Neeraj Chopra: డైమండ్ లీగ్ ఫైనల్లో నీరజ్ చోప్రా.. మరో టైటిల్‌పై కన్నేసిన భారత స్టార్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
Diamond League 2023: ఇంతకుముందు లీగ్ 11వ మీట్ స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరంలో నిర్వహించారు. ఈ లీగ్‌లో నీరజ్ చోప్రా 85.71 మీటర్ల బెస్ట్ స్కోర్‌తో రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత భారత దిగ్గజం ఫైనల్‌కు అర్హత సాధించాడు. డైమండ్ లీగ్ పురుషుల జావెలిన్ త్రో డిఫెండింగ్ ఛాంపియన్‌గా నీరజ్ చోప్రా బరిలోకి దిగనున్నాడు. ఈ భారత ఆటగాడు 2022లో ఈ టైటిల్‌ను గెలుచుకున్నాడు.
Neeraj Chopra, Diamond League 2023 Finals: డైమండ్ లీగ్ 2023 ఫైనల్ సెప్టెంబర్ 16న అర్థరాత్రి నుంచి జరగనుంది. కాగా, భారత అభిమానుల కళ్లన్నీ నీరజ్ చోప్రాపైనే నిలిచాయి. వాస్తవానికి, భారత వెటరన్ నీరజ్ చోప్రా తన టైటిల్‌ను కాపాడుకోవడానికి బరిలోకి దిగనున్నాడు. అదే సమయంలో ఈ టోర్నీ ఫైనల్‌కు అమెరికాలోని యూజీన్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా, నీరజ్ చోప్రా మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 17న తెల్లవారు జామున 1.50 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే, నీరజ్ చోప్రా తన టైటిల్‌ను కాపాడుకోగలడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం నీరజ్ చోప్రా అద్భుతమైన ఫామ్‌తో కొనసాగుతున్నాడు.
అందరి దృష్టి నీరజ్ చోప్రాపైనే..
ఇంతకుముందు లీగ్ 11వ మీట్ స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరంలో నిర్వహించారు. ఈ లీగ్‌లో నీరజ్ చోప్రా 85.71 మీటర్ల బెస్ట్ స్కోర్‌తో రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత భారత దిగ్గజం ఫైనల్‌కు అర్హత సాధించాడు. డైమండ్ లీగ్ పురుషుల జావెలిన్ త్రో డిఫెండింగ్ ఛాంపియన్‌గా నీరజ్ చోప్రా బరిలోకి దిగనున్నాడు. ఈ భారత ఆటగాడు 2022లో ఈ టైటిల్‌ను గెలుచుకున్నాడు.
25 ఏళ్ల చోప్రా గత సంవత్సరం జ్యూరిచ్‌లో డైమండ్ లీగ్ ఛాంపియన్స్ ట్రోఫీని అందుకున్నాడు. ఆగస్టులో బుడాపెస్ట్‌లో తన తొలి ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుని ఈ సీజన్‌లోనే ఆధిపత్యం చెలాయించాడు.
మ్యాచ్‌ల జాబితా..
నీరజ్ చోపా (భారతదేశం)
ఆలివర్ హెలాండర్ (ఫిన్లాండ్)
ఆండ్రియన్ మర్దారే (మోల్డోవా)
అండర్సన్ పీటర్స్ (గ్రెనడా)
కర్టిస్ థాంప్సన్ (USA)
జాకుబ్ వడ్లేజ్ (చెక్ రిపబ్లిక్)
డైమండ్ లీగ్ 2023లో నీరజ్ చోప్రా రికార్డ్..
లీగ్ | ఫలితం | స్థానం | పాయింట్లు |
దోహా డైమండ్ లీగ్ | 88.67 | 1 | 8 |
లాసాన్ డైమండ్ లీగ్ | 87.66 | 1 | 8 |
జ్యూరిచ్ డైమండ్ లీగ్ | 85.71 | 2 | 7 |
ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
Wanda Diamond League Final 2023 💎 pic.twitter.com/CEs2hubFwM
— Neeraj Chopra (@Neeraj_chopra1) September 16, 2023
యూజీన్‌లో నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ ఫైనల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ ఫైనల్ సెప్టెంబర్ 17, 2023న భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 12:50 గంటలకు ప్రారంభమవుతుంది.
భారతదేశంలో టీవీలో నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ ఫైనల్‌ను ఎక్కడ చూడాలి?
నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ ఫైనల్ Viacom18 నెట్‌వర్క్‌లో అందుబాటులో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
భారతదేశంలో నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ ఫైనల్‌ను ప్రత్యక్ష ప్రసారం ఎలా చూడాలి?
నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ ఫైనల్ లైవ్ స్ట్రీమింగ్ JioCinema లో అందుబాటులో ఉంటుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..