Beijing Olympics: చైనాలో వింటర్ ఒలింపిక్స్ జరుగుతాయంటున్న ఐవోసీ.. దౌత్య బహిష్కరణ చేయాలంటూ అమెరికా పిలుపు

Beijing Winter Olympics: చైనా లో పుట్టిన.. ప్రపంచ దేశాలను గత రెండేళ్లగా వణికిస్తూనే ఉంది. ఈ వైరస్ మహమ్మారి సృష్టించిన కల్లోలంతో  మనుషులతో పాటు అనేక రంగాలు ఇబ్బందులు..

Beijing Olympics: చైనాలో వింటర్ ఒలింపిక్స్ జరుగుతాయంటున్న ఐవోసీ.. దౌత్య బహిష్కరణ చేయాలంటూ అమెరికా పిలుపు
Beijing Winter Olympics
Follow us

|

Updated on: Dec 08, 2021 | 4:38 PM

Beijing Winter Olympics: చైనా లో పుట్టిన.. ప్రపంచ దేశాలను గత రెండేళ్లగా వణికిస్తూనే ఉంది. ఈ వైరస్ మహమ్మారి సృష్టించిన కల్లోలంతో  మనుషులతో పాటు అనేక రంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రీడా రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. కరోనా వైరస్ కారణంగా ఒలింపిక్స్, సాకర్,  క్రికెట్ ఇలా ఇది అది అని కాదు.. అనేక క్రీడల నిర్వహణ అధికారులకు సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో 2022 ఫిబ్రవరిలో చైనా రాజధాని బీజింగ్ వేదికగా జరిగే శీతాకాల ఒలింపిక్స్ పై నీలినీడలు పడుతున్నాయి. తాజాగా కొరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ ప్రపంచవ్యాప్తంగా పంజా విసురుతున్న నేపథ్యంలో ఈ క్రీడల నిర్వహణపై అనుమాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై తాజాగా అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ స్పందించింది.

2020లో జరగాల్సిన  టోక్యో ఒలింపిక్స్‌.. కరోనా వలన వాయిదాపడి.. 2021 జూలైలో జరిగిన విషయాన్నీ గుర్తు చేసుకుంది. అప్పటిలా ఇప్పుడు చైనాలో జరిగే శీతాకాల ఒలింపిక్స్‌ వాయిదా పడే పరిస్థితులు తలెత్తవని ఐవోసీ ప్రకటించింది.  తనకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులనుచూస్తుంటే శీతాకాల ఒలింపిక్స్ నిర్వహణ వాయిదా వేయాలి అన్నంత తీవ్రత కనిపించడం లేదని ఐవోసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫ్‌ డుబి చెప్పారు.  అంతేకాదు చైనా ఒలంపిక్స్  కోసం చేస్తున్న ఏర్పాట్లను ఈ సందర్భంగా ప్రస్తావించారు. బీజింగ్ శీతాకాల ఒలింపిక్స్ కోసం అక్కడ అధికారులు క్లోజ్డ్ లూప్ సిస్టమ్ ని ఏర్పాటు చేసిందని.. అది చాలా పటిష్టమైనదని చెప్పారు. ఈ రెండేళ్లలో కరోనా  వైరస్ గురించి చాలా తెలుసుకున్నాం.. ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నాం.. కనుక తగిన జాగ్రత్తలు తీసుకుంటామని .. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పక్కా ప్రణాళికతో శీతాకాల ఒలింపిక్స్ ని నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు క్రిస్టోఫ్‌ డుబి. ఈ ఒలింపిక్స్ కూడా విజయవంతం అవుతాయని.. క్రీడాకారులందరూ క్షేమంగా ఉంటారని.. కనుక నెక్ట్ ఇయర్ జరగాల్సిన ఒలింపిక్స్ వాయిదా పడే అవకాశం లేదని చెప్పారు.

ప్రపంచాన్ని  గజగజవణికిస్తోన్న కరోనా వైరస్ పుట్టుక గురించి ముందుగా హెచ్చరించని చైనాపై ప్రపంచంలోని చాలా దేశాలు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనాలో జరుగుతున్న ఈ వింటర్ ఒలింపిక్స్ ను అమెరికా ‘దౌత్య బహిష్కరణ’  చేయాలంటూ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Also Read:  తిరుమలలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన.. అద్దె గదుల కోసం శ్రీవారి భక్తుల అవస్థలు