PV Sindhu: ఆట కన్నా జీవితం ముఖ్యం… ఒలింపిక్స్ రద్దు చేయడమే మంచిదన్న సింధు
చిన్నపాటి వైర్‌స్‌తో ప్రపంచం మొత్తం స్తంభించడం విచారకరం. అయితే క్రీడలకన్నా జీవితం ముఖ్యం అని తెలిపింది. ఒలింపిక్స్‌లో కొవిడ్ నిబంధనలను పాటించడం...
వరుసగా టోర్నీలు రద్దవ్వడం బాధకరమే అయినా ప్రస్తుత పరిస్థితుల్లో ఆటల కన్నా జీవితమే ముఖ్యమని భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధు అభిప్రాయపడింది. కోవిడ్ వ్యాప్తితో భారత్, మలేసియా, సింగపూర్‌లో జరగాల్సిన మూడు ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లను ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (BWF) రద్దు చేసింది. జూలై-ఆగస్టులో జరిగే టోక్యో క్రీడలకు ముందు షట్లర్లకు ఈ మూడు కీలకమైన టోర్నీలు. దీనివల్ల ఒలింపిక్స్ సన్నాహకాలకు ఎదురు దెబ్బ తగిలిందా అన్న ప్రశ్నకు స్టార్ షట్లర్ పీవీ సింధు పైవిధంగా స్పందించింది. తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒలింపిక్స్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ఒలింపిక్స్‌లో పోటీపడే షట్లర్లతో కలిసి సింధు ప్రాక్టీస్ చేయడంలేదు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సాధన చేస్తున్న ఆమె.. సుచిత్ర అకాడమీలో శారీర దారుఢ్య శిక్షణ తీసుకుంటోంది. ఇక, ఆట కన్నా జీవితం ముఖ్యమంటున్న సింధు.. కొవిడ్‌తో టోర్నమెంట్లను బీడబ్ల్యూఎఫ్ రద్దు చేయడాన్ని సమర్థించింది.
చిన్నపాటి వైర్‌స్‌తో ప్రపంచం మొత్తం స్తంభించడం విచారకరం. అయితే క్రీడలకన్నా జీవితం ముఖ్యం అని తెలిపింది. ఒలింపిక్స్‌లో కొవిడ్ నిబంధనలను పాటించడం అటు నిర్వాహకులకు ఇటు అథ్లెట్లకు సవాలని చెప్పిన సింధు.. వాటిని ఎలా ఎదుర్కొంటామో చూడాల్సి ఉందన్నది.