Google Year in Search 2021: గూగుల్‌లో ఎక్కువ మంది వెతికిన వ్యక్తిగా నీరజ్ చోప్రా.. ఆ తర్వాతి స్థానంలో ఆర్యన్ ఖాన్..
గూగుల్‌లో 2021సంవత్సరంలో అత్యధిక మంది వెతికిన వ్యక్తిగా ఒలింపిక్స్ గోల్డ్ మోడల్ విన్నర్ నీరజ్ చోప్రా నిలిచారు. ఇందుకు సంబంధంచిన వివరాలను గూగుల్ బుధవారం ప్రకటించింది...
గూగుల్‌లో 2021సంవత్సరంలో అత్యధిక మంది వెతికిన వ్యక్తిగా ఒలింపిక్స్ గోల్డ్ మోడల్ విన్నర్ నీరజ్ చోప్రా నిలిచారు. ఇందుకు సంబంధంచిన వివరాలను గూగుల్ బుధవారం ప్రకటించింది. వార్షిక సంవత్సర శోధన నివేదికలో చలనచిత్రాలు, వార్తల ఈవెంట్‌లు, వంటకాలు మరెన్నో ఉన్నాయి. కోవిడ్-19 ఏడాది పొడవునా ఉన్నందున, ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ పెద్ద వనరుగా మారింది. భారతదేశంలో 2021లో అత్యధికంగా శోధించబడిన వ్యక్తుల్లో నీరజ్ చోప్రా, ఆర్యన్ ఖాన్, షెహనాజ్ గిల్, రాజ్ కుంద్రా, ఎలాన్ మస్క్ మొదటి ఐదు స్థానాల్లో నిలిచారు.
పురుషుల జావెలిన్ త్రోలో టోక్యో ఒలింపిక్స్ 2020లో బంగారు పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయుడిగా నీరజ్ చోప్రా రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ షిప్లో డ్రగ్స్‌తో పట్టుపడ్డాడు. అతడు దాదాపు 22 రోజులు ముంబై జైలులో ఉన్నాడు. ఆర్యన్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో షెహనాజ్ గిల్ నిలిచారు. ఆమె పంజాబీ చిత్రం హోన్స్లా రఖ్ కారణంగా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. పోర్న్ ఫిల్మ్ రాకెట్‌కు సంబంధించి అరెస్టయిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా నాల్గో స్థానంలో ఉన్నారు.
జాబితాలో చివరిగా టెస్లా CEO ఎలోన్ మస్క్ ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో విక్కీ కౌశల్, పీవీ సింధు, బజరంగ్ పునియా, సుశీల్ కుమార్, వరుణ్ ధావన్ భార్య నటాషా దలాల్ ఉన్నారు.
Read Also.. Virat Kohli: వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పిస్తారా.. రోహిత్ శర్మకే బాధ్యతలు అప్పగిస్తారా..