AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

French Open 2024: ఫ్రెంచ్ ఓపెన్‌లో భారత ఆటగాళ్ల సత్తా.. రెండో రౌండ్‌కు చేరిన సాత్విక్-చిరాగ్, ట్రీసా-గాయత్రి జోడీ

Satwiksairaj Rankireddy - Chirag Shetty: తమ గత మూడు టోర్నీల్లో రెండో అత్యుత్తమ స్థానంలో నిలిచిన సాత్విక్ - చిరాగ్ జోడీ తదుపరి రౌండ్‌లో మరో మలేషియా జోడీ మాన్ వీ చోంగ్ - కై వున్ టీతో తలపడనున్నారు. కాగా, కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేతలైన ట్రీసా జాలీ, గాయత్రీ గోపీచంద్ కూడా మహిళల డబుల్స్‌లో ఆల్-ఇండియన్ ఓపెనింగ్ మ్యాచ్‌లో అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టోపై 16-21, 21-19, 21-17 తేడాతో విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు.

French Open 2024: ఫ్రెంచ్ ఓపెన్‌లో భారత ఆటగాళ్ల సత్తా.. రెండో రౌండ్‌కు చేరిన సాత్విక్-చిరాగ్, ట్రీసా-గాయత్రి జోడీ
Satwiksairaj Chirag
Venkata Chari
|

Updated on: Mar 05, 2024 | 4:49 PM

Share

Satwiksairaj Rankireddy – Chirag Shetty: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి మంగళవారం మలేషియాకు చెందిన ఓంగ్ యూ సిన్, టియో ఈయి జోడీపై వరుస గేమ్‌లల్లో విజయం సాధించారు. దీంతో భారత జోడీ రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. సాత్విక్, చిరాగ్ జోడీ ప్రపంచ నం. 1 ర్యాంక్‌ను 2022లో క్లెయిమ్ చేశారు. మంగళవారం ఆసియా క్రీడల ఛాంపియన్‌లు ప్రపంచ నం. 12 మలేషియా జోడీపై 21-13, 24-22తో 47 నిమిషాల్లో చివరి ఎనిమిది గేమ్స్‌ల్లో ఐదో విజయం సాధించింది.

తమ గత మూడు టోర్నీల్లో రెండో అత్యుత్తమ స్థానంలో నిలిచిన సాత్విక్, చిరాగ్ తదుపరి రౌండ్‌లో మరో మలేషియా జోడీ మాన్ వీ చోంగ్, కై వున్ టీతో తలపడనున్నారు. కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేతలైన ట్రీసా జాలీ, గాయత్రీ గోపీచంద్ కూడా మహిళల డబుల్స్‌లో ఆల్-ఇండియన్ ఓపెనింగ్ మ్యాచ్‌లో అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టోపై 16-21, 21-19, 21-17 తేడాతో విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు.

ఈ రెండు జోడీలు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు పోరాడుతున్నాయి. తనీషా-అశ్విని 11వ ర్యాంక్‌లో ఉండగా, త్రీసా-గాయత్రి ఒలంపిక్ గేమ్స్ క్వాలిఫికేషన్ ర్యాంకింగ్‌లో 14వ స్థానంలో నిలిచారు.

ఇవి కూడా చదవండి

గత నెలలో మలేషియాలోని షా ఆలమ్‌లో జరిగిన బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు అద్భుత విజయంలో కీలక పాత్ర పోషించిన ట్రీసా, గాయత్రి జోడీ రెడ్-హాట్ ఫామ్‌లో ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...