునే ఆగం చేశాడు.. చివరికి ధైర్యం చేసి చెప్పడంతో..

Boxing Coach Arrest: మహారాష్ట్రలోని ముంబైలో దారుణం వెలుగు చూసింది. తనను నమ్మి శిక్షణ పొందడానికి వచ్చిన మైనర్ బాలికపై..

Boxing Coach Arrest: బాక్సింగ్‌లో శిక్షణ పేరుతో ఆ బాలిక బతుకునే ఆగం చేశాడు.. చివరికి ధైర్యం చేసి చెప్పడంతో..
Arrested
Shiva Prajapati
|

Updated on: Mar 12, 2021 | 8:20 PM

Share

Boxing Coach Arrest: మహారాష్ట్రలోని ముంబైలో దారుణం వెలుగు చూసింది. తనను నమ్మి శిక్షణ పొందడానికి వచ్చిన మైనర్ బాలికపై ఓ కోచ్ అత్యాచారినికి పాల్పడ్డాడు. పైగా విషయం బటయకు చెబితే కెరియర్‌ను నాశనం చేస్తానంటూ హెచ్చరించాడు. దాంతో భయపడిపోయిన బాలిక.. జరిగిని దారుణాన్ని ఎవరికీ చెప్పలేదు. చివరికి అవమాన భారం తట్టుకోలేక జరిగిన దురాగతాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ముంబైలోని తిలక్‌నగర్‌లో అథ్లెటిక్ క్లబ్‌లో బాక్సింగ్ కోచ్‌గా 30 ఏళ్ల వ్యక్తి పని చేస్తున్నాడు. అతని వద్ద బాక్సింగ్ శిక్షణ పొందేందుకు మైనర్ బాలిక చేరింది. అందులోనూ బాలిక కుటుంబ సభ్యులకు, అతనికి మంచి సంబంధాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో అతను తరచుగా వారి ఇంటికి వెళ్లిరావడం, బాలికను శిక్షణ కేంద్రానికి తీసుకెళ్లడం, ఇంటివద్ద డ్రాప్ చేయడం వంటివి చేస్తుండే వాడు. ఈ క్రమంలోనే బాలికపై కన్నేసిన కామాంధుడు, మార్చి 7వ తేదీన అథ్లెటిక్ క్లబ్‌లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం విషయం ఎవరికీ చెప్పొద్దంటూ ఆమె బెదిరించాడు. కాదని ఎవరికైనా చెబితే తన కెరియర్‌ని నాశనం చేస్తానంటూ బెదిరించాడు. దాంతో భయపడిపోయిన బాలిక.. కొద్దిరోజులు అలాగే తనలో తాను కుమిలిపోతూ ఉంది. అయితే, చివరికి ధైర్యం చేసిన జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి వారి సాయంతో తిలక్ నగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు బాక్సర్‌ను అరెస్ట్ చేశారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 376, 376 (3), 506 సహా పలు కేసులు నమోదు చేశారు.

Also read:

Mamata Banerjee: ఆసుపత్రి నుంచి మమతా బెనర్జీ డిశ్చార్జ్.. వారం తర్వాత పరీక్షల కోసం రావాలన్న వైద్యులు

Photo Gallery: సునామి రోజున అదే ఆమె ఆఖరి మెసేజ్.. పదేళ్లగా భార్య కోసం భర్త అంతులేని అన్వేషణ..

Trump Buddha Statues: డ్రాగన్ కంట్రీలో ట్రంప్.. ఎప్పటికీ ట్రంపే. కాకపోతే ఆయన్ను బౌద్ధ సన్యాసిలా కూర్చోబెట్టి మరీ మార్కెట్లో అమ్మేస్తున్నారు